34.2 C
India
Tuesday, May 7, 2024
More

    RGV ‘Vyuham’ teaser release : ఆగస్ట్ 15.. ఉదయం 11 గంటలు.. ఆర్జీవీ ‘వ్యూహం’ టీజర్ రిలీజ్

    Date:

    RGV 'Vyuham
    RGV ‘Vyuham

    RGV ‘Vyuham’ teaser release : కొంత కాలంగా రాం గోపాల్ వర్మ ఆంధ్రప్రదేశ్ రాజకీయాలను టార్గెట్ చేస్తూనే సినిమాలు చేస్తున్నారు. ‘అమ్మ రాజ్యంలో కడప బిడ్డలు’ అంటూ ఒక సినిమా తెరకెక్కించారు. చంద్రబాబు, వైఎస్ జగన్, కేఏ పాల్ పాత్రలను అన్నింటిని ఈ సినిమాలో దింపేశాడు. ఇక ఇప్పుడు ‘వ్యూహం’ చేస్తున్నాడు. ఈ సినిమాపై ఆంధ్రప్రదేశ్ లో తీవ్ర చర్చ జరుగుతోంది. ఇది పూర్తిగా చంద్రబాబు, పవన్ కళ్యాణ్ ను టార్గెట్ చేసి తీస్తున్నట్లు ఇప్పటికే విపరీతమైన పుకార్లు వచ్చాయి. రాంగోపాల్ వర్మ కూడా అదే విధంగా ట్వీటర్ లో ట్వీట్లు పెడుతూనే ఉన్నారు.

    గతంలో సినిమాకు సంబంధించి ఫస్ట్ గ్లింప్స్ రిలీజ్ చేసిన ఆయన తర్వాల ఫస్ట్ లుక్ రిలీజ్ చేశారు. ఆ సమయంలో చంద్రబాబు, జగన్ మధ్యనే ఈ సినిమా ఉంటుందని అందరూ అనుకున్నారు. కానీ తర్వాత తన ట్విటట్ ఖాతా నుంచి పవన్ కళ్యాణ్, చిరంజీవి, అల్లు అరవింద్ కలిసి ఉన్న పిక్ ను రిలీజ్ చేశారు. దీంతో వీరు కూడా ఉంటారని స్పష్టం చేశారు. వైఎస్ రాజశేఖర్ రెడ్డి చనిపోయినప్పటి నుంచి ఈ కథ మొదలవుతుందని గ్లింప్స్ లో తెలిస్తోంది. ఇక దీనికి సంబంధించి టీజర్ రిలీజ్ డేట్ ను తాజా ప్రకటించారు వర్మ.

    ‘వ్యూహం’కు సంబంధించి టీజర్ ను ఆగస్ట్ 15 (మంగళవారం) రోజున రిలీజ్ చేస్తున్నట్లు ప్రకటించారు వర్మ. ఉదయం 11 గంటలకు విడుదల చేస్తున్నట్లు ట్విటర్ ఖాతాలో తెలిపాడు. ఈ సినిమా షూటింగ్ కొన్ని రోజులుగా విజయవాడ, గుంటూరు ప్రాంతాల్లో కొనసాగుతోంది. ఈ చిత్రంలో జగన్ పాత్రలో అజ్మల్, ఆయన భార్య భారతి పాత్రలో మానస నటిస్తున్నారు.

    Share post:

    More like this
    Related

    DIG Ammireddy : అనంతపురం డీఐజీ అమ్మిరెడ్డి బదిలీ – తక్షణమే రిలీవ్ కావాలని ఈసీ ఆదేశం

    DIG Ammireddy : ఎన్నికల వేళ పలువురు పోలీసు అధికారులను ఎన్నికల...

    MLC Kavitha : ఎమ్మెల్సీ కవితకు మళ్లీ చుక్కెదురు – మద్యం కేసులో నో బెయిల్

    MLC Kavitha : మద్యం కేసులో బీఆర్ఎస్ ఎమ్మెల్సీ కవితకు మళ్లీ...

    Pawan Kalyan : దట్ ఈజ్ పవన్.. షారూఖ్ కన్నా ఎక్కువ డబ్బులిస్తామన్నా నో చెప్పాడట

    Pawan Kalyan : పవర్ స్టార్ పవన్ కల్యాణ్ గురించి.. ఆయనకున్న...

    POLLS

    [yop_poll id="2"]

    Latest News

    - Download the UBlood app here -

    Photos

    - Advertisement -

    Popular

    More like this
    Related

    RGV-Supritha : సురేఖా వాణి కూతురు సుప్రీతతో రామ్ గోపాల్ వర్మ.. ఏం చేస్తున్నారంటే?

    RGV-Supritha : రాంగోపాల్ వర్మ గురించి పరిచయం కావాలా? ఇండియన్ ఫిల్మ్...

    RGV Vyooham : ‘‘పట్టు వదలని విక్రమార్కున్ని..’’ గన్ తో వచ్చేశాడు వర్మ..!

    RGV Vyooham : రామ్ గోపాల్ వర్మ.. వివాదం ఆయన ఇంటిపేరు.....

    kolikapudi Arrest : కొలికపూడి అరెస్టుపై అంత అత్యుత్సాహం అవసరమా? 

    kolikapudi Arrest : నేడు అమరావతి పరిరక్షణ సమితి అధ్యక్షులు కొలికపూడి...

    RGV Vyooham : ‘వ్యూహం’ సెన్సార్ షిప్ సర్టిఫికెట్ రద్దు? వర్మ ఏం చెప్తున్నాడు?

    RGV Vyooham : రామ్ గోపాల్ వర్మ ఏదీ చేసినా సంచలనమే....