21 C
India
Sunday, February 25, 2024
More

  Actress Sreleela : శ్రీలీల మంచి తనానికి ఫిదా అవుతున్న ఫ్యాన్స్

  Date:

  Actress Sreleela
  Actress Sreleela

  Actress Sreleela : ప్రస్తుతం డబ్బుకు లోకం దాసోహం. ఎలాంటి పనులు చేసినా సరే డబ్బు సంపాదించుకోవడమే ధ్యేయం. ఈనేపథ్యంలో తెలుగు పరిశ్రమలో శ్రీలీల మంచి ఊపుమీదుంది. ఒక్కో సినిమాకు రూ. 3 నుంచి 4 కోట్ల వరకు తీసుకుంటోంది. దీపం ఉండగానే ఇల్లు చక్కబెట్టుకోవాలనుకున్నట్లు పేరు మంచి రేంజ్ లో ఉండగానే నాలుగు రాళ్లు వెనకోసుకోవడానికే ప్రాధాన్యం ఇస్తుంటారు.

  మంచి పేరు వచ్చాక కొన్ని కంపెనీలకు బ్రాండ్ అంబాసిడర్ గా వ్యవహరిస్తారు. దీనికి గాను సదరు సంస్థలనుంచి కొంత డబ్బును డిమాండ్ చేయడం సహజం. సమాజానికి ఉపయోగపడేవి అయితే ఓకే కానీ సమాజానికి కీడు చేసే వాటికి దూరంగా ఉంటేనే మన మీద మంచి అభిప్రాయం కలుగుతోంది. కానీ చాలా మంది దీన్ని అంతగా పట్టించుకోరు.

  శ్రీలీల మాత్రం మద్యం, బెట్టింగ్ యాప్ లకు సంబంధించిన యాడ్ లు చేసేందుకు ఒప్పుకోలేదు. వాటి వల్ల సమాజానికి కీడు జరుగుతుందనే ఉద్దేశంతో వాటిలో నటించేందుకు నో చెప్పింది. శ్రీలీల ఇంటి మంచి నిర్ణయం తీసుకున్నందుకు ఆమె ఫ్యాన్స్ సంతోషపడుతున్నారు. శ్రీలీల కెరీర్ పరంగా ఒక్కో మెట్టు ఎదుగుతూ పైకి వస్తోంది. మంచి నిర్ణయాలు తీసుకుంటూ అభిమానులకు దగ్గరవుతోంది.

  ప్రస్తుతం గుంటూరు కారం సినిమాలో నటించింది. ఆ సినిమా ఆమెకు మంచి పేరు తీసుకురావాలని ఆశిస్తున్నారు. ఇతర భాషల నుంచి ఆఫర్లు వస్తున్నా తెలుగుకే తగిన ప్రాధాన్యం ఇస్తోంది. త్వరలో మరిన్ని క్రేజీ ప్రాజెక్టులలో నటిస్తోంది. శ్రీలీల, నితిన్ కాంబినేషన్ లో వచ్చిన సినిమా ప్లాప్ కావడంతో ఇప్పుడు వెంకీ కుడుముల దర్శకత్వంలో మరో సినిమా చేస్తున్నారు. ఈ సినిమా కూడా మంచి పేరు తీసుకురావాలని కోరుకుంటున్నారు.

  Share post:

  More like this
  Related

  TDP-Janasena : ఏ వర్గానికి ఎన్ని సీట్లు జగన్ పై గెలుపు లెక్కలు సరవుతాయా?

  TDP-Janasena : ఆంధ్రప్రదేశ్ ఎన్నికల్లో ఈ సారి సామాజిక లెక్కలు గెలుపు...

  Prabhas : తనలో సీక్రెట్ బయట పెట్టేసిన ప్రభాస్

  Prabhas : పాన్ ఇండియా స్టార్ ప్రభాస్ కు ఉన్న క్రేజ్,...

  SHE Teams : ప్రేమ జంటలకు షీ టీం షాక్.. ఏం చేసిందంటే?

  SHE Teams : ప్రేమకు అర్థం (నిర్వచనం) మారిపోయిందేమో. ఒకప్పుడు లవ్...

  Jagan : కొండతో సామాన్యుడి ఢీ.. జగన్ పై పోటీ చేసేది ఇతనే.. ఇతని బ్యాగ్రౌండ్ తెలిస్తే షాక్ అవ్వాల్సిందే?

  Jagan : టీడీపీ+జనసేన పొత్తులో భాగంగా ఫస్ట్ లిస్ట్ ను బాబు,...

  POLLS

  ప్రతిపక్షాలను ఇబ్బంది పెట్టటానికే 2000 రూపాయల నోటు రద్దు చేశారని మీరు భావిస్తున్నారా..?

  Latest News

  - Download the UBlood app here -

  Photos

  - Advertisement -

  Popular

  More like this
  Related

  Sreeleela Mother : ఆ డైరెక్టర్ కు వార్నింగ్ ఇచ్చిన శ్రీలీల తల్లి?

  Sreeleela Mother : తెలుగు చిత్ర పరిశ్రమలో దూసుకుపోతున్న హీరోయిన్లలో శ్రీలీల...

  Sreeleela : శబాష్ అనిపించుకున్న శ్రీలీల..ఏ హీరోయిన్ చెయ్యని మంచి  పని చేసింది!

  Sreeleela : సినీ రంగం లోకి వచ్చిన తర్వాత డబ్బులు బాగా...

  Telugu Heroine : సిల్వర్ స్క్రీన్‌పై మెరిసిన తెలుగమ్మాయి.. ఎవరో గుర్తు పట్టారా?

  Telugu Heroine Ananya Nagalla : టాలీవుడ్ లో స్వభాష హీరోయిన్ల...