
Tea and coffee : మనలో చాలా మంది మద్యం తాగుతుంటారు. కొందరైతే ఒళ్లు తెలియకుండా ఫుల్లుగా అయిపోతారు. నడుస్తుంటే అటు ఇటు తూగుతుంటారు. ఇంకా కొందరు ఎంత తాగినా స్టడీగానే ఉంటారు. వారి వారి శరీర బలం పట్టి వారి ప్రవర్తన ఉంటుంది. మద్యం తాగే అలవాటుతో చాలా మంది ఆరోగ్యం పాడు చేసుకోవడం సహజమే. కానీ ఎవరు చెప్పినా పట్టించుకోరు.
మద్యం తాగిన తరువాత కొందరు పెరుగు తాగితే కిక్కు పోతది అంటారు. కానీ అందులో నిజం లేదు. మద్యం తాగిన సందర్భంలో ఏం తాగినా నిషా తగ్గదు. అలాగే ఉంటుంది. కొందరు మాత్రం తాగాక బాగా నిద్రపోయి తెల్లవారు అలాగే మత్తులోనే లేస్తారు. ఇలా మద్యం తాగిన వారు తూగుతుండటం చూస్తుంటాం.
రాత్రి తప్పతాగి రాత్రంతా నిద్రపోయి తెల్లారి లేచే సరికి మద్యం మత్తు దిగిపోతుందా? మద్యం దిగిపోదు. నిద్రకు రక్తంలో కలిసిన అల్కహాల్ కు ఎటువంటి సంబంధం ఉండదు. నిద్రపోయి లేచినంత మాత్రాన శరీరంపై మెదడు పనితీరుపై అల్కహాల్ ప్రభావం తగ్గదు. శరీర బరువు, జీవక్రియ వేగాన్ని అల్కహాల్ నియంత్రిస్తుంది.
మత్తు త్వరగా దిగిపోవడానికి అల్కహాల్ ప్రభావం తగ్గించడానికి మార్గాలు లేవు. టీ, కాఫీలు తాగడం, చల్లని నీటిని మీద పోసుకున్నట్లే. ఐస్ క్రీం, పెరుగు తాగడం వల్ల కూడా ఎలాంటి ప్రయోజనం ఉండదు. దీంతో చాలా మంది టీ, కాఫీ తాగితే మద్యం ప్రభావం చూపదని అనుకుంటారు అంతే. అందులో నిజం లేదు.