39.6 C
India
Monday, April 29, 2024
More

    Parental Care : నిన్ను 25 ఏండ్లు మోసినా..అమ్మనాన్న బరువైపోయారా?

    Date:

    Parental Care
    Parental Care

    Parental Care : ‘‘నవమాసాలు మోసి అమ్మ నిన్ను ఈ ప్రపంచంలోకి తెస్తుంది..బుడిబుడి నడకలను నేర్పుతూ నువ్వు పరుగులు పెట్టేదాక నాన్న నీ తోడుంటాడు..నీ బరువును తాను మోస్తాడు.. అమ్మ పస్తులుండి నీ కడుపు నింపుతుంది.. నీకు రెక్కలొచ్చి ఎగిరేదాక నాన్న నిన్ను తన భుజాన మోస్తాడు. కంటికి రెప్పలా కాపాడుకుంటూ నీ భవిష్యత్తే వారి భవిష్యత్ గా నీ కోసం కంటి నిద్రకు, ఒంటి సుఖానికి, మంచి బట్టకు దూరమై నీకోసమే తమ బతుకు అనుకుంటారు..’’ ఇదీ తల్లిదండ్రులు తమ పిల్లల పట్ట చూపించే ప్రేమాభిమానాలు.

    కానీ నేటి సమాజంలో ఏం జరుగుతోంది. అమ్మనాన్నలు భారమైపోయారు. అమ్మ కొంగు పట్టి ఆడుకున్నా రోజులు మరిచిపోతున్నారు. బైక్ పై నాన్న వెనక గట్టిగా పట్టుకుని కూర్చున్న రోజులు మరిచిపోతున్నారు. తమ స్వార్థం కోసం బుక్కెడంత బువ్వ పెట్టకుండా.. ఛీదరించుకుంటూ రోడ్లు మీద వదలిపెట్టి వెళ్తున్నారు. కొందరు వృద్ధాశ్రమాలకు, స్వచ్ఛంద సంస్థలకు.. మరికొందరు.. వేములవాడ వంటి పుణ్యక్షేత్రాల్లో వారిని అడుక్కు తినండి అంటూ వదిలివెళ్తున్నారు.

    25ఏండ్లు పెంచి పెద్ద చేసినా అమ్మనాన్నలను పంచుకునే అన్నదమ్ములు ఉన్నారు. అమ్మ అయితే పాచి పని చేస్తుందని..నాన్న అయితే మందుకు, సిగరెట్ కు డబ్బులివ్వాల్సి వస్తుందని ‘‘నాన్న మాకు వద్దు పో’’ అనేవారు ఉన్నారు. ఇంకొందరు ఆస్తిని అన్నకే ఇచ్చారని, చెల్లెకే  ఇచ్చావని.. మీ ఆలనాపాలనా మాకు అవసరం లేదని తలుపులు మూసుకునేవారు ఉన్నారు. ఆస్తులన్నీ తమ పేరు మీదికి మార్చుకుని అమ్మనాన్నలను ఉత్తచేతులతో బయటకు సాగనంపేవారు ఉన్నారు. చిన్ననాడు ముద్దొచ్చిన అమ్మనాన్నలు.. వారు ‘నాన్న’ అయ్యాక చేదు అవుతున్నారు.

    ఇలా ఇంటికో చరిత్ర.. సమాజంలో ప్రస్తుతం ఇదొక సామాజిక సమస్యగా మారింది. పండుటాకులను పట్టించుకోని దుర్మార్గపు సంతానంపై కేసులు కూడా పెట్టవచ్చని పోలీసులు చెపుతున్నారు. జన్మనిచ్చిన తల్లిదండ్రులను వారి జీవిత చరమాంకంలో చూసుకోవాల్సిన బాధ్యత పిల్లలదే అని హితువు పలుకుతున్నారు. లేకుంటే కటకటాల వెనక్కి నెట్టే చట్టాలు కూడా ఉన్నాయని హెచ్చరిస్తున్నారు.

    Share post:

    More like this
    Related

    Gutha Amith Reddy : కాంగ్రెస్ పార్టీలో  చేరిన గుత్తా అమిత్ రెడ్డి

    Gutha Amith Reddy : అసెంబ్లీ ఎన్నికల్లో ఓడి పార్లమెంట్ ఎన్నికల్లో...

    Anchor Anasuya : పొట్టి దుస్తులపై సమర్ధించుకున్న యాంకర్ అనసూయ

    Anchor Anasuya : యాంకర్ గా అనసూయ అడుగుపెట్టింది. ఆ తరువాత...

    Chennai : బాల్కనీ నుంచి పడిపోయిన చిన్నారి.. కాపాడేందుకు విశ్వ ప్రయత్నం

    Chennai : తమిళనాడు రాజధాని చెన్నైలో చూలామై అనే ఒక ఎరియాలో...

    TDP : టీడీపీ ఎన్నికల ప్రచార రథంపై రాళ్లదాడి

    TDP : టీడీపీ ఎన్నికల ప్రచార రథంపై ఆదివారం రాత్రి రాళ్లదాడి...

    POLLS

    [yop_poll id="2"]

    Latest News

    - Download the UBlood app here -

    Photos

    - Advertisement -

    Popular

    More like this
    Related

    Sukanya Samriddhi Yojana : ఆడబిడ్డలు ఉన్నారా? మీరు అలా చేయకుంటే మీ ఖాతా ఫ్రీజ్.. వెంటనే త్వరపడండి

    Sukanya Samriddhi Yojana భారతీయ జనతా పార్టీ కేంద్రంలో అధికారం చేపట్టిన...

    Mother Father : నాన్న.. నీ మనసు వెన్న

    Mother Father : అమ్మ జన్మనిస్తుంది. నాన్న ప్రేమనిస్తాడు. మన జీవితం...

    పిల్లల పెంపకంలో ఎలాంటి జాగ్రత్తలు తీసుకోవాలో తెలుసా?

    పిల్లల పెంపకంలో తల్లిదండ్రులు జాగ్రత్తలు తీసుకోవాలి. వారి ముందు చెడు మాటలు...

    అమ్మ‌-నాన్న‌ల కోసం పిల్ల‌ల నిర‌స‌న..!

    దేవుళ్లు సినిమా చూసే ఉంటారు. అందులో వాళ్ల అమ్మ‌-నాన్న‌ల‌కు కోసం పిల్ల‌లు...