39.4 C
India
Monday, April 29, 2024
More

    Relief to Avinash : అవినాష్ కు తెలంగాణ హైకోర్టు ఊరట..

    Date:

    Relief to Avinash
    Relief to Avinash, Kadapa MP

    Relief to Avinash : వైఎస్ వివేకా హత్య కేసులో ఆరోపణలు ఎదుర్కొంటున్న కడప ఎంపీ వైఎస్ అవినాష్ రెడ్డికి తెలంగాణ హైకోర్టులో ఊరట లభించింది. సీబీఐ అరెస్టు చేయకుండా ముందస్తు బెయిలు ఇవ్వాలని తెలంగాణ హైకోర్టులో అవినాష్ ఇటీవల పిటిషన్ దాఖలు చేశారు. మూడు రోజులపాటు వాదనలు విన్న జడ్జి బుధవారం తీర్పు వెలువరించారు. అవినాష్ రెడ్డికి ముందస్తు బెయిల్ మంజూరు చేశారు అయితే షరతులు విధించారు.

    సీబీఐ కి అవినాష్ రెడ్డి పూర్తిగా సహకరించాలని, ప్రతి శనివారం విచారణకు హాజరు అవ్వాలని సూచించారు. సీబీఐ అనుమతి లేకుండా దేశం విడిచి వెళ్లడానికి వీలులేదని ఆదేశించారు. రూ. 5 లక్షలతో రెండు పూచికత్తులు ఇవ్వాలని తీర్పులో పేర్కొన్నారు. ఒకవేళ అవినాష్ రెడ్డి సహకరించకపోతే సీబీఐ అధికారులు మళ్ళీ కోర్టును సంప్రదించవచ్చని పేర్కొన్నారు. బెయిల్ నిబంధనలను ఉల్లంఘించినా కోర్టును సంప్రదించవచ్చని తెలిపారు.

    కాగా వైయస్ వివేకా హత్య కేసులో అవినాష్ రెడ్డికి సంబంధించి వ్యతిరేకంగా ఎలాంటి సాక్షాలు సీబీఐ చూపించినందునే హైకోర్టు ముందస్తు బెయిలు మంజూరు చేసిందని సమాచారం. కాగా అవినాష్ రెడ్డికి బెయిల్ మంజూరు పై ఆయన అనుచరులు  సంతోషం వ్యక్తం చేశారు. అయితే సీబీఐ అరెస్టు చేయనుందనే వార్తల నేపథ్యంలో అవినాష్ కు తెలంగాణ హైకోర్టు తీర్పు పెద్ద రిలీఫ్ అనుకోవచ్చు

    మరోవైపు హైకోర్టు తీర్పుపై  పలువురు న్యాయవాదులు విస్మయం వ్యక్తం చేశారు. అవినాష్ కు ముందస్తు బెయిల్ ఇస్తే సిబిఐ విచారణకు ఆటంకం కలుగుతుందని విన్నవించినా, కోర్టు పట్టించుకోలేదని పేర్కొన్నారు. అయితే ఈ తీర్పుపై వైఎస్ వివేకా కూతురు సునీత ఎలా స్పందిస్తారని అంతా చర్చించుకుంటున్నారు.

    Share post:

    More like this
    Related

    AB Venkateswara Rao : కేంద్ర పరిపాలనా ట్రిబ్యునల్‌లో ఏబీ వెంకటేశ్వరరావు కేసు విచారణ – తీర్పును వాయిదా వేసిన ట్రిబ్యునల్

    AB Venkateswara Rao : కేంద్ర పరిపాలనా ట్రిబ్యునల్‌లో ఏబీ వెంకటేశ్వరరావు...

    Dubai : దుబాయ్ లో మరో అద్భుతం..ప్రపంచంలోనే అతి పెద్ద ఎయిర్ పోర్ట్ నిర్మాణం..

    Dubai : దుబాయ్ ఇదొక భూతల స్వర్గం. ప్రపంచంలో సంపన్నదేశంగా కొలువబడుతున్న...

    CM Jagan : షర్మిల, రేవంత్ రెడ్డిపై ఏపీ సీఎం సంచలన వ్యాఖ్యలు

    CM Jagan : ఎన్నికల వేళ రెండు తెలుగు రాష్ట్రాల్లో ఉన్న...

    TDP : వైసీపీని వీడి టీడీపీలో చేరిన 5 కుటుంబాలు

    TDP : ఈరోజు అచ్చంపేట మండలం కోనూరు గ్రామానికి చెందిన...

    POLLS

    [yop_poll id="2"]

    Latest News

    - Download the UBlood app here -

    Photos

    - Advertisement -

    Popular

    More like this
    Related

    YS Avinash Reddy : వైఎస్ అవినాష్ బెయిల్ రద్దుకు సీబీఐ పిటిషన్

    YS Avinash Reddy : ఏపీ సీఎం సోదరుడు, కడప ఎంపీ వైఎస్...

    Deadline in Viveka’s murder case : వివేకా హత్య కేసులో ముగిసిన గడువు.. సీబీఐ తేల్చిందేమిటో..?

    Deadline in Viveka's murder case : కడపలో వైఎస్ వివేకానందరెడ్డి...

    YS Viveka murder : వివేకా హత్య జగన్ కు ముందే తెలుసా.. సీబీఐ ఏం చెప్పింది..?

    YS Viveka murder : వైఎస్ వివేకానందరెడ్డి హత్య కేసుకు సంబంధించి...

    Avinash Reddy : కర్నూలు నుంచి హైదరాబాద్ కు అవినాష్..

    Avinash Reddy : వైఎస్ వివేకానంద రెడ్డి హత్యలో కడప ఎంపీ...