Akira Nandan workouts : పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ – రేణు దేశాయ్ ముద్దుల కుమారుడు అకిరా నందన్ గురించి అందరికి తెలుసు.. వీరిద్దరూ ప్రేమించుకుని పెళ్లి చేసుకున్నారు.. వీరికి ఇద్దరు పిల్లలు.. అందులో అకిరా ఒకరు కాగా ఆద్య ఒకరు. ఈ ఇద్దరు పుట్టిన తర్వాత కొంత కాలానికి ఈ జంట విడిపోయారు. ఇప్పుడు రేణుదేశాయ్ పిల్లలతో కలిసి ఒంటరిగా ఉంటుంది. ఈ కథ అంతా మనకు బాగా తెలిసిందే..
ఇక ఇదంతా పక్కన పెడితే అకిరా నందన్ తాజాగా వర్కౌట్స్ చేస్తుండగా రేణుదేశాయ్ వీడియో తీసి సోషల్ మీడియాలో షేర్ చేసింది.. ఈమె షేర్ చేసిన ఈ వీడియో నిముషాల్లోనే వైరల్ అయ్యింది.. అకిరా జిమ్ లో వర్కౌట్స్ చేస్తూ తెలుగు పాటలు వింటూ కనిపించారు.. దీని గురించి ఈమె ఆసక్తికర పోస్ట్ చేసింది.
”జిమ్ లో వర్కౌట్స్ చేస్తున్నప్పుడల్లా ఇంగ్లీష్ పాటలకు బదులుగా హిందీ పాటలు పెట్టమని అడిగినప్పుడల్లా నన్ను వింతగా చూసేవారు.. వాటిని నేను ఏ మాత్రం పట్టించుకోలేదు.. వర్కౌట్స్ చేసేప్పుడు అర్ధం లేని ఇంగ్లీష్ పాటలకు బదులుగా చక్కగా మాతృభాషలోని పాటలనే వినమని అకీరాకు కూడా చెప్పేదాన్ని.. ఇప్పుడు అకిరా అలా మాతృబాష లోని సాంగ్స్ వింటూ వర్కౌట్స్ చేయడం సంతోషంగా ఉంది” అంటూ ఈమె చెప్పుకొచ్చింది..
ఈ వీడియోలో అకిరా తెలుగు పాటలను వింటూ వర్కౌట్స్ చేయడం చూసి పవర్ స్టార్ ఫ్యాన్స్ అంతా ఈ వీడియోను లైక్స్ తో మోతమోగిస్తున్నారు. ఈ వీడియో నిముషాల్లోనే వైరల్ అయ్యింది. ఇక అకిరా కూడా చదువు అనంతరం వారసుడిగా ఇండస్ట్రీ లోకి ఎంట్రీ ఇచ్చే అవకాశం ఉంది. ఆ తరుణం కోసం ఫ్యాన్స్ ఎదురు చూస్తున్నారు. మరి ఎప్పుడు ఇతడి ఎంట్రీ ఉంటుందో చూడాలి..
View this post on Instagram