
RBI-PAN card : రూ. 2 వేలనోట్లను ఉపసంహరించుకున్నట్లు రెండు రోజుల క్రితం ఆర్బీఐ ప్రకటించింది. రూ. 2వేల నోట్లను సెప్టెంబర్ 30 లోగా మార్చుకోవాలని ప్రజలను కోరింది. ఇందుకు అనుగుణంగా ఏర్పాట్లు చేసుకోవాలని అన్ని బ్యాంకులను ఆదేశించింది. అయితే పెద్ద నోట్ల రద్దు తర్వాత మరోసారి ఆర్బీఐ ఈ నిర్ణయం తీసుకుంది. గతంలో ఎదురైన పరిస్థితులను అంచనా వేసుకొని. విమర్శలకు తావులేకుండా కొంత సమయం ఇచ్చింది. ప్రజలకు ఎలాంటి ఇబ్బంది లేకుండా తీసుకున్న ఈ నిర్ణయం పై హర్షం వ్యక్తమవుతున్నది
ఆర్బీఐ చట్టంలోని సెక్షన్ 24(1) ప్రకారం రూ. 2వేల నోటును ప్రశేశ పెట్టినట్లు తెలిపింది. పెద్ద నోట్ల రద్దు తర్వాత డిమాండ్ కు సరిపడా కరెన్సీని అందుబాటులో కి తెచ్చేందుకే రూ. 2 వేల నోటును ప్రవేశ పెట్టినట్లు పేర్కొ్ంది. 2018-19 నుంచే పూర్తిగా ముద్రణ నిలిపివేసినట్లు తెలిపింది. ఇప్పుడున్నవన్నీ 2017 కు ముందు ముద్రించనవేనని, వీటి జీవితకాలం 4 నుంచి 5 ఏండ్లు మాత్రమేనని పేర్కొంది. ప్రస్తుతం వీటిని 30 సెప్టెంబర్ 2023లోగా బ్యాంకుల్లో డిపాజిట్ చేయాల్సి ఉంటుంది.
అయితే తాజాగా ఆర్బీఐ గవర్నర్ ఓ కీలక ప్రకటన చేశారు. రూ.2వేల ఉపసంహరణ తర్వాత సెప్టెంబర్ 30 తర్వాత ఇక చెల్లబోవని పేర్కొన్నారు. అయితే గతంలో రూ. 50 వేల కంటే ఎక్కువ డిపాజిట్ చేస్తే పాన్ తప్పనిసరి అనే నిబంధన ఉందని. ఇప్పడు రూ. 2వేల నోట్ల డిపాజిట్లలోనూ ఆ నిబంధన వర్తిస్తుందని తెలిపారు. నోట్ల మార్పిడికి మార్గదర్శకాలను ఇప్పటికే బ్యాంకులకు పంపించినట్లు తెలిపారు.