36 C
India
Monday, April 29, 2024
More

    Lokesh CID Inquiry : లోకేష్‌ సీఐడీ విచారణ ఈ నెల 10కి వాయిదా

    Date:

    Lokesh CID inquiry
    Lokesh CID inquiry

    Lokesh CID Inquiry : టీడీపీ జాతీయ ప్రధాన కార్యదర్శి నారా లోకేష్ కు ఇన్నర్ రింగ్ రోడ్డు కేసులో విచారణ ఈనెల 10కి వాయిదా పడింది. ఢిల్లీ వెళ్లి నోటీసులు ఇచ్చిన సీఐడీ పోలీసులు విచారణను వాయిదా వేసుకోవాల్సి వచ్చింది. లోకేష్ కేసులో విచారణను 10వ తేదీకి వాయిదా వేస్తూ హైకోర్టు ఆదేశాలు జారీ చేసింది. సీఐడీ ఇచ్చిన 41ఏ నిబంధనలను లోకేష్ హైకోర్టులో సవాలు చేస్తూ లంచ్ మోషన్ పిటిషన్ దాఖలు చేశారు.

    తీర్మానాలు, బ్యాంక్ ఖాతా పుస్తకాలు ఇవ్వాలంటే కంపెనీ ప్రొసీజర్ ఉంటుందని లోకేష్ ను అడగడం సమంజసం కాదని ఆయన తరఫు న్యాయవది పోసాని వెంకటేశ్వర్లు కోర్టుకు విన్నవించారు. డాక్యుమెంట్లపై ఒత్తిడి చేయబోమని బుధవారం విచారణకు హాజరైన సీఐడీ తరఫు న్యాయవాదులు పేర్కొన్నారు. ఇరు వర్గాల వాదనలు విన్న అనంతరం కేసును ఈ నెల 10కి వాయిదా వేస్తున్నట్లు ఆదేశించింది.

    అమరావతిలో ఇన్నర్ రింగ్ రోడ్డు డిజైన్ ను చంద్రబాబు మార్చారని వైసీపీ నేతలు ఆరోపిస్తున్నారు. వైసీపీ ఎమ్మెల్యే ఆళ్ల రామక్రిష్టారెడ్డి ఫిర్యాదు మేరకు గత ఏడాది ఐపీసీ, అవినీతి నిరోధక శాఖ చట్టంలోని పలు సెక్షన్ల కింద సీఐడీ అధికారులు కేసు నమోదు చేశారు. మాజీ మంత్రి నారాయణ, లింగమనేని రమేష్, లింగమనేని వెంకట సూర్య, రాజశేఖర్, ఆర్కే హౌసింగ్ లిమిటెడ్ కు చెందిన అంజనీ కుమార్, హెరిటెజ్ ఫుడ్స్, రామక్రిష్ణ మౌసింగ్ ప్రైవేట్ లిమిటెడ్ తో పాటు పలువురిని చేర్చింది.

    సీఐడీ దాఖలు చేసిన మెమోలో నిందితుడిగా లోకేష్ పేరు చేర్చింది. ఏ14గా నారా లోకేష్ ను చేర్చి నోటీసులు జారీ చేసింది. దీంతో లోకేష్ ను కూడా అరెస్టు చేస్తారనే వదంతులు కొద్ది రోజులుగా ప్రచారంలో ఉన్నాయి. దీనిపై లోకేష్ కూడా న్యాయపోరాటానికి దిగారు. ముందస్తు బెయిల్ పిటిషన్లు దాఖలు చేస్తున్నారు. ఆధారాలు లేకపోయినా తప్పుడు కేసులతో టీడీపీ నేతలను ఇరికిస్తున్నారనే వాదనలు కూడా వస్తున్నాయి.

    Share post:

    More like this
    Related

    AB Venkateswara Rao : కేంద్ర పరిపాలనా ట్రిబ్యునల్‌లో ఏబీ వెంకటేశ్వరరావు కేసు విచారణ – తీర్పును వాయిదా వేసిన ట్రిబ్యునల్

    AB Venkateswara Rao : కేంద్ర పరిపాలనా ట్రిబ్యునల్‌లో ఏబీ వెంకటేశ్వరరావు...

    Dubai : దుబాయ్ లో మరో అద్భుతం..ప్రపంచంలోనే అతి పెద్ద ఎయిర్ పోర్ట్ నిర్మాణం..

    Dubai : దుబాయ్ ఇదొక భూతల స్వర్గం. ప్రపంచంలో సంపన్నదేశంగా కొలువబడుతున్న...

    CM Jagan : షర్మిల, రేవంత్ రెడ్డిపై ఏపీ సీఎం సంచలన వ్యాఖ్యలు

    CM Jagan : ఎన్నికల వేళ రెండు తెలుగు రాష్ట్రాల్లో ఉన్న...

    TDP : వైసీపీని వీడి టీడీపీలో చేరిన 5 కుటుంబాలు

    TDP : ఈరోజు అచ్చంపేట మండలం కోనూరు గ్రామానికి చెందిన...

    POLLS

    [yop_poll id="2"]

    Latest News

    - Download the UBlood app here -

    Photos

    - Advertisement -

    Popular

    More like this
    Related

    Andhra Pradesh : ఆంధ్ర ప్రదేశ్ లో  పసుపు వనం

    Andhra Pradesh : ఆంధ్ర ప్రదేశ్ రాష్ట్రంలో గద్దె దించడానికి జనసేన,తెలుగుదేశం,బీజేపీ...

    Nara Lokesh : ట్రిలియన్ డాలర్ల ఎకానమీ సృష్టించడమే లక్ష్యం : నారా లోకేశ్

    Nara Lokesh : ఏపీలో ట్రిలియన్ డాలర్ల ఎకానమీ సృష్టించడమే తన...

    AP CID : స్కిల్ డెవలప్ మెంట్  కేసులో చార్జి సీటు దాఖలు చేసిన ఏపీ సీఐడీ

    AP CID : టిడిపి అధినేత చంద్రబాబు తీవ్ర ఆరోపణలు ఎదుర్కొంటున్న...

    Nara Lokesh : టీడీపీ అధికాంలోకి రాగానే RMP లకు న్యాయం చేస్తాం.. నారా లోకేష్ 

    Nara Lokesh : యువగళం పాదయాత్రలో ఆర్ఎం పీలు ఎదుర్కొంటున్న సమస్యలను...