MP Vijay Sai Reddy : దేశంలో సార్వత్రిక ఎన్నికల కోలాహలం క్రమంగా నెలకొంటోంది. ఇంకొద్దిరోజుల్లో ఎన్నికలను ఎదుర్కొనాల్సి ఉంది. మార్చి రెండో వారం నాటికి లోక్‌సభ ఎన్నికల నోటిఫికేషన్ వెలువడే అవకాశాలు ఉన్నాయి. మే చివరి వారం నాటికి కేంద్రంలో కొత్త ప్రభుత్వం ఏర్పాటు కావడం దాదాపు ఖాయం.
ఈ ఎన్నికలను ప్రతిష్ఠాత్మంగా తీసుకుంటోన్నాయి అన్ని పార్టీలు. వరుసగా మూడోసారి అధికారంలోకి రావడానికి భారతీయ జనతా పార్టీ సారథ్యంలో ఎన్డీఏ.. ఈ సారి గద్దెనెక్కడానికి ప్రతిపక్షాల ఉమ్మడి కూటమి ఇండియా సర్వశక్తులు ఒడ్డుతున్నాయి. ఎన్నికల అజెండాపై చర్చించడానికి బీజేపీ జాతీయ కార్యవర్గ సమావేశాన్ని నిర్వహిస్తోంది కూడా.
ఈ పరిస్థితుల్లో అధికార వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ కేంద్ర ప్రభుత్వానికి కీలక ప్రతిపాదనను పంపిం చింది. పీఎం కిసాన్ కింద దేశవ్యాప్తంగా రైతులకు అందజేస్తోన్న ఆర్థిక సహాయం మొత్తాన్ని పెంచా లని విజ్ఞప్తి చేసింది. తమ డిమాండ్ల పరిష్కా రం కోసం ఉత్తరాదిన రైతులు ఉద్యమి స్తోన్న నేపథ్యంలో వైసీపీ ఈ విజ్ఞప్తి చేయడం చర్చనీయాంశమైంది.