Mudragada : కాపు ఉద్యమ నేత ముద్రగడ పద్మనాభం వైసిపిలో చేరిక ఖాయమైంది. ఈనెల 14న ఆయన వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ తీర్థం పుచ్చుకోనున్నారు. ఇలాంటి పదవులు ఆశించకుండా తాను, తన కుమారుడు గిరి వైసిపిలో చేరుకున్నట్లు ముద్రగడ పద్మనాభం వెల్లడించారు.
ఇటీవల ఉమ్మడి గోదావరి జిల్లా ల కోఆర్డినేటర్ ముద్రగడతో చర్చలు జరిపి పార్టీలోకి ఆహ్వానిం చారు. సానుకూలంగా స్పందించిన ముద్రగడ పద్మనాభ ఈనెల 14వ తేదీన వైఎస్ఆర్సిపిలో చేరేందుకు సిద్ధమయ్యారు.
గత కొద్ది రోజుల నుంచి కాపు ఉద్యమ నేత ముద్ర గడ పద్మనాభం చుట్టూ రాజకీయం తిరుగుతుంది. తమ పార్టీలోకి రావాలని జనసేన ,టిడిపి నేతలు ఆహ్వానించారు.
అప్పట్లో ఆయన జనసేనలోకి వెళ్తున్నట్టు కూడా ప్రకటించారు. అయితే చివరి నిమిషంలో తాను జనసేనలోకి వెళ్లడం లేదని వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీలో చేరుతున్నట్లు ప్రకటించారు.