Tollywood : టాలీవుడ్ లో ఒక్క హిట్ పడగానే హీరోలు తమ రెమ్యూనరేషన్ అమాంతం పెంచేస్తుంటారు. ఆ తర్వాత ఆ హీరోల సినిమాల ఆడతాయోలేదో తెలీదు. అలా ఒక్క హిట్టుతో నే రెమ్యూనరేషన్ పెంచిన హీరోలు ఆ తర్వాత ప్లాఫులు మూటగట్టుకొని కొందరుతెరమరుగుకాగా, మరికొందరు క్యారెక్టర్ ఆర్టిస్టులుగా, మరి కొందరు విలన్లుగా కొనసాగుతున్నారు. ప్రస్తుతం టాలీవుడ్లో మెగాస్టార్ చిరంజీవి, పవర్ స్టార్ పవర్ స్టార్ పవన్ కల్యాన్,, మాస్ మహారాజా రవితేజ, నందమూరి నటసింహం బాలకృష్ణ, కింగ్ నాగార్జున ఒక తరం హీరోలు. ఈ జనరేషన్ హీరోలతో పోలిస్తే బ్యాక్ టు బ్యాక్ సినిమాలతో బిజీగా ఉన్నారు. పవన్ మాత్రం రాజకీయాల్లోనూ కొనసాగుతుండడంతో తక్కువ సినిమాలు చేస్తున్నాడు. మిగిలిన వారంతా ఒక సినిమా సెట్ మీద ఉండగానే మరో సినిమానులైన్ లో పెడుతున్నారు.
వందకోట్ల హీరోలు
టాప్ హీరోల్లో ఒకరిద్దరు మినహా అందరూ రూ. 100 కోట్ల క్లబ్ లో చేరారు.
మెగాస్టార్, పవర్ స్టార్, బాలయ్య సినిమాలు 100 కోట్లు వసూలు చేస్తున్నాయి.. ఆంధ్ర, సీడెడ్, నైజాం, ఓవర్ సీస్ అన్నీ కలిపి రూ.100 కోట్లకు పైగా వసూలు అవుతున్నాయి. రవితేజ మార్కెట్ 60 కోట్లు దాటింది.. నాగార్జున మార్కెట్ దాదాపు డౌన్ ఫాల్ అయ్యింది. ఇక ఆయా హీరోల రెమ్యూనిరేషన్లు మాత్రం నిర్మాతలకు చుక్కలు చూపుతున్నాయి. నిర్మాత కు లాభం వచ్చేది ఎంతో గానీ, వీళ్ల రెమ్యూనరేషన్ మాత్రం భారంగా మారుతున్నది. నాగార్జున ఒక సినిమాకు పది కోట్లకు పైగానే ఉంది. ఇక రవితేజ రెమ్యూనిరేషన్ దాదాపు 20 కోట్ల నుంచి 22 కోట్ల మధ్యలోఉంది. పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ తన గత సినిమాల వసూళ్లకు సంబంధం లేకుండా సినిమా సినిమాకు రెమ్యూనరేషన్ పెంచుతూ పోతున్నాడు. తన లేటెస్ట్ బ్రో సినిమాకు 60-65 కోట్ల మధ్యలో తీసుకుని, పాతిక శాతం లాభాల్లో వాటా పెట్టుకున్నారని గుసగుసలు వినిస్తున్నాయి. సినిమా ఫలితం ఎలా ఉన్నా రూ. 65 కోట్లు రెమ్యూనిరేషన్ మాత్రం పక్కా.
మెగాస్టార్ తన వాల్తేరు వీరయ్య సినిమాకు రూ. 55 కోట్లు తీసుకున్నారని తెలిసింది.. భోళాశంకర్ సినిమాకు రూ. 65 కోట్లకు పెంచేశారని టాలీవుడ్ టాక్. రెమ్యూనరేషన్ పోనూ చిన్న చిన్న ఖర్చులు అదనంగా వుంటాయి. అటుఇటుగా రూ. 70 కోట్లు వసూలు చేస్తున్నట్లే లెక్క. ఆయా హీరోల రెమ్యూనరేషన్, మార్కెట్ ను బేరీజు వేసుకుంటే నందమూరి నటసింహం బాలయ్య తో సినిమా తీస్తే నిర్మాత సేఫ్ జోన్ లో ఉంటున్నాడు. ఫలితం తేడా కొట్టిన పెట్టిన పెట్టుబడి కి కాస్త ఎక్కువే గిట్టుబాటు అవుతుంది. బాలయ్య తన రెమ్యూనరేషన్ చాలా తక్కువగా తీసుకుంటున్నాడు. ఇప్పటి వరకు తీసుకున్న హయ్యస్ట్ రెమ్యూనరేషన్ కేవలం రూ. 18 కోట్లు మాత్రమే. ఇకపై చేసే సినిమాలకు ఒక వేళ పెంచినా రూ. 20 నుంచి 22 కోట్లు దాటక పోవచ్చు. కానీ థియేటర్ వసూళ్లు మాత్రం మెగా బ్రదర్స్ సినిమాలకు ఏ మాత్రం తక్కువ లేదు. దీతో సినిమా ప్లాఫ్ అయినా బాలయ్య నిర్మాతలు హ్యాపీగా ఉంటున్నారు.
ReplyForward
|