
BRS : తెలంగాణలో నవంబర్ లో జరిగిన ఎన్నికల్లో బీఆర్ఎస్ పార్టీ ఓటమి పాలైంది. కాంగ్రెస్ పార్టీ విజయం సాధించింది. దీనికి ప్రధాన కారణం కేసీఆరే. తన మొండి వైఖరితో ముందుకెళ్లి అధికారాన్ని కోల్పోయారు. ఇప్పుడు ఆలోచిస్తే ఏం లాభం? జరగాల్సిన నష్టం జరిగిపోయింది. ఈనేపథ్యంలో పార్టీని ఎలా బలోపేతం చేయాలనే ఆలోచనలో అధిష్టానం పడిపోయింది.
టీఆర్ఎస్ పార్టీ పేరు మార్పిడే ప్రధాన అడ్డంకిగా మారింది. టీఆర్ఎస్ పేరులోనే మంచి పట్టుంది. ఈ విషయం ప్రముఖ జ్యోతిష్యులు వేణుస్వామి పలుమార్లు గుర్తు చేశారు. బీఆర్ఎస్ పార్టీ విజయం సాధించదని వెల్లడించారు. కానీ కేసీఆర్ పట్టించుకోలేదు. నియంత ధోరణితో ముందుకెళ్లారు. దానికి పర్యవసానం అనుభవిస్తున్నారు. సొంత నిర్ణయాలు ఎలంటి ఫలితాలు ఇస్తాయో తెలుసుకోవాల్సిందే.
బీఆర్ఎస్ పేరు రాష్ట్రంలోనే కాదు కేంద్రంలో కూడా ప్రభావం చూపదు. కానీ కేసీఆర్ మాత్రం అవి పట్టించుకోలేదు. ఫలితంగా ఇప్పుడు దాని ఫలితాలు అనుభవిస్తున్నారు. ప్రజల్లో పట్టు కోల్పోయారు. ప్రతిపక్షం పాత్రలో పడిపోయారు. ఇప్పటికి కూడా అదే ధోరణిలో ఉంటే మనుగడ కష్టమే. వచ్చే ఎన్నికల్లో కూడా విజయం సాధించరు. పార్టీ పేరు టీఆర్ఎస్ గా మార్చితేనే మంచి ఫలితాలు వస్తాయని గుర్తుంచుకోవాలి.
జాతీయ స్థాయిలో చక్రం తిప్పాలని చూసి రాష్ట్రంలోనే డీలా పడిపోయారు. అందుకే అన్నారు కూట్లో రాయి ఏరలేనోడు ఏట్లో రాయి ఏరినట్లు అని. కానీ బీఆర్ఎస్ వాళ్ల అతి నమ్మకమే వారి కొంప ముంచింది. ఇప్పటికైనా మేల్కొని పార్టీ పేరు మార్చుకుని తమ జాతకం బాగుండేలా చూసుకోవాలని వేణుస్వామి సూచనలు చేస్తున్నారు.