41.2 C
India
Sunday, May 5, 2024
More

    నిద్రలేమి సమస్యలను ఆ పానీయాలే దూరం చేస్తాయి

    Date:

    sleeplessness
    sleeplessness

    ప్రస్తుత కాలంలో నిద్ర లేమి సమస్యలతో చాలా మంది బాధపడుతున్నారు. అర్థరాత్రి అయినా నిద్ర పట్టక పక్క అటు ఇటు పొర్లిస్తూ నిద్ర కోసం వేదన పడుతున్నారు. దీంతో అనారోగ్య సమస్యలతో సతమతమవుతున్నారు. నిద్ర పట్టేందుకు ఏ మందులు వాడాలో కూడా తెలియడం లేదు. కానీ మన ఆహారాలే మనకు నిద్ర దూరం చేస్తాయనే విషయం చాలా మందికి తెలియదు. ఈ నేపథ్యంలో నిద్రలేమిని దూరం చేసుకునే కొన్ని పానీయాల గురించి తెలుసుకుంటే సరి.

    మనకు మంచి నిద్ర పట్టాలంటే అశ్వగంధ చూర్ణం బాగా పనిచేస్తోంది. రాత్రి సమయంలో పాలలో ఈ చూర్ణం కలుపుకుని తాగితే మంచి ఫలితం ఉంటుంది. నిద్రలేమి సమస్య నుంచి దూరం కావొచ్చు. బాదం పొడి పాలలో కలుపుకుని తాగితే నిద్రలేమి సమస్య నుంచి ఉపశమనం పొందొచ్చు. ఇలా నిద్రలేమి సమస్యలనుంచి తప్పించుకునేందుకు వీటిని తాగితే ఫలితం ఉంటుంది.

    పాలతో తేనె కలుపుకుని తాగితే కూడా మంచి నిద్ర పట్టేందుకు ఆస్కారం ఉంటుంది. అరటిపండు ఆల్మండ్ బటర్ కూడా సుఖమైన నిద్ర పట్టేందుకు మంచి మార్గం ఉంటుంది. రాత్రి సమయంలో పడుకునే ముందు అరటిపండు ముక్కలు ఆల్మండ్ బటర్, పాలు కలుపుకుని మిక్సీ పట్టుకుని తాగడం వల్ల మంచి నిద్ర మన సొంతం అవుతుంది. ఈ నేపథ్యంలో నిద్ర సరిగా వచ్చేందుకు ఇవి సాయపడతాయి.

    పాలలో దాల్చిన చెక్క పొడి కలుపుని తాగడం వల్ల మంచి ఫలితం ఉంటుంది. ద్రాక్ష రసం తాగడం వల్ల కూడా మనకు చక్కని నిద్ర సాధ్యమవుతుంది. ఇందులో ఉండే మెలటోనిన్ అనే హార్మోన్ మనకు నిద్ర పట్టేలా చేస్తుంది. ఇంకా చామంతి టీ కూడా మనకు గాఢమైన నిద్ర పట్టేలా చేస్తుంది. ఇలా ఇన్ని రకాల పానీయాలు మన నిద్ర లేమి సమస్యలను దూరం చేస్తాయి.

    Share post:

    More like this
    Related

    Free Villa : 42 ఎకరాల్లో పెద్ద విల్లా..ఉచితంగా ఇస్తారట త్వరపడండి మరి!

    Free Villa : నగరాల్లో ఏ చిన్న ఇల్లు కొనాలన్నా లక్షల్లో...

    US Student Visas : మే రెండో వారంలో.. యూఎస్ స్టూడెంట్ వీసాలు

    US Student Visas : ఉన్నత విద్యాభ్యాసం కోసం అమెరికా వెళ్లాలని...

    POLLS

    [yop_poll id="2"]

    Latest News

    - Download the UBlood app here -

    Photos

    - Advertisement -

    Popular

    More like this
    Related

    Good Sleep : మహిళలు సరిగ్గా నిద్రపోకపోతే ఈ ప్రమాదంలో ఉన్నట్లే లెక్క!

    Good Sleep : మనిషికి నిద్ర చాలా అవసరం. శరీరానికి సరైన...

    Sleep well : నిద్ర సరిగా లేకుంటే ఈ జబ్బులను కొని తెచ్చుకున్నట్లే..!

    Sleep well : జీవి ఆరోగ్యంగా ఉండాలంటే తినడం, వ్యాయామం ఎంత...

    Milk Good For Heart : పాలు తాగడం వల్ల గుండెకు మంచిదేనా?

    Milk Good For Heart : పాలు తాగడం వల్ల ఆరోగ్యానికి...

    Mother : ఇదేం పని తల్లీ..

    పాప ఏడుస్తుందని పాలకు బదులు మద్యం పట్టించిన మహిళ అనారోగ్యానిక గురైన నెలన్నర...