
Anand Mahindra : ప్రముఖ వ్యాపారవేత్త ఆనంద్ మహీంద్రా సోషల్ మీడియాలో యాక్టివ్ గా ఉంటారు. పలు వీడియోలు పోస్టులతో సంచలనాత్మక విషయాలను చెబుతారు. అయితే ఆయన తాజాగా చేసిన ఓ ట్వీట్ క్రికెట్ అభిమానుల్లో కొత్త ఆసక్తిని రేపుతోంది.
ఇంతకీ ఆయన చేసిన ట్వీట్ ఏంటంటే క్రికెటర్ ధోని రాజకీయాల్లోకి రావాలని కోరాడు. ధోనిలో నాయకత్వ పటిమ పుష్కలంగా ఉందని పేర్కొన్నారు. ఎన్సీసీ రివ్యూ ప్యానెల్ ల్లో ధోనితో కలిసి పని చేశాను అని చెప్పుకొచ్చాడు. క్రికెట్తో పాటు ఇతర విషయాల్లోనూ ధోని చురుగ్గా ఉంటాడని, ఇతరులతో సులువుగా కలిసి పోతాడని పేర్కొన్నారు. అన్ని రకాలుగా ఆలోచించే ధోని లో ఒక ఫ్యూచర్ లీడర్ ఉన్నాడని చెప్పుకొచ్చారు. కచ్చితంగా ధోని రాజకీయాలకు పనికి వస్తాడని తనలో ఏదో శక్తి ఉందని తెలిపారు.
ఐపీఎల్ 16 సీజన్లో చెన్నై సూపర్ కింగ్స్ జట్టుకు కప్పును అందించడంలో ధోని నాయకత్వ స్యామర్థమే కీలకం. దీనిపై పలువురు ప్రముఖులు, క్రీడాభిమానులు మాజీ ఆటగాళ్లు ఇప్పటికే పోస్టులు పెట్టారు. అంతా ధోనిని అభినందిస్తున్నారు. ధోని వల్లే చెన్నై సూపర్ కింగ్స్ ఐదోసారి కప్పును గెలుచుకుందని ఇది తక్కువ విషయం ఏమీ కాదని చెప్పుకొచ్చారు. జట్టు సభ్యులను సమిష్టిగా ముందుకు తీసుకెళ్లడంలో ధోని లాగా మరి కెప్టెన్ పని చేయలేరని తెలిపారు. మ్యాచును ఆఖరి నిమిషంలో కూడా మలుపు తిప్పే సత్తా ధోనీకి ఉందని కొనియాడుతున్నారు.
ఈ సందర్భంగా సహచరులతో పాటు మాజీ ఆటగాళ్లు, పలువురు రాజకీయ ప్రముఖులు ధోనిని అభినందనలతో ముంచెత్తుతున్నారు అయితే ఆనంద మహేంద్ర మరికాస్త ముందుకెళ్లి ధోని రాజకీయాల్లోకి రావాలని కోరుతున్నారు. మరి ఈ జార్ఖండ్ డైనమెట్ ధోని మనసులో ఏముందో తెలియాలి కదా. ఇప్పటికే అంతర్జాతీయ కెరీర్ కు గుడ్ బై చెప్పిన ధోని ప్రస్తుతం ఐపీఎల్ సీజన్ లో మాత్రమే ఆడుతున్నాడు. మరి భవిష్యత్తులో ధోని నిర్ణయం ఎలా ఉంటుందో వేచి చూడాలి.