Second Marriages : ఇండస్ట్రీలో రెండో పెళ్లి కామన్. ఇక్కడ చాలా మంది సీనియర్ హీరో, హీరోయిన్లు, క్యారెక్టర్ ఆర్టిస్ట్ ల వరకు రెండో పెళ్లి చేసుకున్నవారే. ఒకరికి మొదటి పెళ్లి కాగా మరొకరికి రెండో పెళ్లి ఇలా చాలా జంటలు ఉన్నాయి. రీసెంట్ గా సల్మాన్ తమ్ముడు ఆర్బాజ్ ఖాన్ మలైకా అరోరాకు డైవర్స్ ఇచ్చి సెకండ్ మ్యారేజ్ చేసుకున్నాడు. లెటేస్ట్‌గా సిద్ధార్థ్-అదితి రావు హైదరీ కూడా రెండో వివాహానికి రెడీ అయ్యారు. ఈ నేపథ్యంలో ఇండస్ట్రీలో రెండో పెళ్లి విషయం హాట్ టాపికైంది. ఇలా 2 లేదంటే ఎక్కువ పెళ్లిళ్లు చేసుకున్న సెలబ్రిటీలు ఎవరో చూద్దాం..
సల్మాన్ ఖాన్ సోదరుడు బాలీవుడ్ నటుడు, మలైకా అరోరా ఎక్స్ హస్బెండ్ అర్బాజ్ ఖాన్ 56 ఏళ్ల వయసులో షౌరాను వివాహం చేసుకున్నాడు. శౌరా నటి కాదు మేకప్ ఆర్టిస్ట్. ఇప్పుడు ఆమె శ్రీమతి అర్బాజ్ ఖాన్ అయ్యింది. అయితే, చాలా రోజులుగా వీరు సైలెంట్ ప్రేమాయణం కొనసాగిస్తున్నారు.
అమలా పాల్ రీసెంట్ గా మరో వివాహం చేసుకుంది. దానికి సంబంధించిన ఫొటోలు కూడా వైరల్ అయ్యాయి. ఆమెను గతంలో గాఢంగా ప్రేమించిన నటుడు జగత్ దేశాయ్‌నే వివాహమాడింది. ప్రస్తుతం అమలా గర్భంతో ఉంది.
మంచు మనోజ్ ప్రణతి రెడ్డిని వివాహం చేసుకొని కేవలం నాలుగు సంవత్సరాలు మాత్రమే కలిసి ఉన్నాడు. ఆ తర్వాత ఆమెకు విడాకులు ఇచ్చి తన స్నేహితురాలు భూమా అలేఖ్య రెడ్డిని సెకండ్ మ్యారేజ్ చేసుకున్నాడు. అయితే అలేఖ్య రెడ్డికి కూడా ఇది రెండో వివాహమే.
మనోజ్ మాత్రమే కాదు.. ఆయన తండ్రి నటప్రపూర్ణ మోహన్ బాబు కూడా తన ఫస్ట్ వైఫ్ విద్యా దేవి చనిపోయిన తర్వాత ఆమె చెల్లెలు నిర్మలా దేవిని రెండో వివాహం చేసుకున్నారు. వీళ్లకి పుట్టిన కొడుకే మనోజ్. లక్ష్మి, విష్ణు మొదటి భార్య విద్యాదేవి సంతానం.
కొన్ని రోజులుగా టాలీవుడ్ ఇండస్ట్రీని తెగ ఇబ్బంది పెట్టిన జంట సీనియర్ నరేశ్-పవిత్ర లోకేశ్. కొన్నేళ్లుగా వీళ్లు సీక్రెట్ గా డేటింగ్ లో ఉన్నారు. ఈ విషయం నరేశ్ మూడో భార్య రమ్య రఘుపతి కనిపెట్టి బెంగళూర్ లో ఒక హోటల్ లో రెడ్ హ్యాండెడ్ గా పట్టుకుంది. దీంతో అసలు విషయం బయటపడింది.
ఆ తర్వాత తాము పెళ్లి చేసుకుంటామని ఈ జంట బాహాటంగానే ప్రకటించింది. తన భార్యకు మరొకరితో వివాహేతర సంబంధం ఉందని నరేశ్ ఆరోపణలు కూడా చేశాడు. ఈ నేపథ్యంలో తామిద్దరం పెళ్లి చేసుకోబోతున్నామని నరేష్ అఫీషియల్‌గా ప్రకటించారు.
ఇక, పవిత్ర లోకేష్ గురించి తెలుసుకుంటే.. 16 సంవత్సరాలకే నటిగా తెరంగేట్రం చేసిన పవిత్ర లోకేశ్ హీరోయిన్‌గా చేసి, ఆ తర్వాత క్యారెక్టర్స్ ఆర్టిస్ట్ గా సెటిలైంది. ఈమె మొదటి భర్త సాఫ్ట్ వేర్ ఇంజినీర్. అతనికి విడాకులు ఇచ్చి మరో వ్యక్తితో సహజీవనం చేసింది. ఆ తర్వాత నరేశ్ కు దగ్గరైంది.
విష్ణు విశాల్ – గుత్తా జ్వాలా: తమిళ్ హీరో విష్ణు విశాల్ తన ప్రేయసి గుత్తా జ్వాలాను వివాహం చేసుకున్నాడు. ఇద్దరికీ ఇది రెండో పెళ్లి. కరోనా నిబంధనలు పాటిస్తూ ఈ ఇద్దరూ ఒకింటి వారయ్యారు.
దియా మీర్జా: బాలీవుడ్ నటి దియా మీర్జా రెండో వివాహం చేసుకుంది. బిజినెస్ మ్యాన్ వైభవ్ రేఖిని వివాహమాడింది.
సింగర్ సునీతా: సింగర్, డబ్బింగ్ ఆర్టిస్ట్ సునీత 2021, జనవరి 9న. మీడియా పర్సన్ రామ్ వీరపనేనిని వివాహం చేసుకుంది. వీరి పెళ్లి టాక్ ఆఫ్ ది ఇండస్ట్రీగా నిలిచిపోయింది. 19 ఏళ్లకే పెళ్లి చేసుకొని ఇద్దరు పిల్లలకు తల్లి అయిన తర్వాత సునీత విడాకులు ఇచ్చి ఒంటరిగానే ఉంది. ఆ తర్వాత చాలా యేళ్లకు రామ్ వీరపనేనిని వివాహం చేసుకుంది.
వనిత విజయ్ కుమార్: దేవి, రుక్మిణి సినిమాలతో తెలుగులో గుర్తింపు సంపాదించుకున్న నటి వనిత విజయ్ కుమార్. ఈమె పీటర్ పాల్ అనే తమిళ్ డైరెక్టర్ ను వివాహం చేసుకుంది. ఆయనను వివాహం చేసుకునే ముందే ఈమెకు రెండుసార్లు వివాహం జరిగింది. ఇద్దరికి విడాకులు ఇచ్చి మూడో పెళ్లి చేసుకుంది.
దిల్ రాజు: స్టార్ ప్రొడ్యూసర్, డిస్ట్రిబ్యూటర్ దిల్ రాజు మొదటి భార్య చనిపోయింది. దీంతో ఆయన తేజస్విని అనే యువతిని రెండో వివాహం చేసుకున్నాడు. వీరి వివాహాన్ని దిల్ రాజు కూతురే దగ్గరుండి జరిపించింది. ఈ జంటకు ఇటీవల వారసుడు కూడా వచ్చాడు.
పవన్ కళ్యాణ్: మెగా కుటుంబం నుంచి వచ్చిన పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ తన తోటి నటి రేణు దేశాయ్‌ను 2008లో సెకండ్ మ్యారేజ్ చేసుకున్నాడు. అప్పటికే పవన్ కళ్యాణ్ 1997లో నందిని అనే అమ్మాయిని వివాహం చేసుకున్నాడు. ఆమెకు విడాకులు కూడా ఇచ్చాడు. బద్రిలో కిలిసి నటించని రేణు దేశాయ్ ని రెండో వివాహం చేసుకున్నాడు. అయితే పవన్ కళ్యాణ్ రేణుకు కూడా విడాకులు ఇచ్చి రష్యా యువతి అన్నా లెజినోవాను మూడో పెళ్లి చేసుకున్నాడు.
నాగార్జున: కింగ్ నాగార్జున రామానాయుడి కూతురు, వెంకటేష్ చెల్లెలు లక్ష్మిని వివాహం చేసుకున్నాడు. అనివార్చ కారణాల వల్ల ఆమె విడిపోవయాడు. ఈమె హీరో నాగ చైతన్య తల్లి. లక్ష్మికి విడాకులు ఇచ్చిన తర్వాత అమలను పెళ్లి చేసుకున్నాడు.
విజయ దుర్గ: చిరంజీవి చిన్న చెల్లి, సాయి ధరమ్ తేజ్ తల్లి విజయ దుర్గా కూడా రెండో వివాహం చేసుకుంది. చిన్నతనంలోనే వివాహం చేసుకొని విడాకులు తీసుకున్న అమ్మకు ఇప్పుడు రెండో పెళ్లి చేస్తే తప్పేముంది అని అనుకుంటున్నాడు సాయి ధరమ్ తేజ్. కానీ ఇప్పటికీ వివాహం చేయలేదనే తెలుస్తోంది.
శ్రీజ: మెగాస్టార్ చిన్న కూతురు శ్రీజ. శిరీష్ భరద్వాజ్‌ను పెళ్లి చేసుకుంది. కొంత కాలానికి విడిపోయింది. ఆ తర్వాత కళ్యాణ్ దేవ్‌ను సెకండ్ మ్యారేజ్ చేసుకొని ఇప్పుడు ఆయనతో దూరంగా ఉంటున్నట్లు తెలుస్తోంది.
కృష్ణ – విజయ నిర్మల: సూపర్ స్టార్ కృష్ణ మొదటి భార్య ఇందిర అనుమతితో విజయ నిర్మలను రెండో వివాహం చేసుకున్నారు. అయితే, విజయ నిర్మలకు కూడా కృష్ణ రెండో భర్తనే.
కృష్ణంరాజు: రెబల్ స్టార్ కృష్ణంరాజు మొదటి భార్య సీతాదేవి మరణం తర్వాత శ్యామలా దేవిని సెకండ్ మ్యారేజ్ చేసుకున్నాడు. వీరికి ముగ్గురు సంతానం.
హరికృష్ణ: నటుడు, నిర్మాత హరికృష్ణకు వివాహం జరిగిన తర్వాత కూడా జూనియర్ ఎన్టీఆర్ తల్లి షాలినిని సెకండ్ మ్యారేజ్ చేసుకున్నాడు. ఆయనకు పుట్టిన వాడే యంగ్ టైగర్ ఎన్టీఆర్.
నందమూరి తారక రామారావు: ఎన్టీఆర్ సీనియర్ మొదటి భార్య బసవతారకం చనిపోయిన తర్వాత లక్ష్మీ పార్వతిని వివాహం చేసుకున్నాడు. అయితే ఆమెకు కూడా ఎన్టీఆర్ రెండో భర్తనే.
ప్రభుదేవా: 20 ఏళ్లకు ముందే రమాలత్‌తో ప్రభుదేవాకు వివాహమైంది. కొన్ని కారణాలతో ఈ జంట విడి విడిగా ఉంటుంది. ఆ తర్వాత నయనతారతో ప్రేమాయణం కొనసాగించిన కొరియోగ్రాఫర్ పెళ్లి వరకు తీసుకెళ్లలేకపోయాడు. తనకు ఫిజియోతెరపీ చేసిన డాక్టర్‌నే లవ్ మ్యారేజ్ చేసుకున్నాడు.
ప్రకాశ్ రాజ్: డిస్కో శాంతి చెల్లి లలిత కుమారిని 1994లో ప్రకాశ్ రాజ్ వివాహం చేసుకున్నాడు ఈ జంట 2009లో విడిపోయింది. ఆ తర్వాత 2010లో కొరియోగ్రఫర్ పోనీ వర్మను వివాహం చేసుకున్నాడు ప్రకాశ్ రాజ్.
కమల్ హాసన్: విలక్షణ నటుడు, విశ్వ నటుడిగా గుర్తింపు సంపాదంచుకున్న కమల్ హాసన్ తన 24వ ఏట (1978లో) వాణి గణపతి అనే యువతిని పెళ్లి చేసుకున్నాడు. పదేళ్లు కాపురం చేసిన తర్వాత విడాకులు ఇచ్చాడు. 1984 నుంచే సారికతో డేటింగ్ లో ఉన్న ఈ జంటకు శృతి పుట్టిన తర్వాత, 1986లో పెళ్లి చేసుకున్నాడు. ఆ తర్వాత ఆమెతో కూడా విడిపోయి గౌతమి, సిమ్రాన్ బగ్గాతో సహజీవనం చేశాడు. ప్రముఖ నటి సారికను కమల్ రెండో వివాహం చేసుకున్నారు.
జెమినీ గణేషన్: సావిత్రి, జెమినీ గణేషన్ ను రెండో వివాహం చేసుకున్నాడు. ఆ తర్వాత మరో 2 పెళ్లిళ్లు అయ్యాయి. మొత్తంగా నాలుగు పెళ్లిళ్లలతో రికార్డు క్రియేట్ చేశారు జెమిని గణేషన్
ఆది నారాయణ రావు: నిర్మాత, సంగీత దర్శకుడు నారాయణ రావు.. ప్రముఖ నటి అంజలిని రెండో వివాహం చేసుకున్నాడు.
రాధిక-శరత్ కుమార్: దర్శకుడు ప్రతాప్ పోతన్‌ను రాధిక 1985లో వివాహం చేసుకుంది. ఆయనకు విడాకులు ఇచ్చిన రాధిక రిచర్డ్ హార్డీని పెళ్లి చేసుకుంది. రిచర్డ్ కు కూడా విడాకులు ఇచ్చి కొన్నేళ్ల క్రితం శరత్ కుమార్‌ను మూడో పెళ్లి చేసుకుంది.
శరత్ కుమార్: 1984లో ఛాయ అనే యువతిని పెళ్లి చేసుకున్న శరత్ కుమార్ 2000లో విడిపోయాడు. ఆ తర్వాతి సంవత్సరమే రాధికను సెకండ్ మ్యారేజ్ చేసుకున్నాడు. శరత్ కుమార్ కు మూడో వివాహం కాగా.. రాధికకకు కూడా మూడోదే.
శరత్ బాబు: తనకంటే వయసులో పెద్ద దైన రమాప్రభను వివాహం చేసుకున్నాడు శరత్ బాబు. కానీ, ఎక్కువ కాలం కలిసి ఉండలేకపోయారు. విడిపోయిన తర్వాత శరత్ కుమార్ స్నేహలతా దీక్షిత్‌ను వివాహం చేసుకున్నాడు. వాళ్లు కూడా ఎక్కువ రోజులు కలిసి ఉండలేదు.
సైఫ్ అలీ ఖాన్: తన మొదటి భార్య అమృత్ సింగ్‌కు డైవర్స్ ఇచ్చిన చాలా సంవత్సరాల తర్వాత కరీనా కపూర్‌ను రెండో భార్యగా చేసుకున్నాడు.
కిషోర్ కుమార్: కిషోర్ కుమార్-మధుబాలను రెండో వివాహం చేసుకున్నాడు. ఈయన కూడా నాలుగు పెళ్లిళ్లు చేసుకొని రికార్డు నెలకొల్పలాడు.
ధర్మేంద్ర: హేమా మాలిని-ధర్మేంద్రది రెండో వివాహం. హేమా మాలినిని వివాహం చేసుకునేందుకు మతం మార్చుకున్నాడు. హిందూ మతంలోకి వచ్చి పెళ్లాడాడు.
ఇలా చాలా మంది ఇండస్ట్రీకి చెందిన వారు రెండో వివాహం, లేదంటే మూడోది, నాలుగో వివాహాలు చేసుకున్నారు.