40 C
India
Sunday, May 5, 2024
More

    కాశీలో తెలుగువారి సేవలు.. గంగా పుష్కరాలకు వెళ్లిన వారి కోసం సౌకర్యాలు

    Date:

    ganga
    ganga

    ప్రేమను పంచడంలో తెలుగు వారి తర్వాతే ఎవరైనా.. అని చెప్పడంలో ఎలాంటి సందేహం లేదు. తెలుగు సమాజం ఎక్కడున్నా అక్కడికి వచ్చే తెలుగు వారిని ప్రేమిస్తూ.. మిగతా వారిని గౌరవిస్తూ అన్ని వసతులు కల్పిస్తారు తెలుగువారు. వివిధ కమ్యూనిటీల పేరుతో చాలా ఆధ్యాత్మిక ప్రదేశాలలో సత్రాలు, గృహాలు, భోజనం వసతులు కూడా ఏర్పాటు చేస్తారు.

    ఆధ్యాత్మిక సేవల్లో కూడా తెలుగు వారు ముందే ఉంటారు. వేములవాడు, తిరుపతి, అన్నవరం, సింహాచలం, కొండగట్టు లాంటి పెద్ద పెద్ద ఆధ్యాత్మిక ప్రదేశాలతో పాటు ఇతర రాష్ర్టాలైన షిర్డీ, తమిళనాడులోని మధురమీనాక్షి, ఇతర పుణ్య క్షేత్రాలలో తెలుగు వారు సేవా కేంద్రాలను ఏర్పాటు చేసి అక్కడికి వచ్చే భక్తులకు ఎలాంటి అసౌకర్యం కలగకుండా చూసుకుంటారు. తెలుగు రాష్ర్టాల నుంచి వచ్చే వరికే కాకుండా ఇతరులకు కూడా కావాల్సిన సాయం చేస్తుంటారు. ఇంక యూఎస్, కెనెడా, బ్యాంకాక్, దుబాయ్ ఇలా చాలా దేశాల్లో ప్రత్యేక సంఘాలను ఏర్పాటు చేసి అక్కడున్న వారికి సేవలు చేస్తారు.

    ఇక ఆధ్యాత్మిక జాతరల్లో తెలుగు వారు లేనిదే అందం ఉండదంటే నమ్మండి. కుంభమేళాలు, మహా కుంభమేళాల్లో కూడా తెలుగు వారి కోసం ప్రత్యేక వసతులు కల్పించారు తెలుగు సంఘం నిర్వాహకులు. నదులకు పుష్కరాలు వచ్చిన సమయంలో ఆయా నదులు ప్రవహించే ఇతర రాష్ట్రాల్లో సహాయం అందజేస్తున్నారు.

    అయితే ఇటీవల గంగా నదికి పుష్కరాలు వచ్చాయి. అయితే పుణ్యస్నానం కోసం కాశీకి వచ్చే తెలుగు వారు ఇబ్బంది పడతారని గ్రహించిన తెలుగు సంఘం నిర్వాహకులు అక్కడ తమ సేవలను ప్రారంభించారు. అవసరాలు, గదులు, సత్రాలు, కావాల్సిన అవసరాలను తీరుస్తున్నారు. గంగా పుష్కరాలు ఏప్రిల్ 24న ప్రారంభం కాగా మరికొన్ని రోజుల పాటు సేవలను అందుబాటులో ఉంచుతున్నారు. అక్కడికి వెళ్లిన వారు వారి సేవలపై హర్షం వ్యక్తం చేస్తున్నట్లు చెప్తున్నారు.

    Share post:

    More like this
    Related

    Viral Poster : నోటి దురుసు నాయకులను ఓడిద్దాం – సోషల్ మీడియాలో వైరల్

    Viral Poster : బూతులు, నోటి దురుసు నాయకులను ఓడించాలని ఓ...

    Uttar Pradesh : స్టేషన్ మాస్టర్ నిద్రలో.. అరగంట నిలిచిన రైలు

    Uttar Pradesh : ఓ స్టేషన్ మాస్టర్ నిద్ర  ఓ ఎక్స్...

    CM Revanth : ‘దానం’ను కేంద్రమంత్రి చేస్తా..: సీఎం రేవంత్

    CM Revanth : బీఆర్ఎస్ నుంచి కాంగ్రెస్ పార్టీలోకి వచ్చి సికింద్రాబాద్...

    POLLS

    [yop_poll id="2"]

    Latest News

    - Download the UBlood app here -

    Photos

    - Advertisement -

    Popular

    More like this
    Related

    Preservation of Telugu : తెలుగు భాష పరిరక్షణ మనందరి బాధ్యత

    Preservation of Telugu : తెలుగు భాష వ్యాప్తి కోసం ఎందరో...

    Varanasi Cricket Stadium : అబ్బురపరుస్తున్న శివుడి రూపంలో వారణాసి క్రికెట్ స్టేడియం..

    Varanasi Cricket Stadium : క్రికెట్ ను అభిమానించే దేశాల్లో మనదేశం...

    Dhoni Birthday Gifts : ధోనీ బర్త్ డేకు మన తెలుగువారి అదిరిపోయే బహుమతి

    Dhoni Birthday Gifts  : టీమిండియా కెప్టెన్ గా మహేంద్ర సింగ్...

    Telugu Language : తెలుగు భాష పదప్రయోగం ‘అద్భుతం’.. ఈ పిక్ చూస్తే అర్థమవుతుంది..!

    Telugu Language Amazing: భారతదేశంలో ఎన్నో భాషలున్నాయి. ఎవరికీ మాతృభాష వారికి గొప్పదే....