Bro the Avatar పవర్ స్టార్ ముఖ్యపాత్రలో సాయి ధరమ్ తేజ్-కేతికా శర్మ జంటగా నటించిన చిత్రం బ్రో: ది అవతార్. ఇది తమిళ్ మూవీ వినోదయ సీతం రీమేక్ సముద్రఖని దర్శకత్వం వహించగా, మాటల మాంత్రికుడు త్రివిక్రమ్ డైలాగ్స్ రాయడంతో పాటు మూల కథలో మార్పులు చేశాడు. ఈ మూవీ రెండు రోజుల తర్వాత థియేటికల్ రిలీజ్ (జూలై 28) కానుంది. ఇప్పటికే ఓవర్సీస్ లో అడ్వాన్స్ బుకింగ్స్ ప్రారంభం కాగా.. ఇండియాలో చూసుకుంటే కర్ణాటకలో ఓపెన్ అయ్యాయి. అడ్వాన్స్ బుకింగ్స్ కు భారీ రెస్పాన్స్ వచ్చింది.
ఈ సినిమా విషయంలో చాలా అనుమానాలు నెలకొన్నాయి. అస్సలు హైప్ లేదు, ఓపెనింగ్స్ రావేమో అని భయపడిన అభిమానులకు బుకింగ్స్ చూసిన తర్వాత కొంత మేర మారింది. ఇక తెలుగు రాష్ట్రాల్లో అడ్వాన్స్ బుకింగ్స్ రేపు (జూలై 26)న ప్రారంభం అవుతున్నాయి. ఈ సినిమాకు సంబంధించిన ప్రివ్యూ షో దుబాయిలో ప్రముఖులకు వేసి చూపించారు. దాని టాక్ చూద్దాం.
ఈ సినిమాలో సెకండ్ ఆఫ్ లో పవన్ కళ్యాణ్ కెరీర్ లో ది బెస్ట్ గా నిలిచిపోతుందట. కన్నుల వెంట నీటిని కారించేంత సెంటిమెంట్ ఉంటుందట. త్రివిక్రమ్ రాసిన డైలాగ్స్, పవన్ నోటి నుంచి తూటాళ్లా పేలాయని, త్రివిక్రమ్ కెరీర్ లో ఇదొక బెస్ట్ అని అంటున్నారు. ఫస్ట్ హాఫ్ పూర్తిగా కామెడీకే కేటాయిస్తున్నారు. ఇంటర్వెల్ సీన్ అదిరిపోయింది. గ్రాఫిక్స్ మాత్రం సూట్ కాలేదట. పవన్ కళ్యాణ్ ను చేసేందుకే ఎక్కువ మంది వస్తారని టాక్ వినిపిస్తుంది. పవన్ ను తప్ప మిగతా ఎలిమెంట్స్ ను ఎవరూ పట్టించుకోరని తెలుస్తోంది. ఇంకా సినిమా గురించి పూర్తిగా తెలియాలంటే రెండు రోజులు ఆగాల్సిందే..