
Food in Newspaper : మనకు చెడు అలవాట్లు తొందరగా అలవడతాయి. మంచి అలవాట్లు మాత్రం ఆలస్యంగా తెలుసుకుంటాం. రోజు మనం వివిధ తినుబండారాలు పేపర్లలో ప్యాక్ చేయించుకుని తీసుకెళ్తాం. కానీ ఇది డేంజర్. ఆహార పదార్థాలను ప్యాక్ చేయడానికి పేపర్ సురక్షితం కాదు. దాంతో మనకు పలు రోగాలు వ్యాపించే అవకాశముందని ఆరోగ్య సంస్థ నిపుణులు హెచ్చరిస్తున్నారు.
న్యూస్ పేపర్ ప్రింట్ చేసేటప్పుడు రకరకాల రసాయనాలు, ఇంకులు కలుపుతారు. దీంతో పేపర్ ప్యాకింగ్ కు వాడటం వల్ల అందులోని రసాయనాలు మన శరీరంలోకి వెళ్లి ముప్పు తెస్తాయి. మనం వేడి పదార్థాలనే ప్యాక్ చేయిస్తుంటాం. ఆ వేడికి అందులోని సిరా కరిగి వాటికి అంటుకుని మనకు అనారోగ్యాలు వచ్చే సూచనలు ఉన్నాయని ఫుడ్ సేఫ్టీ స్టాండర్డ్స్ అథారిటీ ఆఫ్ ఇండియా హెచ్చరించింది.
ఇక మీదట ఏవైనా తినుబండారాలు న్యూస్ పేపర్ లో ప్యాక్ చేయించుకుని తీసుకుని రావద్దని చెబుతోంది. దీని వల్ల కలిగే అనర్థాలు తెలుసుకుని ప్రజలు అప్రమత్తంగా ఉండాలని సూచించింది. న్యూస్ పేపర్లలోని ఇంకులో హానికరమైన కెమికల్స్ ఉంటాయని చెబుతున్నారు. ఆహార పదార్థాలను ఎట్టి పరిస్థితుల్లో న్యూస్ పేపర్ తో ప్యాక్ చేయించుకోవద్దని వివరించింది.
వినియోగదారులు ఈ విషయం తెలుసుకుని మసలుకోవాలి. లేకపోతే మన ఆరోగ్యం గోవిందా అవుతుంది. మన ఆరోగ్యాన్ని మనమే కాపాడుకోవాలి. అప్పుడే మనకు భరోసా ఉంటుంది. ఏది పడితే అది విచ్చలవిడిగా ప్యాక్ చేయిస్తూ ఇంటికి తెచ్చుకోవడం అంత మంచిది కాదు. న్యూస్ పేపర్ తో ప్యాక్ చేయించుకోవడం సురక్షితం కాదు. అందుకే జాగ్రత్తగా ఉండండి.