
Diabetes : మనలో చాలా మంది గోరుచిక్కుడు కాయ తినడానికి ఇష్టపడరు. కానీ ఇందులో పోషకాలు పుష్కలంగా ఉన్నాయి. దీంతో వీటిని తినడం మంచిదే. ఇందులో వాటర్ కంటెంట్ ఎక్కువగా ఉండటం వల్ల దేహానికి బలం చేకూరుస్తుంది. గోరు చిక్కుడులో కార్బోహైడ్రేడ్లు, ప్రొటీన్లు పుష్కలంగా ఉన్నాయి. వంద గ్రాముల గోరుచిక్కుడులో 35 కేలరీల శక్తి మాత్రమే ఉంటుంది. దీంతో దీన్ని తీసుకోవడం వల్ల మనకు పలు రకాల ప్రయోజనాలు దక్కుతాయి.
ఇందులో కార్బోహైడ్రేడ్లు, ప్రొటీన్లు, నీరు, ఫైబర్, చక్కెర, కాల్షియం, ఐరన్, విటమిన్ సి, ఎలు ఉండటంతో వీటిని తీసుకోవడం మంచిది. అస్తమా ఉన్నవారు కూడా దీన్ని రోజు తింటే వ్యాధి అదుపులో ఉంటుంది. శరీరం లోపల, బయట పుండ్లు ఉంటే అవి త్వరగా మానుతాయి. ఇన్ఫెక్సన్ ల నుంచి దూరం చేస్తాయి. యాంటీ మెకోబియల్ లక్షణాలు ఉండటంతో బ్యాక్టీరియాతో పోరాడుతుంది.
ఇందులో కడుపునొప్పి, అల్సర్లను దూరం చేసే శక్తి ఉంటుంది. గోరు చిక్కుడుతో చెడు కొలెస్ట్రాల్ తగ్గుతుంది. దీంతో గుండె నొప్పిని దూరం చేస్తుంది. హెచ్ డీఎల్ కొలెస్టాల్ ను పెంచడంలో కీలక పాత్ర పోషిస్తుంది. ఎల్ డీఎల్ బ్యాడ్ కొలెస్ట్రాల్. హెచ్ డీఎల్ గుడ్ కొలెస్ట్రాల్. గోరు చిక్కుడుతో మనకు చాలా రకాల లాభాలు ఉన్నాయని తెలుస్తోంది.
మధుమేహానికి కూడా ఇది మంచి మందులా పనిచేస్తుంది. రక్తంలో గ్లూకోజ్ స్థాయిలను తగ్గిస్తుంది. దీంతో గోరు చిక్కుడును వారంలో కనీసం మూడు సార్లయినా తీసుకుంటే షుగర్ లెవల్స్ తగ్గుతాయి. గోరుచిక్కుడు అధిక మొత్తంలో తీసుకుంటే నష్టమే. దీంతో గోరుచిక్కుడును పరిమితంగానే తినడం అలవాటు చేసుకోవాలి. ఈ క్రమంలో గోరుచిక్కుడును వాడుకుని లబ్ధిపొందాలని వైద్యులు చెబుతున్నారు.