Akira Nandan :
పవర్ స్టార్ పవన్ కళ్యాణ్, సుప్రీమ్ హీరో సాయి ధరమ్ తేజ్ హీరోలుగా సముద్రఖని దర్శకత్వంలో తెరకెక్కిన ‘బ్రో’ చిత్రం ప్రపంచవ్యాప్తంగా విడుదలైంది.
పవన్ కళ్యాణ్ తనయుడు అకీరా నందన్ హైదరాబాద్‌లోని సుదర్శన్ థియేటర్‌లో సాయిధరమ్ తేజ్ తదితరులతో కలిసి ఈ సినిమాను వీక్షించారు. స్టార్ వారసుడిని చూడగానే థియేటర్ వద్ద అభిమానులు రెచ్చిపోయారు.
ప్రియా ప్రకాశ్ వారియర్, కేతికా శర్మ హీరోయిన్లుగా నటిస్తున్న ఈ చిత్రంలో బ్రహ్మానందం, రోహిణి, వెన్నెల కిశోర్, రాజా చెంబోలు తదితరులు కీలక పాత్రలు పోషిస్తున్నారు. టాలెంటెడ్ థమన్ సంగీతం అందించిన ఈ ఫాంటసీ కామెడీ డ్రామాను పీపుల్ మీడియా ఫ్యాక్టరీ పతాకంపై టీజీ విశ్వప్రసాద్ నిర్మించారు.</div>