41.2 C
India
Sunday, May 5, 2024
More

    Dhoni Birthday Gifts : ధోనీ బర్త్ డేకు మన తెలుగువారి అదిరిపోయే బహుమతి

    Date:

    Dhoni Birthday Gifts  : టీమిండియా కెప్టెన్ గా మహేంద్ర సింగ్ ధోని ప్రపంచ కప్ తీసుకొచ్చాడు. దీంతో అతడికి అభిమానులు ఎక్కువ మందే ఉన్నారు. ఆరేళ్లలో దేశానికి మూడు ట్రోఫీలు అందించిన ఘనత ఆయన సొంతం. వన్డే వరల్డ్ కప్, టీ 20 వరల్డ్ కప్, చాంపియన్స్ ట్రీఫీలు అందించి మన ఖ్యాతిని పెంచాడు. జట్టు కష్టాల్లో ఉన్నప్పుడు మిస్టర్ కూల్ గా మ్యాచ్ లు ముగించడం ఆయనకు అలవాటే. వరల్డ్ కప్ ఫైనల్ లో సైతం అలాంటి ప్రశాంతతతోనే కప్ గెలిచాడు.

    తనదైన బ్యాటింగ్ తో ప్రత్యర్థికి చుక్కలు చూపించడం ప్రత్యేకత. ప్రస్తుతం మహేంద్ర సింగ్ ధోని రేపు 43వ సంవత్సరంలోకి అడుగు పెడుతున్నాడు. ఇటీవల ముగిసిన ఐపీఎల్ లో ధోని ప్రతిభ ఏంటో చూశారు. అతడికి తెలుగు అభిమానులు కూడా చాలా మంది ఉన్నారు. అతడి పుట్టిన రోజు సందర్భంగా మహేంద్ర ధోని ఫ్యాన్స్ అసోసియేషన్ హైదరాబాద్ ఆధ్వర్యంలో ఆర్టీసీ క్రాస్ రోడ్డు వద్ద 52 అడుగుల కటౌట్ ఏర్పాటు చేశారు.

    ధోని బర్త్ డే సందర్భంగా శుక్రవారం ఈ కటౌట్ ను ఆవిష్కరించనున్నారు. అంతే కాదు భారీ కేక్ కట్ చేసేందుకు కూడా ఏర్పాట్లు చేశారు. ధోనీ గ్రౌండ్ లోకి నడిచి వస్తున్నట్లు కటౌట్ పెట్టడం గమనార్హం. నందిగామ ఫ్యాన్స్ 77 అడుగుల భారీ కటౌట్ చేస్తే 2018లో కేరళలో 35 అడుగులు, చెన్నైలో 30 అడుగుల కటౌట్, విజయవాడలో 41 అడుగుల కటౌట్ ఏర్పాటు చేయగా  అన్నిటికి మించి హైదరాబాద్ లో 52 అడుగుల రికార్డు కటౌట్ ఏర్పాటు చేయడం గమనార్హం. అన్నిటికంటే నందిగామలోనే 77 అడుగుల కటౌట్ ఏర్పాటు చేసి వారి అభిమానాన్ని చాటుకున్నారు.

    ఇలా మహేంద్ర సింగ్ ధోనీ గురించి ఇంత అభిమానం ఉంచుకోవడంతో ఆయన పుట్టిన రోజు వేడుకలు అట్టహాసంగా జరుపుకునేందుకు సిద్ధమయ్యారు. తెలుగు వారి అభిమానం లెక్కలేనిది. ధోనీ జన్మదిన వేడుకలు ఘనంగా నిర్వహించేందుకు కదిలారు. తెలుగు రాష్ట్రాల్లో నిర్వహించేందుకు అప్పుడే ఏర్పాట్లు చేశారు. కేక్ కటింగ్ చేసి తమ భక్తిని చాటుకోనున్నారు.

    Share post:

    More like this
    Related

    US Student Visas : మే రెండో వారంలో.. యూఎస్ స్టూడెంట్ వీసాలు

    US Student Visas : ఉన్నత విద్యాభ్యాసం కోసం అమెరికా వెళ్లాలని...

    AP Elections 2024 : ‘వామ్మో వీడు మళ్లీ రాకూడదు’ ఏపీ అంతా ఇదే అంటుందా?

    AP Elections 2024 : ఆంధ్రప్రదేశ్ లో పోలింగ్ కు దాదాపు...

    Nagabhushanam : విలన్ కు గుర్తింపు తెచ్చిందే నాగభూషణం

    Nagabhushanam : తెలుగు సినిమా ఇండస్ట్రీలో విలన్ పాత్రలో ఒదిగిపోయిన నటుడు...

    POLLS

    [yop_poll id="2"]

    Latest News

    - Download the UBlood app here -

    Photos

    - Advertisement -

    Popular

    More like this
    Related

    Preservation of Telugu : తెలుగు భాష పరిరక్షణ మనందరి బాధ్యత

    Preservation of Telugu : తెలుగు భాష వ్యాప్తి కోసం ఎందరో...

    Telugu Language : తెలుగు భాష పదప్రయోగం ‘అద్భుతం’.. ఈ పిక్ చూస్తే అర్థమవుతుంది..!

    Telugu Language Amazing: భారతదేశంలో ఎన్నో భాషలున్నాయి. ఎవరికీ మాతృభాష వారికి గొప్పదే....

    కాశీలో తెలుగువారి సేవలు.. గంగా పుష్కరాలకు వెళ్లిన వారి కోసం సౌకర్యాలు

    ప్రేమను పంచడంలో తెలుగు వారి తర్వాతే ఎవరైనా.. అని చెప్పడంలో ఎలాంటి...

    తెలుగు రాష్ట్రాల రాజకీయ నేతల రాశులు-హస్తవాసి.. ఇంట్రస్టింగ్ విషయాలు మీకోసం..

    రాశులు-రాజకీయాలు.. రాజకీయ నేతలు. శోభకృత్‌ నామ సంవత్సరంలో తెలుగు రాష్ట్రాల రాజకీయ...