37 C
India
Tuesday, May 7, 2024
More

    మాస్‌ మహారాజా బాలీవుడ్ ఎంట్రీ..

    Date:

    Mass Maharaja's Bollywood entry..
    Mass Maharaja’s Bollywood entry..

    పాన్ ఇండియా సినిమాల ట్రెండ్ పెరిగిన తర్వాత టాలీవుడ్ హీరోలకు క్రేజ్ విపరీతంగా పెరిగిపోయింది. బాలీవుడ్ హీరోల సినిమాలు ఫ్లాప్ అవుతుండడంతో.. మన హీరోల పేర్లు మారుమోగిపోతున్నాయి. టాలీవుడ్ హీరోలు చిన్న రోల్ చేస్తే చాలు అనుకునే స్థితిలో ఉంది బాలీవుడ్. ఐతే ఇదంతా ఎలా ఉన్నా.. మరో టాలీవుడ్ హీరో బాలీవుడ్ ఎంట్రీ ఇవ్వడానికి సిద్ధమైనట్లు తెలుస్తోంది. ఆ హీరో మరెవరో కాదు.. క్రాక్, ధమాకా, వాల్తేరు వీరయ్య, రావణాసుర అంటూ బ్యాక్‌ టు బ్యాక్‌ సినిమాలతో హిట్లు కొడుతూ.. తిరిగి ఫామ్‌లోకి వచ్చిన మాస్ మహారాజ్ రవితేజ.

    ఒక రీమేక్ కోసం రవితేజను ఒప్పించేందుకు హిందీ ఫిల్మ్ మేకర్స్‌ ప్రయత్నాలు చేస్తున్నట్టు తెలుస్తోంది. అందులో బాలీవుడ్ యంగ్ హీరో వరుణ్ ధావన్ నటించబోతున్నట్టు ఫిల్మ్‌నగర్ టాక్. అది కూడా సౌత్ రీమేక్ సినిమాలో ఈ ఇద్దరు హీరోలు కనిపించబోతున్నారట. తమిళంలో కలెక్షన్ సునామి క్రియేట్ చేసిన మానాడు సినిమాను బాలీవుడ్‌లో రీమేక్‌ చేయబోతున్నట్లు వార్తలు జోరుగా వినిపిస్తున్నాయ్.

    కాగా తమిళంలో శింబు నటించిన పాత్రలో వరుణ్‌ చేయగా.. ఎస్‌జే సూర్య చేసిన పాత్రలో రవితేజ చేయనున్నట్లు సమాచారం. ప్రస్తుతం ఈ సినిమాకు సంబంధించిన విషయాలు చర్చల దశలో ఉన్నట్లు తెలుస్తోంది. ఆల్మోస్ట్ ప్రాజెక్ట్ కన్ఫామ్ అయినట్టుగానే వార్తలు వినిపిస్తున్నాయ్. ఈ సినిమాను రానా, ఏషియన్‌ సునీల్‌తో కలిసి కరణ్‌ జోహర్‌ నిర్మించేందుకు సిద్ధం అవుతున్నాడు. ఇదే నిజమైతే మరో టాలీవుడ్ హీరో బాలీవుడ్ ఎంట్రీ కన్ఫామ్ అని చెప్పవచ్చు

    Share post:

    More like this
    Related

    Elon Musk : రీ యూజ్ రాకెట్లు అయితే మరింత మేలు.. ఎలన్ మస్క్

    Elon Musk : అంతరిక్షంలోకి వ్యోమగాములు, సందర్శకులను పంపేందుకు రీ యూజ్...

    Parvati Melton : పార్వతి మెల్టన్ కు ఏమైంది.. ఇలా అయిపోయిందేంటీ?

    Parvati Melton : జల్సా మూవీ సినిమాలో ఇలియానా ఫస్ట్ హిరోయిన్...

    Jai Swaraajya TV Debate : తెలంగాణ పొలిటికల్ : జై స్వరాజ్యలో ఆసక్తిగా సాగిన డిబెట్..

    Jai Swaraajya TV Debate : పార్లమెంట్ ఎన్నికలకు వారం గడువు...

    POLLS

    [yop_poll id="2"]

    Latest News

    - Download the UBlood app here -

    Photos

    - Advertisement -

    Popular

    More like this
    Related

    Ravi Teja : రవితేజ నెక్ట్స్ మూవీ ఇదే.. ప్రకటించిన మాస్ మహరాజ..

    Ravi Teja : రీసెంట్ గా హిట్ అయిన ‘టిల్లు స్క్వేర్’...

    Box Office : బాక్సాఫీస్ వద్ద డల్ వీకెండ్.. ఫస్ట్ 5 పై ఓ లుక్కేయండి

    Box Office  Weekend : ఈగల్ : మాస్ మహరాజ్ రవితేజ...

    Hero Remuneration : ఆ హీరో రెమ్యునరేషన్ ప్రస్తుతం రూ.15 కోట్లు తెలుసా?

    Hero Remuneration : సినిమా పరిశ్రమలో ఎవరి లక్ ఎటు తిరుగుతుందో...

    Ravi Teja Eagle : ఈగిల్ సంక్రాంతి బరి నుంచి తప్పుకుంటే సమస్యలు పరిష్కారం అవుతాయా?

    Ravi Teja Eagle : తెలుగు ఫిల్మ్ ఛాంబర్ ఆఫ్ కామర్స్,...