C Ramachandraiah : కడప జిల్లా.. జగన్ ఇంటికి వెళ్ళడానికి సిద్ధంగా ఉన్నారనీ ఎమ్మెల్సి,మాజీ మంత్రి సి.రామచం ద్రయ్య అన్నారు.అందుకే రాష్ట్ర వ్యాప్తంగా సిద్ధం బ్యానర్లు కడుతున్నారని ఆయన విమర్శించారు. జగన్ సామాన్యుల జీవితాలను దుర్బరం చేసారనీ వైఫల్యాల ముఖ్యమంత్రి జగన్ అని ఆయన విమర్శించారు.జగన్ కు ఎందుకు ఓట్లయాలనీ జగన్ బ్రాండ్ మద్యం వల్ల ప్రజలు పిచ్చి వాళ్ళు అయిపోతున్నారనీ ఆయన మండిపడ్డారు.
మద్యం మాఫీయా రాష్ట్రంలో పెరిగిపోయిందనీ ప్రభుత్వ ఆదాయం అంతా ప్రయివేట్ సంస్థలకు జగన్ దోచిపెడుతున్నారని ఆయన తెలిపారు. సిపిఎస్ రద్దు చేస్తామన్న జగన్ మాటలు ఏమ య్యాయనీ ప్రశ్నించారు.ఇసుక ఉచితం అని జగన్ వందల కోట్లకు అమ్ముకుంటున్నారన్నారు.
పేదల ఇంటి స్థలాల పంపిణి లో భారీ మోసం చేశారన్నారు. ప్రజలను సిద్ధం సభలకు బలవంతంగా వేల బస్సులలో తరలిస్తున్నారన్నారు.బస్సులు లేక ప్రజలు ఇబ్బందులు పడుతు న్నారన్నారు. 22 మంది ఎంపిలను ఇస్తే జగన్ రాష్ట్రానికి చేసిందేమి లేదన్నారు. సింహం సింగల్గా వస్తుంది అని వైసిపీ నిస్సహా య మాటలు విడ్డురం అన్నారు. జంతువులు అడవుల్లో ఉండాలి..ప్రజల మధ్యలో కాదనీ విమర్శిo చారు.జగన్ భజన బ్యాచ్ ను పక్కన పెట్టుకున్నారన్నారు.