32.2 C
India
Thursday, May 9, 2024
More

    Credit Cards : క్రెడిట్ కార్డులు వాడుతున్నారు సరే? ఈ కీలక మార్పులు తెలుసుకున్నారా?

    Date:

    credit cards
    credit cards

    Credit Cards New Rules : ప్రస్తుత కాలంలో క్రెడిట్ కార్డులు వాడే వారి సంఖ్య భారీగా పెరిగిపోతోంది. ఆన్ లైన్ లో వస్తువులు కొనడం, ఆఫ్ లైన్ లో షాపింగ్ చేయడం, కరెంట్ బిల్లులు కట్టడం..ఇలా ఒకటేమిటి చెల్లింపులన్నీ క్రెడిట్ కార్డులనే వాడుతున్నారు. అయితే కొన్ని ప్రత్యేక కార్డుల్లో ఆయా క్రెడిట్ కార్డు సంస్థలు క్లెయిమ్ చేసుకుని ఇతర వస్తువులు వంటివి ఉచితంగా పొందే అవకాశం ఉంటుంది. తాజాగా కొన్ని బ్యాంకులు అందిస్తున్న క్రెడిట్ కార్డు లాంజ్ యాక్సెస్, రివార్డు పాయింట్ల విషయంలో కీలక మార్పులు చేస్తున్నాయి. ఆ వివరాలు ఒకసారి చూద్దాం..

    యాక్సిస్ బ్యాంక్:

    మాగ్నస్ క్రెడిట్ కార్డుపై రివార్డ్ పాయింట్లు, లాంజ్ యాక్సెస్ తో పాటు వార్షిక రుసుముల్లో కీలక మార్పులను తీసుకొచ్చింది. బీమా, గోల్డ్, ఆభరణాలు, ఇంధనం కోసం క్రెడిట్ కార్డు ద్వారా చెల్లింపులపై ఇక నుంచి ఎలాంటి రివార్డ్ పాయింట్లూ ఇవ్వబోమని స్పష్టం చేసింది. ఎయిర్ పోర్ట్ లాంజ్ యాక్సెస్ పొందాలంటే మూడు నెలల్లో కనీసం రూ.50వేలు ఖర్చు చేయాల్సి ఉంటుంది.

    ఎస్ బీఐ:

    స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా క్రెడిట్ కార్డుల ద్వారా చేసే అద్దె చెల్లింపులపై రివార్డ్ పాయింట్లను అందిస్తుంది. ఇకపై ఆ తరహా రివార్డులను నిలిపివేయనుంది. ఏప్రిల్ 1 నుంచి ఈ నిబంధనలు వర్తించనున్నాయి. ఎస్ బీఐ అందిస్తున్న ఆరమ్ ఎస్ బీఐ కార్డ్ ఎలైట్, సింప్లీ కిక్ కార్డులు వినియోగిస్తున్న వారిపై ఈ ప్రభావం పడనుంది.

    ఐసీఐసీఐ:

    కాంప్లిమెంటరీ ఎయిర్ పోర్ట్ లాంజ్ యాక్సెస్ విషయంలో నిబంధనల్ని సవరించింది. రానున్న త్రైమాసికంలో ఈ సదుపాయం పొందాలంటే మునపటి త్రైమాసికంలో కార్డ్ ద్వారా కనీసం రూ.35వేలు ఖర్చు చేయాల్సి ఉంటుంది. కోరల్ క్రెడిట్ కార్డు, మేక్ మై ట్రిప్ ఐసీఐసీఐ బ్యాంక్ ప్లాటినం క్రెడిట్ కార్డు సహా వివిధ కార్డులకు ఈ నిబంధనలు వర్తిస్తాయి. ఈ మార్పులు కూడా కొత్త ఆర్థిక సంవత్సరం నుంచి అమల్లోకి రానున్నాయి.

    యస్ బ్యాంక్:

    ఐసీఐసీఐ బ్యాంక్ తరహాలోనే యస్ బ్యాంక్ కూడా లాంజ్ యాక్సెస్ లో నిబంధనల్ని సవరించింది. ఏప్రిల్ 1 నుంచి ఏ త్రైమాసికంలో లాంజ్ సదుపాయం పొందాలన్నా అంతకుమ మునపటి త్రైమాసికంలో కార్డ్ ద్వారా కనీసం రూ.10వేలు వెచ్చించాల్సి ఉంటుంది.

    Share post:

    More like this
    Related

    KA Paul : ఎన్నికల్లో గెలవకపోతే.. మళ్లీ పోటీ చేయను: కేఏ పాల్

    KA Paul : ఈ ఎన్నికల్లో గెలవకపోతే మళ్లీ ఏ ఎన్నికల్లోనూ...

    IPL 2024 : పంజాబ్ ఆర్సీబీ మధ్య కీలక పోరు

    IPL 2024 : పంజాబ్ కింగ్స్ ఎలెవన్, రాయల్స్ చాలెంజర్ బెంగళూరు...

    Sunrisers : దంచి కొట్టిన సన్ రైజర్స్.. లక్నో చిత్తు

    Sunrisers VS Lucknow : సన్ రైజర్స్, లక్నో సూపర్ గెయింట్స్...

    Bihar News : ఎన్నికల కోసం 56 ఏళ్ల వయసులో పెళ్లి – భార్యకు ఎంపీ టికెట్

    Bihar News : బిహార్ లో అశోక్ మహతో (56) అనే...

    POLLS

    [yop_poll id="2"]

    Latest News

    - Download the UBlood app here -

    Photos

    - Advertisement -

    Popular

    More like this
    Related

    RuPay Credit Card : రూపే ‍క్రెడిట్‌ కార్డులో కొత్త ఫీచర్లు.. వీటియో యూజర్స్ కు ఎలాంటి లాభం అంటే?

    RuPay Credit Card : దేశంలో డిజిటల్ ట్రాన్జాక్షన్ రోజు రోజుకు...

    Credit Card Payments : ఇక నుంచి క్రెడిట్ కార్డుల పేమెంట్ అలా కుదరదు.. బ్యాంకుల కఠిన నిర్ణయం

    Credit Card Payments : క్రెడిట్ కార్డుల వినియోగం దేశంలో ఘననీయంగా...

    Credit cards : క్రెడిట్ కార్డులు వాడే వారికి శుభవార్త

    Credit cards : రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా (ఆర్బీఐ) నూతన...