41.2 C
India
Sunday, May 5, 2024
More

    SPY Movie : ‘స్పై’ రాబట్టింది ఇంతేనా.. బ్రేక్ ఈవెన్ కష్టమే.. నిఖిల్ వల్ల అన్ని కోట్ల నష్టాలు..!

    Date:

    SPY Movie : యంగ్ అండ్ టాలెంటెడ్ డైరెక్టర్ నిఖిల్ సిద్ధార్థ్ తాజాగా నటించిన పాన్ ఇండియన్ మూవీ ‘స్పై’.. యాక్షన్ అండ్ థ్రిల్లర్ కాన్సెప్ట్ తో తెరకెక్కిన ఈ సినిమా జూన్ 29న గ్రాండ్ గా ప్రపంచ వ్యాప్తంగా రిలీజ్ అయ్యింది. చాలా కాలంగా వరుస హిట్స్ తో దూసుకు పోతున్న నిఖిల్ మంచి ఫామ్ లో ఉన్నాడు. అందుకే వరుస సినిమాలను ప్రకటిస్తున్నాడు.

    నిఖిల్ పాన్ ఇండియా రేంజ్ లో కార్తికేయ 2 తో హిట్ అందుకున్నాడు.. ఈ సినిమా విజయం తర్వాత వెంటనే 18 పేజెస్ తో మరో హిట్ ఖాతాలో వేసుకున్నాడు. ఇలా వరుసగా రెండు హిట్స్ అందుకుంటూ ఉత్సాహంగా ఉన్న నిఖిల్ స్పై సినిమాతో హ్యాట్రిక్ విజయం అందుకోవాలని అనుకున్నాడు. ఇక స్పై సినిమా థియేటర్స్ లో రిలీజ్ అయ్యాక మిక్స్డ్ టాక్ వచ్చింది.

    దీంతో ఈ టాక్ కలెక్షన్స్ మీద ప్రభావం చూపుతుంది. ఈ సినిమాను బిహెచ్ గ్యారీ డైరెక్ట్ చేయగా అనుకున్న స్థాయిలో హైప్ చూపించలేక పోయాడు. ఐశ్వర్య మీనన్, సనయా ఠాకూర్ హీరోయిన్లుగా నటించిన ఈ మూవీను రాజశేఖర్ రెడ్డి ఈడీ ఎంటెర్టైనమెంట్స్ బ్యానర్ పై నిర్మించారు. అయితే ఈ సినిమా రిలీజ్ అయ్యి వారం గడుస్తుంది.

    మరి నిఖిల్ స్పై 7 రోజుల్లో ఎన్ని కలెక్షన్స్ రాబట్టింది అంటే.. ఈ సినిమా మొత్తం 15.50 కోట్ల బిజినెస్ చేసుకోగా మొదటి రోజు భారీ ఓపెనింగ్స్ తెచ్చుకున్నాయి.. అయితే ఆ తర్వాత రోజు టాక్ కారణంగా కలెక్షన్స్ ఆశించినంత రాలేదు. 7వ రోజు కేవలం 8 లక్షలు మాత్రమే వచ్చాయని తెలుస్తుంది. ఈ 7 రోజుల్లో మొత్తం ఈ సినిమా ఇండియాలో 7.51 కోట్ల షేర్ 12.40 కోట్ల గ్రాస్ వసూళ్లు చేసాయి.

    ఇక వరల్డ్ వైడ్ గా 10.54 కోట్ల షేర్, 17.35 కోట్ల గ్రాస్ వసూళ్లు రాబట్టాయి. బ్రేక్ ఈవెన్ టార్గెట్ 16.50 కాగా ఇప్పటి వరకు 10 54 కోట్లు మాత్రమే వచ్చాయి.. ఇంకా 5.96 కోట్లు రాబట్టాల్సి ఉంది.. ఇప్పటికే థియేటర్ రన్ ముగింపుకు చేరుకోగా ఇంకా 6 కోట్లు అంటే మాములు విషయం కాదు.. ఏది ఏమైనా ఈసారి స్పై కారణంగా 5 కోట్లకు పైగానే నష్టాలు వచ్చే అవకాశం కనిపిస్తుంది.

    Share post:

    More like this
    Related

    US Student Visas : మే రెండో వారంలో.. యూఎస్ స్టూడెంట్ వీసాలు

    US Student Visas : ఉన్నత విద్యాభ్యాసం కోసం అమెరికా వెళ్లాలని...

    AP Elections 2024 : ‘వామ్మో వీడు మళ్లీ రాకూడదు’ ఏపీ అంతా ఇదే అంటుందా?

    AP Elections 2024 : ఆంధ్రప్రదేశ్ లో పోలింగ్ కు దాదాపు...

    Nagabhushanam : విలన్ కు గుర్తింపు తెచ్చిందే నాగభూషణం

    Nagabhushanam : తెలుగు సినిమా ఇండస్ట్రీలో విలన్ పాత్రలో ఒదిగిపోయిన నటుడు...

    POLLS

    [yop_poll id="2"]

    Latest News

    - Download the UBlood app here -

    Photos

    - Advertisement -

    Popular

    More like this
    Related

    Dunki Review : ‘డంకీ’ మూవీ రివ్యూ: సినిమా హిట్టా ఫట్టా?

    Dunki Review : షారుఖ్ ఖాన్, తాప్సీ, విక్కీ కౌశల్, బొమన్...

    Miss Shetty Mr. Polishetty Review : మిస్ శెట్టి మిస్టర్ పోలిశెట్టి మూవీ రివ్యూ అండ్ రేటింగ్..!

    Miss Shetty Mr. Polishetty Review : నవీన్ పోలిశెట్టి అంటేనే కామెడీ...

    SPY Movie : ‘స్పై’ పాజిటివ్ స్పందన.. ఓటీటీలోకి ఎప్పుడంటే?

    SPY Movie : ‘  తక్కువ సినిమాలతోనే ఎక్కువ గ్రాఫ్ సంపాదించుకున్నాడు...