39.8 C
India
Thursday, May 9, 2024
More

    Team India 2023 : టీమిండియాకు గుండెకోత.. బ్యాడ్ ఇయర్ 2023!

    Date:

    Team India 2023
    Team India 2023

    Team India 2023 : అప్పటిదాక స్వదేశంలో ఘనమైన రికార్డు.. టీమిండియాను ఎదుర్కొవాలంటే అంతా ఈజీ కాదు.. ఈ సారి కప్పు మనదే.. అనే మాటలు నిజమయ్యే దాక వచ్చాయి. వరుసగా అన్ని మ్యాచ్ ల్లో ఘన విజయం.. కానీ ఫైనల్ ఫైట్ లో ఆస్ట్రేలియా దూకుడు ముందు వెనక్కి తగ్గక తప్పలేదు. కోట్లాది ఫ్యాన్స్ గుండెలు పగిలిపోయాయి. ఆటగాళ్లకు ఎన్నటికీ మరిచిపోలేని గుండెకోత.. ఈ గాయం మానదు.. క్రికెట్ ఉన్నంత కాలం పదే పదే గుర్తుకొచ్చే గాయం..

    ఇండివిజ్యువల్ సిరీస్ ల్లో టీమిండియా దుమ్మురేపుతుంది. కానీ అసలు సిసలైన వరల్డ్ కప్ పోటీల్లో మాత్రం డీలా పడుతుందనే అపవాదును తుడిచివేయలేకపోయింది. ఇదే క్రమంలో 2023వ సంవత్సరంలో రెండు ప్రపంచ కప్ ట్రోఫీలు కోల్పోయిన ఏకైక జట్టుగా ఇండియన్ టీం చరిత్రలో నిలిచిపోయింది. డబ్ల్యూటీసీ ఫైనల్ లో ఆస్ట్రేలియాపై దారుణంగా  ఓడిపోయిన టీమిండియా వన్ డే వరల్డ్ కప్ లో కూడా అదే దేశంతో ఓడిపోవడం అభిమానులకు తీవ్ర నిరాశ కలిగించింది. తిరుగులేదనుకున్న జట్టు ఇలా చేతులెత్తేయడంతో వారి ఆవేదనకు అంతే లేదు. ఇక ఈ రెండు టోర్నీలకు కెప్టెన్ రోహిత్ శర్మనే. పాపం ఆయన మనస్సుకు ఎంత గాయం కావాలి.. ఈ రెండు ట్రోఫీలను ఆయన జీవిత కాలంలో మరిచిపోగలడా..? క్రికెట్ చరిత్ర ఉన్నంత కాలం ఆ గాయం మానుతుందా? ఒక్క అడుగు దూరంలో రెండు వరల్డ్ కప్ లను మిస్ చేసుకోవడం ఎవరికైనా బాధకలిగించేదే.

    ఈ రెండు ట్రోఫీలను  గెలిస్తే మాత్రం రోహిత్ శర్మ.. ఇండియన్ టీం కెప్టెన్లలో నంబర్ వన్ గా నిలిచేవాడు. ఆయన కీర్తి ఎవరెస్ట్ ను దాటేది.  ఇప్పటికీ ఆయన కోలుకోవడం లేదు. రోహిత్ మరో వరల్డ్ కప్ ఆడడం కష్టంగానే కనిపిస్తోంది. ఇప్పటికే అతడి వయస్సు 36.  మరో నాలుగేళ్లకు అంటే 40 నిండుతాయి.  అప్పటి వరకూ ఫిట్ నెస్ నిలబెట్టుకుంటాడా? అనేది తెలియదు.  అలాగే మరో అగ్ర ఆటగాడు విరాట్ కోహ్లీ కూడా సేమ్ టు సేమ్. ప్రస్తుతానికి ఫుల్ ఫామ్ లో ఉన్న మరో నాలుగేళ్ల వరకు ఎలా ఉంటుందో తెలియదు. అలాగే సీమర్ షమి కూడా అంతే.. వీరు మరో వరల్డ్ కప్ ఆడుతారో లేదో ఎవరూ చెప్పలేరు. మొత్తానికైతే భారత గడ్డపై కప్ గెలిచే అవకాశం ఉన్నా.. కప్ కోల్పోవడం.. ఆటు ఆటగాళ్లకు, ఇటు అభిమానులకు తీవ్ర నిరాశ కలిగించింది. ఇండియన్ క్రికెట్ కు  2023 ఒక బ్యాడ్ ఇయర్ అనే చెప్పుకోవాలి.

    Share post:

    More like this
    Related

    Shobhita Rana : ఫోటోలు: 2-పీస్ బికినీలో సూపర్ ఫోజులిచ్చిన శోభిత

    Shobhita Rana : శోభిత ధూళిపాల మూవీస్, వెబ్ సిరీస్‌లో...

    Maruti Suzuki Swift : మరింత కొత్తగా మారుతీ సుజుకీ స్విఫ్ట్‌.. ధర రూ.6.50 లక్షలు..

    Maruti Suzuki Swift : భారత్‌లో ఎక్కువ ఆదరణ పొందిన హ్యాచ్‌...

    KTR : రాష్ట్ర ప్రజలకు కేటీఆర్ సూచన.. ఇవి దగ్గరపెట్టుకోండి

    KTR : తెలంగాణ రాష్ట్ర ప్రజలకు కేటీఆర్ ట్విటర్ (ఎక్స్) ద్వారా...

    America : అమెరికాలో తెలుగు విద్యార్థి మిస్సింగ్..

    America : అమెరికాలో ఇటీవల జరుగుతున్న యాక్సిడెంట్స్, మిస్సింగ్స్, మర్డర్స్ భారతీయులను...

    POLLS

    [yop_poll id="2"]

    Latest News

    - Download the UBlood app here -

    Photos

    - Advertisement -

    Popular

    More like this
    Related

    T20 World Cup Promo : ట్రెండింగ్ లో టీ20 వరల్డ్ కప్ ప్రోమో..

    T20 World Cup Promo : ప్రస్తుతం ఐపీఎల్ క్రికెట్ మ్యాచ్...

    T20 World Cup 2024 : అమెరికా ఫ్లైట్ ఎవరెక్కబోతున్నారు

    T20 World Cup 2024 : అమెరికా వెస్టిండీస్ వేదికగా జూన్ 1...

    T20 Indian Team : త్వరలోనే టీ 20 భారత జట్టు ప్రకటన 

    T20 Indian Team : టీ 20 ప్రపంచ కప్ అమెరికా,...