39.6 C
India
Monday, April 29, 2024
More

    Gourav Choudhary : యూట్యూబ్ వీడియోలు చేసి.. 400కోట్లు సంపాదించిన కుర్రాడు

    Date:

    Gourav Choudhary
    Gourav Choudhary youTuber

    Gourav Choudhary : ఎప్పుడూ సెల్ ఫోన్, యూట్యూబ్ అంటూ తిరిగితే చదువు సంకనాకి, జీవితం పెంట అయిపోతుందిరా అని పిల్లలను తల్లిదండ్రులు నిత్యం తిడుతూ ఉంటారు. యూట్యూబ్ వీడియోలు అందరికీ వర్కవుట్ కావు.. మంచిగా చదువుకుని ఏదైనా ఉద్యోగం చేసుకో అని కూడా హితువు పలుకుతుంటారు. కానీ యూట్యూబ్ తో ఏకంగా వందల కోట్ల అధిపతి అయి తన సత్తా ఏంటో నిరూపించాడు ఓ కుర్రాడు. అతడు ఎవరో .. అతడి విజయగాథ ఏంటో తెలుసుకుందాం..

    రాజస్థాన్ లోని అజ్మీర్ కు చెందిన గౌరవ్ చౌధురి పేద కుటుంబానికి చెందినవాడు. తమకున్న కిరాణాషాపు మీద వచ్చే ఆదాయం అంతంత మాత్రమే. సంపాదన సరిపోక తండ్రి దుబాయి వెళ్లాడు. ఇక తల్లితో కలిసి దుకాణం నడుపుతూనే ఇంటర్ కు వచ్చేశాడు. స్నేహితుల వల్ల అతడికి టెక్నాలజీపై మక్కువ పెరిగింది. క్లాసులు మానేసి మరి కోడింగ్ నేర్చుకున్నాడు. అయితే కాలేజీ ఎగ్గొట్టి అవేం పనులను పేరెంట్స్ తిట్టేవారు. అయినా అతడు వినలేదు. అతడి ఆసక్తిని గుర్తించిన లెక్చరర్లు ఎలక్ట్రానిక్స్ చదువుకోమ్మని ప్రోత్సహించారు. అయితే తండ్రి గౌరవ్ ఇంటర్ పూర్తికాగానే దుబాయ్ కు తీసుకెళ్లాడు.

    అక్కడ పనిచేయడం సుతారమూ ఇష్టంలేని గౌరవ్ చదువు మీద కాన్ సెంట్రేషన్ చేసి బిట్స్ పిలానీలో మైక్రో ఎలక్ట్రానిక్స్ లో సీటు సంపాదించి దుబాయ్ క్యాంపస్ లో చేరాడు. ఆ టైంలో లెక్చరర్లు, ఫ్రెండ్స్ గౌరవ్ కు సాయపడ్డారు. అతడు కూడా పార్ట్ టైంలు చేసి చదువు పూర్తి చేసి దుబాయ్ లోనే చిన్న ఉద్యోగం సంపాదించాడు. ఈ సంపాదనతో లైఫ్ సెటిల్ కాదనుకుని..2015లో ఉద్యోగం మానేసి ‘టెక్నికల్ గురూజీ’ పేరిట యూట్యూబ్ చానల్ ప్రారంభించాడు. కొత్తగా మార్కెట్ లోకి వచ్చే ఫోన్లు, ల్యాప్ టాపులు, కార్ల గురించి చెప్పడం మొదలుపెట్టాడు. అర్థం కాని సాంకేతిక విషయాలను సింపుల్ హిందీలో చెప్పడంతో అతడి చానల్ కు భారీగా ఆదరణ వచ్చింది.

    ప్రస్తుతం దేశంలోనే నంబర్ వన్ టెక్ యూట్యూబర్ గా ఆయనకు పేరువచ్చింది. ఆయన ప్రస్తుతం సబ్ స్క్రైబర్లు 2.5కోట్ల మంది కావడం విశేషం. యూట్యూబ్ లో రోజూ ఏదో ఒక వీడియో అప్ లోడ్ చేస్తూనే ఉంటాడు. యూట్యూబ్ ద్వారా ఇప్పటికే రూ.400కోట్లు సంపాదించాడు. ప్రతీ నెలా కోటి రూపాయల ఆదాయం వస్తోందట. వాటితో దుబాయ్ లో ఇండ్లు, సొంతూరులో ఇండ్లు, ఖరీదైన కార్లు కొంటున్నాడు. యూట్యూబ్ తన జీవితాన్నే మార్చేసింది అని సంబరంగా చెబుతున్నాడు.

     

    Share post:

    More like this
    Related

    Guntakal Junction : రైల్వే స్టేషన్ లో తనిఖీలు.. మహిళ బ్యాగ్ లో రూ.50 లక్షలు

    Guntakal Junction : ఎన్నికల వేళ పోలీసులు తనిఖీలు ముమ్మరం చేశారు....

    Dhruv Rathee : సోషల్ మీడియా సంచలనం ధ్రువ్ రాఠీ..ఓ రేంజ్ లో ట్రెండ్ అవుతున్న ఇన్ ఫ్లూయెన్సర్

    Dhruv Rathee : ప్రస్తుతం సోషల్ మీడియా వల్ల చాలా మంది...

    Police Inspection : పోలీసుల తనిఖీ.. వాహనంలో బంగారం, వెండి నగలు

    Police Inspection : ఎన్నికల వేళ వాహనాల్లో డబ్బు, మద్యంతో పాటు...

    Chandrababu : ఇంటింటికీ ఎందుకు పింఛన్ ఇవ్వరు?: చంద్రబాబు

    Chandrababu : వైసీపీ చేస్తున్న కుట్రలు, కుతంత్రాల్లో అధికారులు కూడా భాగస్వాములు...

    POLLS

    [yop_poll id="2"]

    Latest News

    - Download the UBlood app here -

    Photos

    - Advertisement -

    Popular

    More like this
    Related

    Dhruv Rathee : సోషల్ మీడియా సంచలనం ధ్రువ్ రాఠీ..ఓ రేంజ్ లో ట్రెండ్ అవుతున్న ఇన్ ఫ్లూయెన్సర్

    Dhruv Rathee : ప్రస్తుతం సోషల్ మీడియా వల్ల చాలా మంది...

    YouTube Star Anvesh : యూ ట్యూబ్ స్టార్ అన్వేష్ కు పెరుగుతున్న క్రేజ్.. ఏకంగా 10 మూవీ ఆఫర్లు!

    YouTube Star Anvesh : యూ ట్యూబ్ స్టార్ ‘నా అన్వేషణ’...

    Triangle Case : హంతకులను పట్టించిన ఫోన్.. ట్రయాంగిల్ కేసును ఛేదించిన పోలీసులు

    Triangle case : ప్రేమ, ప్రేయసి కోసం ప్రేమికుడు మరో వ్యక్తిని...

    Harshasai : సినిమాల్లోకి హీరోగా ఎంట్రీ ఇస్తున్న హర్షసాయి.. రికార్డులు బద్దలవుతాయా..?

    Harshasai : సోషల్ మీడియా వచ్చిన తర్వాత దీని వల్ల చాలా...