
Telugu Language Amazing: భారతదేశంలో ఎన్నో భాషలున్నాయి. ఎవరికీ మాతృభాష వారికి గొప్పదే. అయినప్పటికీ దేశభాషలందు తెలుగు లెస్స అనే నానుడి ప్రసిద్ధి చెందింది. తెలుగు భాషకు ఎంతో ప్రాచీన చరిత్ర ఉంది. ఎంతోమంది ప్రముఖ కవులు తెలుగులో రచనలు చేసి జాతి కీర్తిని ప్రపంచవ్యాప్తంగా చాటి చెప్పారు.
తెలుగు భాష గొప్పతనం తెలియాలంటే తెలుగులోనే సంభాషించాలి. తెలుగు కవులు రాసిన రచనలు.. పద్యాలు.. గద్యాలు.. పాటలు.. కవితలు.. పల్లె గీతాలు.. కూని రాగాలు.. హస్య రచనలు.. విప్లవ రచనలు.. గీతాలు.. యాస.. ప్రాసలపై అవగాహన పెంచుకోవాలి. తెలుగులో రాసిన రామాయణం.. మహాభారతం లాంటి గొప్ప ఇతిహాసాలను చదవాలి.
ఏ ఇతర భాషలకు లేని అద్భుత పద ప్రయోగం మన భాషలో ఉంది. ఉదాహరణకు ‘ఆహారం ఎంత బాగుందో!’.. ‘‘ఆ హారం ఎంత బాగుందో!’.. ‘‘ఆహా! రం ఎంత బాగుందో..’’ అనే పదాలను పరిశీలిస్తే అర్థమవుతుంది. ఒకే పదాన్ని మూడు విధాలుగా రాయడం అనేది ఒక్క తెలుగు భాషలోనే సాధ్యమవుతుంది. ఇలాంటి పద ప్రయోగాలను ఇతర భాషల్లో పెద్దగా కన్పించవు.
కానీ తెలుగు భాషపై పట్టు సాధిస్తే మాత్రం పదాల కూర్పుతో ఎన్నో అద్బుతాలను సృష్టించవచ్చు. అందుకే తెలుగు భాషను ‘ఇటాలియన్ ఈస్ట్’ అని కూడా పిలుస్తుంటారు. నేటి పిల్లలను మన మాతృభాషను గౌరవించడంతోపాటు ఇతర భాషలైన ఇంగ్లీష్.. హిందీ వాటిని కూడా నేర్చుకోవాలి. అంతేకానీ తెలుగు భాషను కించపర్చేలా మాట్లాడటం తగదని మాతృభాష ప్రేమికులు సూచిస్తున్నారు.