34.5 C
India
Monday, May 6, 2024
More

    TDP : అమరావతిపై టీడీపీ సైలెంట్

    Date:

    • కొంత కాలంగా నోరు మెదపని సైకిల్ పార్టీ
    • ఎన్నికల నేపథ్యంలో వ్యూహాత్మక అడుగులా..?
    TDP
    TDP

    TDP is silent on Amaravati : అమరావతి తమ రాజధాని అని నిన్న మొన్నటి వరకు హోరెత్తించిన టీడీపీ నేతలు కొంత కాలంగా సైలెంట్ అయ్యారు. రైతుల ఆందోళనలకు బాహాటంగా మద్దతునిచ్చిన ఆ పార్టీ కొన్ని రోజులుగా ఆ పదాన్నే ఉచ్చరించడం లేదు. దీని వెనుక రాజకీయ చతురత కలిగిన చంద్రబాబు వ్యూహాత్మక మౌనం ఏంటో తెలియక టీడీపీ శ్రేణులు తికమక పడుతున్నారు. మరో ఏడాదిలో ఎన్నికలు ఉండగా, అమరావతి అంశం కొంత పక్కకు పెట్టాలనే ఆలోచనలో పార్టీ ఆధిష్ఠానం భావిస్తున్నదనే ప్రచారం వినిపిస్తున్నది.

    అమరావతి.. అపవాదు రాష్ర్టంలో ఎన్నో ప్రాంతాలు ఉండగా, అమరావతిపైనే గతంలో టీడీపీ దృష్టి పెట్టింది. రాజధానిగా అభివృద్ధి చేసేందుకు అడుగులు వేసింది. ఐదు కోట్ల ప్రజల కలల రాజధానిలా కడుతామని ఢంకా బజాయించి మరి చెప్పింది. ఇందుకోసం ఎన్నో ప్రణాళికలు రూపొందించింది. తమ పార్టీ శ్రేణులు, అనుయాయులకు లబ్ధి చేకూరేలా అమరావతి నిర్ణయం జరిగిందని నాటి ప్రతిపక్షం ఆరోపించినా ఏ మాత్రం వెనక్కి తగ్గలేదు. అక్కడే కథ అడ్డం తిరిగింది. ఆ తర్వాత జరిగిన ఎన్నికల్లో టీడీపీ ఓడిపోవడంతో కథ కంచికి చేరింది.

    అమరావతిలో వైసీపీ మార్క్ రాజకీయం

    కాగా అమరావతిలో భూములను పేదలకు పట్టాలు ఇవ్వడానికి వైసీపీ ప్రభుత్వం సిద్ధమవడంతో టీడీపీ రాజకీయాన్ని మొదలుపెట్టింది. రైతులు న్యాయస్థానాన్ని ఆశ్రయించేలా చేసి స్టే తెచ్చింది. కానీ హైకోర్టు ప్రభుత్వానికి అనుకూలంగా తీర్పు ఇవ్వడంతో ఇక పంచాయతీ ఢిల్లీకి చేరింది. ప్రస్తుతం పట్టాల అంశం సుప్రీం కోర్టుకు చేరింది. త్వరలోనే విచారణ జరుగనుంది. కాగా, పేదలకు ఇండ్లను అడ్డుకుంటున్నదనే అపవాదును టీడీపీపై వేసింది వైసీపీ. దీనిని తిప్పకొట్టడంలో టీడీపీ అధిష్ఠానం విఫలమైంది. ఈ విషయంలో టీడీపీ కలుగజేసుకోవడం లేదు. ప్రస్తుతం ఈ విషయంలో కలుగజేసుకుంటే మొదటికే ముప్పు వస్తుందని భావిస్తున్నది. అందుకే అచితూచి వ్యవహరిస్తున్నది.  ఈ నేపథ్యంలోనే టీడీపీ అమరావతి అంశంపై ప్రస్తుతం తెరచాటు రాజకీయాలు చేస్తున్నదని, బహిరంగంగా మాట్లాడడం లేదనే ప్రచారం వినిపిస్తున్నది.

    Share post:

    More like this
    Related

    Viral Poster : నోటి దురుసు నాయకులను ఓడిద్దాం – సోషల్ మీడియాలో వైరల్

    Viral Poster : బూతులు, నోటి దురుసు నాయకులను ఓడించాలని ఓ...

    Uttar Pradesh : స్టేషన్ మాస్టర్ నిద్రలో.. అరగంట నిలిచిన రైలు

    Uttar Pradesh : ఓ స్టేషన్ మాస్టర్ నిద్ర  ఓ ఎక్స్...

    CM Revanth : ‘దానం’ను కేంద్రమంత్రి చేస్తా..: సీఎం రేవంత్

    CM Revanth : బీఆర్ఎస్ నుంచి కాంగ్రెస్ పార్టీలోకి వచ్చి సికింద్రాబాద్...

    POLLS

    [yop_poll id="2"]

    Latest News

    - Download the UBlood app here -

    Photos

    - Advertisement -

    Popular

    More like this
    Related

    Amaravati Movement : 1600వ రోజుకు చేరిన అమరావతి ఉద్యమం

    Amaravati Movement : అమరావతి ఉద్యమం 1600వ రోజుకు చేరుకున్న సందర్భంగా...

    TDP : టీడీపీలో రగులుతున్న అసంతృప్తి జ్వాలలు..

    TDP : తెలుగుదేశం పార్టీ మూడో జాబితా టికెట్లు కేటాయింపు అగ్గి...

    TDP Second List : రేపు టీడీపీ రెండో జాబితా.. బీజేపీతో పొత్తుపై చంద్రబాబు కీలక వ్యాఖ్యలు..

    TDP Second List : ఏపీలో ఎటూ  చూసినా ఎన్నికల కోలాహలమే...

    Maha Shivratri Celebrations : బ్రహ్మ కుమారీస్ ఆధ్వర్యంలో ఘనంగా మహాశివరాత్రి వేడుకలు

    Maha Shivratri Celebrations : బ్రహ్మకుమారీస్ యూనివర్సల్ పీస్ రిట్రీట్ సెంటర్...