- సంచలనం రేపుతున్న బీజేపీ ఎమ్మెల్యే హాట్ కామెంట్స్
Congress gets 115, bjp-congress
Congress gets 115 : కర్ణాటక కౌంటింగ్ మొదలైంది. మరికొన్ని గంటల్లో కింగ్ ఎవరో తేలనుంది. హోరీహోరీగా సాగుతున్న ఈ ఫైట్లో విజయంపై కాంగ్రెస్,బీజేపీ ధీమా వ్యక్తం చేస్తున్నాయి. అయితే ఎగ్జిట్ పోల్స్ మాత్రం కాంగ్రెస్ వైపు మొగ్గు చూపాయి. 113 సీట్లు వచ్చిన పార్టీ ఒంటరిగా ప్రభుత్వం ఏర్పాటు చేసుకునే అవకాశం ఉంటుంది. ఈ క్రమంలో ప్రజా తీర్పు ఎట్లుందో మధ్యా్హ్నానికల్లా తెలిసిపోనుంది.
బీజేపీ ఎమ్మెల్యే కామెంట్స్ సంచలనం..
కాంగ్రెస్ కు మెజార్టీ వచ్చినా ప్రభుత్వం ఏర్పాటు చేయడం కష్టమేనని బీజేపీ భావిస్తున్నట్లుగా తెలుస్తున్నది. ఇందుకు తెలంగాణ రాష్ర్టానికి చెందిన ఓ బీజేపీ ఎమ్మెల్యే కామెంట్లు ఉదాహరణగా నిలుస్తున్నాయి. ఓ టీవీ షోలో మాట్లాడిన సదరు ఎమ్మల్యే కాంగ్రెస్ కు 115 వచ్చినా ప్రభుత్వం ఏర్పాటు చేయలేదని ధీమా వ్యక్తం చేశారు. కాంగ్రెస్ లో చీలిక ఖాయమని తెలిపారు. డీకే, సిద్ధరామయ్య రెండుగా చీలిపోతారని ప్రకటించారు. ఈ నేపథ్యంలో బీజేపీ చీలికను నమ్ముకున్నదా అనే అభిప్రాయం వ్యక్తమవుతున్నది. కేంద్రంలో అధికారంలో ఉన్న పార్టీ ఇలాంటి కామెంట్లు చేయడం సరికాదంటూ మరికొందరు అంటున్నారు..
బీజేపీ మైండ్ గేమ్..
ఫలితాల రాక సమీపిస్తున్న నేపథ్యంలో బీజేపీ మైండ్ గేమ్ మొదలుపెట్టినట్లుగా కాంగ్రెస్ నేతలు భావిస్తున్నారు. కాంగ్రెస్ గెలుపు ఖాయమని అంచనాల నేపథ్యంలో పార్టీలో చీలికలు తెచ్చే ప్రయత్నం చేస్తున్నదని ఆరోపిస్తున్నారు. ఈ ఆరోపణలకు ప్రస్తుతం బీజేపీ ఎమ్మెల్యే కామెంట్లు ఊతమిస్తున్నాయి. కాంగ్రెస్ కు మెజార్టీ వచ్చినా బీజేపీ పక్కా స్కెచ్ తో ముందుకెళ్తున్నట్లుగా సమాచారం. ఇందులో భాగంగా ఇప్పటికే జేడీయూ నేత కుమారస్వామి తో ఒక ఒప్పందానికి వచ్చినట్లుగా తెలుస్తున్నది.
ప్రజా తీర్పు బలంగా ఉంటే తప్పా, ఆయా పార్టీలకు కష్టాలు తప్పేలా లేవు. మరోవైపు ఇప్పటికే క్యాంపు రాజకీయాలకు ఆయా పార్టీల నేతలు సర్వం సిద్ధం చేసుకున్నారు. గెలిచిన ఎమ్మెల్యేలను క్యాంపుల కు తరలించనున్నారు. కాంగ్రెస్ తాను అధికారంలో ఉన్న రాష్ర్టానికి ఈ ఎమ్మెల్యేలను తరలించేందుకు ఏర్పాట్లు చేస్తున్నది. లేకుంటే బీజేపీ తో కష్టాలు తప్పవని భావిస్తున్నది. ఇప్పటికే ఆయా పార్టీలు గెలుపు గుర్రాలపై పూర్తి నిఘా పెట్టాయి.