India vs Australia :
ప్రపంచకప్ కు ముందు ఆస్ర్టేలియా జట్టుతో మూడు వన్డేల సిరీస్ కు టీమిండియా రెడీ అయ్యింది. మొహాలీ వేదికగా శుక్రవారం ఆస్ర్టేలియా తో జరగనున్న మొదటి మ్యాచ్ కు టీం సిద్ధమైంది. అయితే బరిలోకి దిగే తుది జట్టు ఎలా ఉండబోతుందనే దానిపై చర్చ సాగుతున్నది. అయితే మొదటి రెండు వన్డేలకు కెప్టెన్ గా కేఎల్ రాహుల్, మూడో వన్డేకు రోహిత్ ను కెప్టెన్ గా ఎంపిక చేశారు. ఇక చాలా రోజుల తర్వాత అశ్విన్ జట్టులోకి వచ్చాడు. ఇక శ్రేయస్ అయ్యర్, సూర్యకుమార్ యాదవ్ సైతం ఈ సిరీస్ లో సత్తా చాటేందుకు సిద్ధమవుతున్నారు.
కాగా రోహిత్ శర్మ, విరాట్ కోహ్లీ, హార్దిక్ పాండ్యా ఈ రెండు మ్యాచ్ లకు విశ్రాంతి కల్పించారు. ఇక బౌలర్ సిరాజ్ కు కూడా విశ్రాంతినిచ్చే అవకాశముందని తెలిసింది. దీంతో బుమ్రా, ప్రసిద్ధ్ కృష్ణ, మహ్మద్ షమి బౌలింగ్ చేసే అవకాశమున్నది. అయితే ఇప్పుడు ఓపెనర్లుగా ఎవరు వస్తారనే అంశంపై ఉత్కంఠ నెలకొంది. శుభ్ మన్ గిల్ తో ఇషాన్ కిషన్ వస్తాడా.. లేదంటే తిలక్ వర్మకు ఈ అవకాశం దక్కుతుందా అనేది తేలాల్సి ఉంది. జట్టులో లెఫ్ట్ హ్యాండ్ బ్యాటర్లు వీరిద్దరే ఉన్నారు. ఇక టీంలో సూర్యకుమార్ ఇఫ్పటివరకు వన్డేల్లో సత్తా చాటలేదు. ఇప్పుడు ఆయనకు అవకాశం దక్కింది. ఇక ఆఫ్ స్పిన్నర్ల విషయానికి వస్తే అశ్విన్, వాషింగ్టన్ సుందర్ లలో ఎవరికి అవకాశం దక్కుతుందనేది కీలకంగా మారింది. అయితే ప్రపంచకప్ బెర్త్ కోసం అశ్విన్ ఆసక్తికిగా ఎదురు చూస్తున్నట్లు సమాచారం. మరి ఇలాంటి సందర్భంలో అశ్విన్ కు రేపటి వన్డేలో చాన్స్ దక్కే అవకాశం ఉంటుంది.
అయితే రేపటి తుది జట్టు ఎలా ఉంటుందనే అంశంపై జోరుగా చర్చ సాగుతున్నది. కెప్టెన్, వికెట్ కీపర్ గా కేల్ రాహుల్ వ్యవహరిస్తాడు. ఇక ఇషాన్ కిషాన్, శుభమన్ గిల్, సూర్యకుమార్ యాదవ్, శ్రేయస్ అయ్యార్, రుతురాజ్ గైక్వాడ్, రవీంద్ర జడేజా కు చోటు ఖాయంగా కనిపిస్తున్నది. ఇక బౌలర్లలో అశ్విన్, షమీ, బుమ్రా, ప్రసిద్ధ్ కృష్ణ జట్టులో ఉండే అవకాశం ఉంది.