32.6 C
India
Tuesday, May 7, 2024
More

    విడిపోయిన అన్నాదమ్ములను కలిపిన బలగం చిత్రం

    Date:

    Two brothers meet after watch balagam movie
    Two brothers meet after watch balagam movie

    విడిపోయిన అన్నాదమ్ములను కలిపింది బలగం చిత్రం. అదేంటి అన్నాదమ్ములకు , బలగం చిత్రానికి సంబంధం ఏంటి ? అని అనుకుంటున్నారా ? నిర్మల్ జిల్లాలోని లక్ష్మణ్ చాంద అనే గ్రామానికి చెందిన గుర్రం పోశాలు , గుర్రం రవి ఇద్దరు అన్నాదమ్ములు. వారసత్వంగా వచ్చిన భూమి విషయంలో అన్నా – తమ్ముడు మధ్య గొడవలు పెరిగాయి. దాంతో ఇరు కుటుంబాల మధ్య మాటలు లేకుండాపోయాయి. దాంతో ఈ ఇద్దరు అన్నాదమ్ములను కలపడానికి చుట్టాలు , పెద్దలు ప్రయత్నాలు చేసారు కానీ కుదరలేదు. ఈ తతంగంలో గొడవలు మరింత ముదిరి పచ్చగడ్డి వేస్తే భగ్గుమనే స్థాయికి చేరుకుంది.

    అలా సంవత్సరాలు గడిచి పోయాయి. కోపం కూడా తగ్గిపోయింది. సరిగ్గా ఇదే సమయంలో బలగం అనే సినిమా విడుదల అయ్యింది. ఈ సినిమాలో మానవ సంబంధాల గురించి వివరించారు. బలగం సినిమా హృదయాలను హత్తుకునేలా ఉండటంతో నిర్మల్ జిల్లాలోని లక్ష్మణ్ చాంద లో కూడా ఊరందరికీ బలగం చిత్రాన్ని ప్రదర్శించాడు సర్పంచ్. ఇక ఈ సినిమాకు గుర్రం బ్రదర్స్ కూడా కుటుంబ సమేతంగా వచ్చారు. సినిమా చూశాక వాళ్లలో కన్నీళ్లు కట్టలు తెంచుకుందట. మానవ జన్మ ముందు ఈ తుచ్ఛమైన డబ్బు , ఆస్తులు ఏంటి ? ఇన్నాళ్లు భూమి కోసం అన్నా దమ్ముల అనుబంధాన్ని దూరం చేసుకున్నామే అంటూ పశ్చాత్తాప పడ్డారట. అంతేకాదు భూమి విషయంలో ఇద్దరూ తగ్గి పరిష్కరించుకున్నారు. అన్నాదమ్ములుగా గెలిచారు. దాంతో సర్పంచ్ తో పాటుగా ఆ ఊరి ప్రజలు సంతోషం వ్యక్తం చేస్తున్నారు. బలగం సినిమా ఒక మంచి పని చేసింది అని సంబర పడుతున్నారు.

    Share post:

    More like this
    Related

    DIG Ammireddy : అనంతపురం డీఐజీ అమ్మిరెడ్డి బదిలీ – తక్షణమే రిలీవ్ కావాలని ఈసీ ఆదేశం

    DIG Ammireddy : ఎన్నికల వేళ పలువురు పోలీసు అధికారులను ఎన్నికల...

    MLC Kavitha : ఎమ్మెల్సీ కవితకు మళ్లీ చుక్కెదురు – మద్యం కేసులో నో బెయిల్

    MLC Kavitha : మద్యం కేసులో బీఆర్ఎస్ ఎమ్మెల్సీ కవితకు మళ్లీ...

    Pawan Kalyan : దట్ ఈజ్ పవన్.. షారూఖ్ కన్నా ఎక్కువ డబ్బులిస్తామన్నా నో చెప్పాడట

    Pawan Kalyan : పవర్ స్టార్ పవన్ కల్యాణ్ గురించి.. ఆయనకున్న...

    POLLS

    [yop_poll id="2"]

    Latest News

    - Download the UBlood app here -

    Photos

    - Advertisement -

    Popular

    More like this
    Related

    Jagtial : మూలుగు బొక్క కోసం పెళ్లి రద్దు.. జగిత్యాల జిల్లాలో ‘బలగం’ మూవీ రిపీట్

    Jagtial : చిన్న సినిమాగా వచ్చి పెద్ద హిట్ గా నిలిచిన...

    balagam : బలగం లాగే సెన్సేషన్..? ఈ సినిమాను చూశారా?

    balagam : మొదట్లో క్యారెక్టర్ ఆర్టిస్ట్ గాచేసిన తిరువీర్ మసూదతో హీరోగా...

    Balagam : బలగం సినిమాలో లచ్చవ్వ పాత్రలో నటించింది ఎవరో తెలుసా?

    Balagam చిన్న సినిమాలు విజయాలు నమోదు చేయడం కొత్తేమీ కాదు. ఎలాంటి...

    kavya : నాపై దర్శకులు విపరీత కామెంట్లు చేశారు.. నటి కావ్య కల్యాణ్ రామ్

    kavya మన సినిమా పరిశ్రమలో చాలా మంది బాల నటులుగా వచ్చిన...