24.9 C
India
Friday, March 1, 2024
More

  Sreeleela : శబాష్ అనిపించుకున్న శ్రీలీల..ఏ హీరోయిన్ చెయ్యని మంచి  పని చేసింది!

  Date:

  Sreeleela
  Sreeleela

  Sreeleela : సినీ రంగం లోకి వచ్చిన తర్వాత డబ్బులు బాగా సంపాదించాలి , ఉన్నత స్థాయిలోకి వెళ్ళాలి అని ప్రతీ ఒక్క హీరో/ హీరోయిన్ కి ఉంటుంది. కానీ నిన్ను కోట్లాది మంది అభిమానులు అనుసరిస్తున్న సమయం లో కొన్ని నైతిక విలువలు పాటించాలి. కోరినంత డబ్బులు ఇస్తున్నారు కదా అని విలువలు మర్చిపోతే ఇంత కాలం సంపాదించిన కీర్తి ప్రతిష్టలకు, అష్ట ఐశ్వర్యలకు అసలు అర్థమే ఉండదు.

  ఈమధ్య కాలం లో పెద్ద పెద్ద సూపర్ స్టార్స్ మద్యం ని ప్రమోట్ చెయ్యడం, బెట్టింగ్ యాప్స్ కి యాడ్స్ చెయ్యడం వంటివి మనం చూస్తూనే ఉన్నాం. రెండు నిమిషాల యాడ్ కి కోట్ల రూపాయిలు రెమ్యూనరేషన్ ఇస్తాము అంటే చాలు, ముందు వెనుక కూడా ఆలోచించకుండా యాడ్స్ చెయ్యడానికి ఒప్పేసుకుంటున్నారు. రీసెంట్ గా తమన్నా బెట్టింగ్ యాప్ కి యాడ్ చేసి తన పరువు మొత్తం పోగొట్టుకుంది. అసలే ఈమధ్య ఈమె వెబ్ సిరీస్ లో అడల్ట్ కంటెంట్ చేస్తూ బ్యాడ్ ఇమేజ్ తెచ్చుకోగా, ఇప్పుడు ఈ బెట్టింగ్ యాడ్ ద్వారా ఉన్న ఆ కాస్త మంచి పేరుని కూడా పోగొట్టుకుంది.

  ఎన్నో ఏళ్ళ నుండి ఇండస్ట్రీ లో ఉన్న తమన్నా అలా చెయ్యగా, నిన్న గాక మొన్న ఇండస్ట్రీ లోకి అడుగుపెట్టి, నేడు మోస్ట్ వాంటెడ్ హీరోయిన్ గా మారిన శ్రీలీల మాత్రం అలాంటి యాడ్స్ చెయ్యను అని మొహమాటం లేకుండా రిజెక్ట్ చేసి శబాష్ అనిపించుకుంది. ఒక ప్రముఖ ఆన్లైన్ బెట్టింగ్ యాప్ యాజమాన్యం రీసెంట్ గానే శ్రీలీల ని సంప్రదించి, తమ బ్రాండ్ ని ప్రమోట్ చేయాల్సిందిగా కోరారు. కానీ శ్రీలీల మాత్రం మీరు ఎన్ని కోట్లు ఇచ్చినా నేను ఇలాంటి బ్రాండ్స్ ని ప్రోత్సహించను అని చెప్పి రిజెక్ట్ చేసింది. పట్టుమని 23 ఏళ్ళ వయస్సు కూడా లేని ఈ అమ్మాయి ఇంత గొప్ప నిర్ణయం తీసుకోవడం నిజంగా హర్షించదగ్గ విషయమే.

  ఈమెని చూసి మిగతా హీరోయిన్లు, హీరోలు బుద్ధి తెచ్చుకోవాలి, నలుగురికి ఆదర్శంగా నిలబడే సెలెబ్రిటీలు బాధ్యతగా వ్యవహరించాలి అంటూ సోషల్ మీడియా లో నెటిజెన్స్ చెప్పుకొస్తున్నారు. ఇకపోతే శ్రీలీల హీరోయిన్ గా నటించిన లేటెస్ట్ చిత్రం ‘గుంటూరు కారం’ రేపు ప్రపంచవ్యాప్తంగా గ్రాండ్ గా విడుదల కాబోతుంది. ఆమె నటించిన గత చిత్రాలలో వరుసగా రెండు డిజాస్టర్ ఫ్లాప్స్ వచ్చాయి. కాబట్టి ఈ సినిమా భారీ హిట్ అవ్వడం ఆమెకి అవసరం, మరి ఆమె జాతకం ఎలా మారబోతుందో తెలియాలంటే మరికొద్ది గంటలు ఆగాల్సిందే.

  Share post:

  More like this
  Related

  Increasing VIPs : దేశంలో పెరిగిపోతున్న వీఐపీ, వారి ఖర్చు.. ఇతర దేశాల్లో ఎంతంటే?

  Increasing VIPs : -బ్రిటన్‌లో అధికారికంగా 84 మంది వీఐపీలు ఉన్నారు! -ఫ్రాన్స్‌లో...

  Frogs Marriage : కప్పలకు పెళ్లెందుకు చేస్తారో తెలుసా? దీని వెనకున్న కథ ఇదీ..

  Frogs Marriage Behind Story : భారత్ లో ఇప్పటికీ వివిధ...

  Anchor Anasuya : అనసూయ స్టైల్ స్కార్చర్ ఎథ్నిక్ లుక్

  Anchor Anasuya : యాంకర్ అనసూయ భరద్వాజ్ గురించి పరిచయం అవసరం...

  Chanakya Niti : పెళ్లయిన మగవారు ఇతర స్త్రీల పట్ల ఎందుకు ఆకర్షితులవుతారు? చాణక్య చెప్పిన విషయాలు ఏంటి?

  Chanakya Niti : ఆచార్య చాణక్య గొప్ప పండితుడు. తనను అవమానించని...

  POLLS

  ప్రతిపక్షాలను ఇబ్బంది పెట్టటానికే 2000 రూపాయల నోటు రద్దు చేశారని మీరు భావిస్తున్నారా..?

  Latest News

  - Download the UBlood app here -

  Photos

  - Advertisement -

  Popular

  More like this
  Related

  Sreeleela Mother : ఆ డైరెక్టర్ కు వార్నింగ్ ఇచ్చిన శ్రీలీల తల్లి?

  Sreeleela Mother : తెలుగు చిత్ర పరిశ్రమలో దూసుకుపోతున్న హీరోయిన్లలో శ్రీలీల...

  Actress Sreleela : శ్రీలీల మంచి తనానికి ఫిదా అవుతున్న ఫ్యాన్స్

  Actress Sreleela : ప్రస్తుతం డబ్బుకు లోకం దాసోహం. ఎలాంటి పనులు...

  Meenakshi Chaudhary : ‘గుంటూరు కారం’ సెకండ్ హీరోయిన్ నక్క తోక తొక్కిందా?

  Meenakshi Chaudhary : ‘గుంటూరు కారం’.. తెలుగు రాష్ట్రాల్లో ఇప్పుడంతా అదే...

  Guntur kaaram : ‘గుంటూరు కారం’ ఆ హీరో కోసం రాసిందా.. డేట్లు కుదరకనే మహేశ్ తో..?

  Guntur kaaram : సంక్రాంతి విజేత తానేనంటూ ఎన్నో అంచనాలతో మహేశ్...