Cyber crime సైబర్ నేరాలు పెరుగుతున్నాయి. అమాయకుల అత్యాశను ఆసరాగా చేసుకుని మోసాలకు పాల్పడుతున్నారు. ప్రజల అమాయకత్వాన్ని క్యాష్ చేసుకునేందుకు ప్లాన్ వేసుకుంటున్నారు. ఈ నేపథ్యంలో అపరిచిత కాల్స్ పట్ల జాగ్రత్తగా ఉండాలని పోలీసులు చెబుతున్నారు. కొత్త తరహా మోసాలకు పాల్పడుతున్నారు. ఇతర ఫోన్ కాల్స్ ఎత్తకుండా ఉండటమే శ్రేయస్కరం అని చెబుతున్నారు.
ఇటీవల పాకిస్తాన్ కేంద్రంగా మోసాలకు పాల్పడుతున్నారు. +92 కంట్రీ కోడ్ తో వచ్చే వాట్సాప్ కాల్స్ ను లిప్ట్ చేయొద్దని సూచిస్తున్నారు. ఒకవేళ ఫోన్ లిఫ్ట్ చేస్తే ఏవో తాయిలాలు ఇస్తామంటూ మోసాలకు పాల్పడుతున్నారు. దీంతో వినూత్నంగా ప్రజలను మోసం చేసే ముఠా సంచరిస్తోందని గుర్తు చేస్తున్నారు. ఈ కోడ్ తో కాల్స్ వస్తే జాగ్రత్తగా ఉండాలని చెబుతున్నారు.
+92తో ఫోన్ చేసి ఉచితంగా ఐ ఫోన్లు, యాపిల్ ప్రొడక్టులు ఇస్తామని నమ్మించి రూ. లక్షల్లో దండుకుంటున్నారు. +92 కోడ్ పాకిస్తాన్ ది కావడంతో జాగ్రత్తగా ఉండాలని సూచిస్తున్నారు. భారతీయులను టార్గెట్ చేసుకుని డబ్బులు కొల్లగొడుతున్నారు. దీనిపై నిరంతరం అప్రమత్తంగా ఉండాలని అంటున్నారు. అనవసర కాల్స్ లిఫ్ట్ చేస్తే నష్టాల పాలవుతారు.
కొత్త కొత్త నంబర్లతో భారత పౌరులను లక్ష్యంగా చేసుకుని రెచ్చిపోతున్నారు. మన డబ్బు కొల్లగొట్టడానికే ప్రణాళికలు రచిస్తున్నారు. కొత్త తరహాలో మోసాలకు పాల్పడుతున్నారు. ఆధునిక పద్ధతుల్లో ప్రజలను మోసం చేసి డబ్బులు సంపాదించుకోవాలని కుట్రలు పన్నుతున్నారు. హవాలా మార్గంలో డబ్బులు రాబట్టాలని ప్లాన్ చేసుకుంటున్నారు.