Crime News : యువతిని ప్రేమించిన విషయంలో జరిగిన గొడవ ఒకరి ప్రాణం తీయగా.. నలుగురిని నేరస్తులను చేసింది. ఈ ఘటన కర్ణాటకలోని, చిత్రదుర్గ జిల్లా, హోసదుర్గ తాలూకా, ఎన్‌ఎన్ కట్టే గ్రామంలో జరిగింది. ఇల్లంతా రక్తంతో భయానక దృశ్యాలు కనిపించాయి. ఎన్ఎన్ కట్టే గ్రామానికి చెందిన మనోజ్ నాయక్ అదే గ్రామానికి చెందిన రంజితాబాయితో కొన్నాళ్లుగా ప్రేమలో ఉన్నాడు.
ఈ విషయం రంజితాబాయి అక్క భర్త రఘునాయక్ కు తెలిసింది. వారు హిరియూరు తాలూకా సోమేనహళ్లిలో ఉంటారు. ఈ విషయంపై రఘునాయక్ మనోజ్ తో గొడవకు దిగాడు. ‘నా మరదలుతో ఎక్కువగా మాట్లాడుతున్నావు ఇది మానేయ్’ అంటూ గొడవ పెట్టుకునేవాడు.’ కానీ మనోజ్ మాత్రం తన లవ్ ను కంటిన్యూ చేసుకుంటూ పోయాడు.
ఒకసారి వీరిద్దరూ మాట్లాడు కోవడం రఘునాయక్ చూశాడు. వెంటనే మనోజ్ తో గొడవ పెట్టకున్నాడు.
ఎన్‌ఎన్ కట్టె గ్రామంలో గురువారం జరిగిన పండుగకు వచ్చిన మనోజ్ ను రఘునాయక్ ఇంటికి పిలిపించి మరోసారి నా మరదలితో మాట్లాడితే చంపుతానంటూ బెదిరింపులకు గురి చేశాడు. దీంతో ఇద్దరి మధ్యా మాటా.. మాటా.. పెరిగింది. రమేష్ నాయక్, రవినాయక్, శివనాయక్, ఇందిరాబాయి, సుమిత్రాబాయితో కలిసి రఘునాయక్ మనోజ్ పై మీద దాడి చేశారు.
ఈ గొడవలోనే రఘునాయక్ మనోజ్ ను కత్తితో తొడపై పొడిచాడు. తీవ్ర రక్తస్రావం కావడంతో హాస్పిటల్ కు తీసుకెళ్లారు. చికిత్స పొందుతూ మనోజ్ నాయక్ చనిపోయాడు. ఈ హత్యపై హోస్‌దుర్గా తాలూకా శ్రీరాంపూర్ పోలీస్ స్టేషన్ లో కేసు నమోదైంది. పోలీసులు ఘటనా స్థలానికి చేరుకునే లోగానే నిందితులు పరారయ్యాడు. ఇద్దరు నిందితులను అదుపులోకి తీసుకున్న పోలీసులు ప్రధాన నిందితుడి కోసం గాలిస్తున్నారు.