CM Jagan : ముఖ్యమంత్రి జగన్ మోహన్ రెడ్డి పలుకుబడికి విలువ లేకుండా పోతోంది. ఇన్నాళ్లు తన మాటే వేదంగా భావించిన నేతలు ఇప్పుడు మొహం చాటేస్తున్నారు. తాను వస్తున్నానని తెలిసినా పట్టించుకోవడం లేదు. ఇంటి వస్తానంటే వద్దని చెబుతున్నారు. దీంతో తలెత్తుకుని తిరగలేని పరిస్థితి. గత ఐదేళ్లలో జగన్ రెడ్డి చెప్పిన ప్రతి అడ్డగోలు పని చేసిన ఎంపీ వేమిరెడ్డి ప్రభాకర్ రెడ్డి ఇప్పుడు జగన్ మొహం చూడటానికి కూడా ఇష్టపడటం లేదంటే పరిస్థితి ఏంటో అర్థం చేసుకోవచ్చు.
ప్రస్తుత పరిస్థితుల్లో వైసీపీ తరఫున పోటీ చేస్తే ఓటమి తప్పదనే వాదనలు వస్తున్నాయి. ఈనేపథ్యంలో చాలా మంది జగన్ కు దూరంగానే ఉంటున్నారు. వేమిరెడ్డి ప్రభాకర్ రెడ్డి ఢిల్లీ వెళ్లిపోయారు. వేమిరెడ్డికి సీఎంవో నుంచి తాజాగా సమాచారం వచ్చింది. సీఎం ఢిల్లీ వస్తున్నారు. డిన్నర్ కు మీ ఇంటికి వస్తారని చెప్పడంతో ఆయన రెడ్ కార్పెట్ పరుస్తారనుకున్నారు. కానీ అలా జరగలేదు.
తాము ఇంటి వద్ద ఉండటం లేదని చెప్పేశారు. మొహం తలుపేసినట్లు సూటిగా సమాధానం ఇవ్వడంతో జగన్ కు ఏం చేయాలో పాలుపోవడం లేదు. సీఎం అంటే ఇంత చులకన ఉంటుందా అని ఆశ్చర్యపోతున్నారు. తన భార్యను తీసుకుని దుబాయ్ వెళ్లిపోయారు. ఈ ఘటన ప్రస్తుతం చర్చనీయాంశంగా మారింది.
నెల్లూరు ఎంపీ అభ్యర్థిగా వేమిరెడ్డి ప్రభాకర్ రెడ్డి పేరును జగన్ నిర్ణయించారు. కానీ వేమిరెడ్డి మాత్రం మూడు స్థానాల్లో అభ్యర్థులను మార్చాలని డిమాండ్ చేశారు. ఒక్క స్థానంలో మార్చినట్లు మార్చి మిగతా చోట్ల అనిల్ అనుచరుడినే ఇన్ చార్జిగా నియమించారు. దీంతో వేమిరెడ్డి అవమానంగా భావించి తిరుగుబాటు చేశారు. నెల్లూరు నుంచే టీడీపీ లేదా బీజేపీ నుంచి పోటీ చేస్తారని అంటున్నారు. అందుకే జగన్ ఇంటికి వస్తానన్నా వద్దని వారించడంతో జగన్ కు అవమానం జరిగినట్లు భావిస్తున్నారు.