Ileana’s Shocking Comments :
కాస్టింగ్ కౌచ్ మీద ఎవరి అభిప్రాయం వారు చెబుతున్నారు. ఏది ఏమైనా ఈ పేరును మాత్రం నిత్యం సోషల్ మీడియాలో వినిపించేలా చేస్తున్నారు. ఎవరో ఒకరు కాస్టింగ్ కౌచ్ మీద మాట్లాడుతూనే ఉన్నారు.. మరి తాజాగా మరో బ్యూటీ ఈ కాస్టింగ్ కౌచ్ మీద సంచలన వ్యాఖ్యలు చేసింది.. ఆ కామెంట్స్ ఇప్పుడు సంచలనం రేపుతున్నాయి..
గోవా బ్యూటీ ఇలియానా అంటే ఎంత క్రేజ్ ఉందో ఎంతటి ఫాలోయింగ్ ఉందో ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు. అయితే ఈమె చేసిన వ్యాఖ్యలు నెట్టింట ఇప్పుడు వైరల్ అవుతున్నాయి.. సౌత్ ఇండస్ట్రీలో 10 ఏళ్ల పాటు స్టార్ హీరోయిన్ గా రాణించింది. ఈ డస్కీ బ్యూటీ అగ్ర హీరోయిన్ గా మారి స్టార్ హీరోలందరితో ఆడిపాడింది..
ఇక ఈమె హీరోయిన్ గా సినిమాలు చేయకపోయిన ఈమె వ్యక్తిగతంగా మాత్రం నిత్యం వార్తల్లో నిలుస్తూనే ఉంది. ఈ హాట్ బ్యూటీ ప్రెగ్నెన్సీ అని ప్రకటించి షాక్ ఇచ్చింది.. ఇదిలా ఉండగా ఈ భామ తాజాగా కాస్టింగ్ కౌచ్ మీద చేసిన కామెంట్స్ నెట్టింట వైరల్ అవుతున్నాయి. ఈమె నిండు గర్భిణిగా ఉన్నప్పటికీ తాజాగా ఒక ఇంటర్వ్యూ ఇచ్చింది. అందులో మాట్లాడుతూ..
నాకు ఇప్పటి వరకు కాస్టింగ్ కౌచ్ ఫేస్ చేయలేదని.. నా టాలెంట్ తోనే నేను ఇక్కడి వరకు రాణించాను అని తెలిపింది.. ఇక అన్ని ఇండస్ట్రీలలో కాస్టింగ్ కౌచ్ ఉంది.. దానిని నేను కాదు అని చెప్పను.. ఏ నిర్ణయం అయిన సరే మనం తీసుకోవాల్సిందే.. కొందరు ఛాన్సుల కోసం కమిట్మెంట్స్ ఇస్తారు.. కొంత మంది టాలెంట్ ను నమ్ముకుంటారు అంటూ ఈ భామ చెప్పుకొచ్చింది.