40.8 C
India
Sunday, April 28, 2024
More

    జాతీయస్థాయిలో  వైసీపీ ట్రెండింగ్..

    Date:

    YCP trending
    YCP trending

    ఏపీ సీఎం జగన్ అధికారంలోకి వచ్చి నాలుగేళ్లు పూర్తి చేసుకున్నారు. ఆయన ఇప్పటికే ఎన్నో సంక్షేమ పథకాలతో ఏపీ ప్రజల అభిమానం సంపాదించుకున్నారు. అయితే వైసీపీ అధికారంలోకి వచ్చి నాలుగేళ్లు పూర్తి చేసుకున్న సందర్భంగా #YSRCPAgain2024 పేరిట హ్యాష్ ట్యాగ్ ను క్రియేట్ చేసింది. ప్రస్తుతం ఇదే దేశవ్యాప్తంగా ట్రెండింగ్ గా మారింది..

    #YSRCPAgain2024 హ్యాష్ ట్యాగ్ ను క్రియేట్ చేసిన కొన్ని నిమిషాల్లోనే ట్రెండింగ్ లోకి వెళ్లింది జాతీయస్థాయిలో ఇప్పుడు ఇది నెంబర్ వన్ ప్లేస్ లో ట్రెండ్ అవుతున్నది నాలుగేళ్లలో వైసీపీ సాధించిన విజయాలు, సంక్షేమ కార్యక్రమాలు, రాజకీయంగా సాధించిన విజయాలు, పథకాలు, ఇతర అంశాలను వైసీపీ అభిమానులు కార్యకర్తలు సోషల్ మీడియా ఇన్చార్జిలు పోస్ట్ చేస్తున్నారు. వైఎస్ జగన్ ప్రజల కోసం చేపట్టిన కార్యక్రమాలు ప్రస్తుతం చర్చినీయాంశమయ్యాయి.

    అయితే హ్యాష్ ట్యాగ్ ను క్రియేట్ చేసిన కొన్ని నిమిషాల్లోనే జాతీయస్థాయిలో మొదటి స్థానంలో ట్రెండింగ్ అవడం వైసీపీ నేతల ఆనందానికి అవధులు లేకుండా పోయాయి. సోషల్ మీడియాను వైసీపీ బలంగా ఉపయోగించుకుంటున్నదనే టాక్ కు ఇది మరింత ఊతమిచ్చింది గతంలో జగన్ పాదయాత్ర సమయంలోనూ సోషల్ మీడియా కీలక పాత్ర పోషించింది ప్రస్తుతం కూడా ‘వై నాట్ 175’ పేరిట వైసీపీ నేతలు సోషల్ మీడియాలో ప్రచారానికి సిద్ధమవుతున్నారు. జగన్ అమలు చేస్తున్న పథకాలు తమను అధికారంలోకి తీసుకొస్తాయని భావిస్తున్నారు.

    మరోవైపు పీకే టీం కూడా వైసీపీకి అనుకూలంగా ఏపీలో ప్రస్తుత ప్రచారం చేస్తున్నది. సోషల్ మీడియా వేదికగా చేసుకొని వైసీపీ చేస్తున్న కార్యక్రమాలు అదేవిధంగా టీడీపీపై విమర్శలు పీకే టీం చూసుకుంటున్నది. 2024లో ఎన్నికలపై ఈ సోషల్ మీడియా ఏ  విధంగా ప్రభావం చూపునుందో మరి.

    Share post:

    More like this
    Related

    Faria Abdullah : ‘ఆ ఒక్కటి అడక్కు’ మంచి ఎంటర్‌టైన్ మూవీ: ఫరియా అబ్దుల్లా

    Faria Abdullah : అల్లరి నరేష్, ఫరియా అబ్దుల్లా జంటగా నటించిన...

    GT Vs RCB : గుజరాత్ టైటాన్స్.. ఆర్సీబీ మ్యాచ్ లో గెలుపెవరిదో

    GT Vs RCB : గుజరాత్ టైటాన్స్,  ఆర్సీబీ మధ్య అహ్మదాబాద్...

    LSG Vs RR : లక్నోపై రాజస్థాన్ రాయల్స్ ఘన విజయం

    LSG Vs RR : లక్నో సూపర్ గెయింట్స్ పై అటల్...

    Indian Film Industry : ఇండియన్ సినిమా ఇండస్ట్రీలో కొత్త ట్రెండ్? కొనసాగుతుందా?

    Indian Film Industry : సాధారణంగా వీకెండ్ ను సద్వినియోగం చేసుకునేందుకు...

    POLLS

    [yop_poll id="2"]

    Latest News

    - Download the UBlood app here -

    Photos

    - Advertisement -

    Popular

    More like this
    Related

    CM Jagan : బ్యాండేజ్ తీసిన సీఎం జగన్.. వైసీపీ మేనిఫెస్టో విడుదల

    CM Jagan : ఈరోజు సీఎం జగన్ తాడేపల్లి క్యాంప్ ఆఫీసులో...

    YCP : వైసీపీ లోకి జనసేన నుండి భారీ చేరికలు

    YCP Vs Janasena YCP VS Janasena : సీఎం జగన్ పాలన చూసి...

    CM Ramesh : బీఆర్ఎస్ కంటే వైసీపీ వేగంగా ఖాళీ.. సీఎం రమేశ్ సంచలన కామెంట్..

    CM Ramesh : ఆంధ్రప్రదేశ్ లో అసెంబ్లీ, పార్లమెంట్ ఎన్నికలు ఏక...

    KCR : జగన్ మళ్లీ గెలుస్తారు: కేసీఆర్

    KCR : ఏపీలో జరిగే ఎన్నికల్లో జగన్ మళ్లీ గెలుస్తారనే సమాచారం...