Eating curd : ఎండాకాలంలో చాలా మంది పెరుగు తింటారు. కానీ పెరుగు వల్ల చల్లదనం కాదు వేడి ఎక్కువగా వస్తుంది. దీనికన్నా మజ్జిగ నయం. పెరుగు రుచిలో పుల్లగా ఉంటుంది. ఇది జీర్ణం కావడానికి ఎక్కువ సమయం తీసుకుంటుంది. కాబట్టి వేసవిలో పెరుగు కంటే చల్ల తాగడమే బెటర్. పెరుగు రోజు కాకుండా అప్పుడప్పుడు తీసుకుంటే సరి. ఆరోగ్యానికి హాని ఉండదు.
రాళ్ల ఉప్పు, ఎండుమిర్చి, జీలకర్ర వంటి మసాలా దినుసులు తీసుకుని మజ్జిగ రూపంలో రోజు తీసుకున్న లాభమే. పెరుగులో నీరు కలిపినప్పుడు వేడిని తగ్గిస్తుంది. పెరుగును ఆస్వాదించాలంటే పెరుగులో నీళ్లు పోసి గిలక్కొట్టి తింటే మేలు కలుగుతుంది. దీంతో శరీరానికి ప్రయోజనం కలుగుతుంది. వేసవిలో పెరుగుకు బదులు మజ్జిగ వాడుకుంటే మంచి ఫలితాలు రావడం ఖాయం.
పెరుగులో చల్లబరిచే లక్షణాలు తక్కువగా ఉంటాయి. పెరుగు తినడం వల్ల శరీరంలో ఉష్ణం పెరుగుతుంది. ఎండాకాలంలో పొట్ట ఆరోగ్యంగా చల్లగా ఉండాలంటే పెరుగు తినాలని చెబుతుంటారు. పెరుగులో ప్రోబయోటిక్స్, న్యూట్రిషియన్ తో కూడిన ఆహారం ఉంటుంది. ప్రొటీన్, కాల్షియం, విటమిన్ బి లాంటి పోషకాలు మెండుగా ఉండటంతో ఎక్కువగా తీసుకుంటారు.
పెరుగు తిన్న తరువాత కొందరికి మొటిమలు, అలర్జీలు, జీర్ణ సమస్యలు వస్తాయి. ఇంకా కొందరికి వేడి చేస్తుంది. అందుకే పెరుగులో చల్లదనం కంటే వేడి చేసే లక్షణాలే ఎక్కువగా ఉన్నాయని అర్థమవుతోంది. ఇలాంటి లక్షణాలు ఉండటం వల్ల పెరుగులో వేడి చేసే గుణాలే ఎక్కువగా ఉన్నాయని చెబుతున్నారు. ఈ నేపథ్యంలో పెరుగు తినడం కంటే మజ్జిగ తినడమే మంచిది.