34 C
India
Tuesday, May 7, 2024
More

    CID Chief Sanjay : నాడు బాలకృష్ణ, నేడు చంద్రబాబు.. ఇద్దర్నీ అరెస్టు చేసిన ఆఫీసర్‌ సంజయ్ నే

    Date:

    CID Chief Sanjay : ఇప్పుడు చంద్రబాబును విచారించి అరెస్ట్ చేసింది.. నాడు కాల్పుల కేసులో బాలకృష్ణను అరెస్ట్ చేసింది యాదృశ్చికంగా ఒక్కరే అధికార కావడం గమనార్హం. 2004లో దివంగత వై.ఎస్. రాజశేఖరరెడ్డి ముఖ్యమంత్రిగా ఉండగా, ఇప్పుడు ప్రతిపక్షనేత ఎన్. చంద్రబాబు నాయుడు బావమరిది హీరో బాలకృష్ణను ఇదే అధికారి అరెస్టు చేశారు. వైఎస్ఆర్ కుమారుడు వై.ఎస్. జగన్ మోహన్ రెడ్డి సీఎంగా ఉండగా.. ఆయన ప్రభుత్వంలో సీఐడీ చీఫ్ గా ఉన్న సంజయ్ ఇప్పుడు చంద్రబాబును అరెస్ట్ చేయడం విశేషం. .

    బామ్మర్ధి బాలకృష్ణను, బావ చంద్రబాబును ఒక్కరే  ఆఫీసర్ అరెస్ట్ చేయడం విశేషం. ఆంధ్రప్రదేశ్ క్రైమ్ ఇన్వెస్టిగేషన్ డిపార్ట్‌మెంట్ (APCID)కి అడిషనల్ డైరెక్టర్ జనరల్ ఆఫ్ పోలీస్‌గా సారథ్యం వహిస్తున్న 1996 బ్యాచ్ IPS అధికారి సంజయ్, మాజీ ముఖ్యమంత్రి మరియు తెలుగుదేశం పార్టీ జాతీయ అధ్యక్షుడిని శనివారం అరెస్టు చేయడం సంచలనంగా మారింది. ఆంధ్రప్రదేశ్ స్కిల్ డెవలప్‌మెంట్ కార్పొరేషన్‌లో ₹371 కోట్ల దుర్వినియోగంలో అతని పాత్ర ఉందని ఆరోపిస్తూ విచారించి సంజయ్ అరెస్ట్ చేశారు.

    ఇదే సంజయ్ గతంలో హైదరాబాద్ డిప్యూటీ కమీషనర్ ఆఫ్ పోలీస్ (వెస్ట్ జోన్)గా ఉన్నప్పుడు నాటి హీరో హిందూపురం ప్రస్తుత టీడీపీ ఎమ్మెల్యే బాలకృష్ణను ఓ నిర్మాతపై కాల్పులు జరిపిన కేసులో అరెస్టు చేసి కీలక ఆధారాలు సేకరించడంలో కీలక అధికారిగా ఉన్నారు. చంద్రబాబు నాయుడు అప్పుడు ప్రతిపక్ష నాయకుడుగా ఉన్నారు. ఆ కేసులో బాలయ్య బయటపడ్డారు. ఇద్దరినీ అరెస్ట్ చేసింది వైఎస్ఆర్ కుటుంబానికి అత్యంత ఆప్తుడైన అధికారి సంజయ్ కావడం గమనార్హం. .

    Share post:

    More like this
    Related

    DIG Ammireddy : అనంతపురం డీఐజీ అమ్మిరెడ్డి బదిలీ – తక్షణమే రిలీవ్ కావాలని ఈసీ ఆదేశం

    DIG Ammireddy : ఎన్నికల వేళ పలువురు పోలీసు అధికారులను ఎన్నికల...

    MLC Kavitha : ఎమ్మెల్సీ కవితకు మళ్లీ చుక్కెదురు – మద్యం కేసులో నో బెయిల్

    MLC Kavitha : మద్యం కేసులో బీఆర్ఎస్ ఎమ్మెల్సీ కవితకు మళ్లీ...

    POLLS

    [yop_poll id="2"]

    Latest News

    - Download the UBlood app here -

    Photos

    - Advertisement -

    Popular

    More like this
    Related

    PM Modi-Jagan : ఏపీ లో ప్రధాని జగన్ ను టార్గెట్ చేసేనా?

    PM Modi-Jagan : తెలుగు దేశం, జనసేన, భారతీయ జనతా పార్టీ...

    Viral Poster : నోటి దురుసు నాయకులను ఓడిద్దాం – సోషల్ మీడియాలో వైరల్

    Viral Poster : బూతులు, నోటి దురుసు నాయకులను ఓడించాలని ఓ...

    Mahesh Babu-Nara Brahmani : నారా బ్రహ్మణిని మహేశ్ బాబు రిజెక్ట్ చేశాడా.. ఎందుకు

    Mahesh Babu-Nara Brahmani : సూపర్ స్టార్ ప్రిన్స్ మహేశ్ బాబు...

    Modi : మోదీకి కూటమిపై మనసు లేదా? అందుకే ఇలా..

    Modi : ఏపీలో ఎన్నికలు దగ్గరకొస్తున్న కొద్దీ ప్రచారం మరింత ఉధృతంగా...