31.4 C
India
Sunday, April 28, 2024
More

    Afghanistan Semis Chances : అఫ్గానిస్థాన్ సెమీస్ లో అవకాశాలు ఉన్నట్లేనా?

    Date:

    Afghanistan Semis Chances
    Afghanistan Semis Chances

    Afghanistan Semis Chances : ఐసీసీ వరల్డ్ కప్ 2023 లో  ప్రస్తుతం పాయింట్ల పట్టికలో ఆతిథ్య దేశం భారత్‌తో పాటు దక్షిణాఫ్రికా, న్యూజిలాండ్, ఆస్ట్రేలియా తొలి నాలుగు స్థానాల్లో ఉన్నాయి. ఏదేమైనప్పటికీ, ఇంకా 14 గ్రూప్-స్టేజ్ మ్యాచ్‌లు ఆడాల్సి ఉంది

    ఇప్పుడు ఐసీసీ  ప్రపంచ కప్ 2023 సెమీ-ఫైనల్ రేసులో ఆఫ్ఘనిస్తాన్ కూడా చేరింది. నెదర్లాండ్స్‌ను ఏకపక్షంగా 7 వికెట్ల తేడాతో ఓడించడం ద్వారా ఆఫ్ఘనిస్తాన్ చివరి నాలుగు మ్యాచ్ ల్లో మంచి ప్రదర్శన చూపింది. ఆఫ్ఘనిస్తాన్ మొత్తం 8 పాయింట్లు సాధించింది. అదే సమయంలో ఆస్ట్రేలియా , న్యూజిలాండ్‌లతో సమానంగా ఉంది. ఆఫ్ఘనిస్తాన్ జట్టు సెమీ-ఫైనల్ బెర్త్ ను కన్ ఫాం చేసుకునే అవకాశాలు స్పష్టంగా ఉన్నాయి.

    ఆఫ్ఘనిస్థాన్ పరంగా చూస్తే నవంబర్ 4న జరిగే రెండు మ్యాచ్‌లు చాలా కీలకం కానున్నాయి. తొలి మ్యాచ్‌లో న్యూజిలాండ్‌ను ఓడించి పాకిస్థాన్ విజయం సాధిస్తే, బాబర్ అజామ్ అండ్ కంపెనీ మొత్తం పాయింట్లు కూడా 8 అవుతుంది. ఇలాంటి పరిస్థితుల్లో ఆఫ్ఘనిస్థాన్, న్యూజిలాండ్, పాకిస్థాన్ జట్లకు మాత్రమే సెమీఫైనల్ చేరే అవకాశం ఉంటుంది. ఆఫ్ఘనిస్థాన్‌ ఫర్వాలేదనిపించే ఈ పరిస్థితిలో నెట్‌ రన్‌రేట్‌ కీలక పాత్ర పోషిస్తుంది.

    ఆఫ్ఘనిస్తాన్ తన తదుపరి రెండు మ్యాచ్‌లను ఆస్ట్రేలియా, దక్షిణాఫ్రికాతో ఆడాల్సి ఉంది . సెమీఫైనల్‌కు చేరుకోవాలంటే ఈ రెండు మ్యాచ్‌ల్లోనూ అఫ్గానిస్థాన్ భారీ తేడాతో గెలవాలి. ఆస్ట్రేలియా, దక్షిణాఫ్రికా వంటి జట్లను ఓడించడం ఆఫ్ఘనిస్థాన్‌కు అంత తేలికైన విషయం కాదు.

     ఆస్ట్రేలియా ఓటమి పరిస్థితిని మరింత దిగజార్చుతుంది. శనివారం ఇంగ్లండ్‌తో జరిగే మ్యాచ్‌లో ఆస్ట్రేలియా జట్టు ఓటమి చవిచూస్తే.. ఆఫ్ఘనిస్థాన్‌కు సెమీస్‌ తలుపులు తెరుచుకున్నట్లే. కంగారూ జట్టు ఓటమితో తుది నలుగురి రేసు మరింత ఉత్కంఠగా మారనుంది. అయితే, ఇంగ్లండ్‌పై ఆస్ట్రేలియా గెలిస్తే.. సెమీఫైనల్ ఆడాలన్న అఫ్గానిస్థాన్ ఆశలు గల్లంతవుతాయి.

    డిఫెండింగ్ చాంపియన్ ఇంగ్లండ్ ఆస్ట్రేలియాను ఓడించి సఫలమైతే.. నవంబర్ 7న అఫ్గానిస్థాన్, కంగారూ జట్ల మధ్య మ్యాచ్ చాలా ఆసక్తికరంగా సాగనుంది. అంటే సెమీఫైనల్‌కు చేరుకోవాలంటే ఇంగ్లండ్‌, పాకిస్థాన్‌లపై చూపిన ప్రదర్శననే ఆఫ్ఘనిస్థాన్‌ ఆస్ట్రేలియా, దక్షిణాఫ్రికాపై ప్రదర్శించాల్సి ఉంటుంది.

    Share post:

    More like this
    Related

    Chicken : చికెన్ అతిగా తింటున్నారా.. జాగ్రత్త

    Chicken : కొంతమంది చికెన్ ఉంటే కడుపునిండా తింటారు. చికెన్ ను...

    Ponnam Prabhakar : కేసీఆర్.. ఏం చేస్తానని తిరుగుతున్నావ్..?: పొన్నం ప్రభాకర్

    Ponnam Prabhakar : మాజీ సీఎం కేసీఆర్ పై మంత్రి పొన్నం...

    KTR Message : బీఆర్ఎస్ శ్రేణులకు కేటీఆర్ సందేశం

    KTR Message : బీఆర్ఎస్ 24వ వ్యవస్థాపక దినోత్సవాన్ని ఈరోజు నిర్వహిస్తున్నారు....

    Road Accident : రోడ్డు ప్రమాదంలో ముగ్గురి మృతి

    Road Accident : ఏపీలోని అనకాపల్లి జిల్లా నక్కపల్లి వద్ద శనివారం...

    POLLS

    [yop_poll id="2"]

    Latest News

    - Download the UBlood app here -

    Photos

    - Advertisement -

    Popular

    More like this
    Related

    Dravid Continue as Coach : కోచ్ గా ద్రవిడ్ ను కొనసాగిస్తారా? ఇంటికి పంపిస్తారా?

    Dravid Continue as Coach : వన్డే ప్రపంచ కప్ ముగిసింది....

    Dravid Plan : సెమీస్ కు టీమిండియా రెడీ..ద్రావిడ్ ప్లాన్ వర్కౌట్ అవుతుందా..?

    Dravid Plan : వరల్డ్ కప్ లో టీమిండియా ఎనిమిది వరుస...

    Miss the Catch : క్యాచ్ మిస్సయితే.. కప్పు మిస్సయినట్లే..!

    Miss the Catch : క్రికెట్ లలో ప్రతి దేశంలో కోరుకునే కల.....