TDP : టీడీపీ గెలుపు కోసం ప్రత్యర్తులుగాఉన్న వారు సైతం పంతాలు పక్కనపెట్టి కలిసిపోతున్నారు. తాజాగా సెంట్రల్ ఆంధ్రలో బలమైన నాయకులు ఇద్దరూ కలిసిపోయారు.
ఎన్టీఆర్ జిల్లా గొల్లపూడి లో కలిసి పని చేస్తామంటూ ప్రకటించిన మాజీ మంత్రి దేవినేని ఉమా, బొమ్మసాని సుబ్బారావు తీరుపై కార్యకర్తలు హర్షం వ్యక్తంచేస్తున్నారు.
నారా లోకేష్ పిలుపునిచ్చిన శంఖారావం కార్యక్రమాన్ని జయప్రదం చేసేందుకు కలిసి పని చేస్తామని ఇద్దరు నేతలు ప్రకటించడం విశేషం.
చంద్రబాబు చేపట్టనున్న ప్రజాగళం యాత్రతో వైసిపి ప్రభుత్వానికి చరమగీతం ఖాయం అంటూ నేతలు ఇద్దరూ నినదించారు.
భవిష్యత్తు బాబు షూరిటీ భవిష్యత్తుకు గ్యారెంటీ కార్యక్రమం ద్వారా సూపర్ సిక్స్ పథకాలను ప్రజల్లోకి తీసుకువెళ్తామని దేవినేని ఉమా ప్రకటించారు.
రేపు సాయంత్రం జేఎన్ఎన్యూఆర్ఎం కాలనీలో బాబు షూరిటీ భవిష్యత్తుకు గ్యారెంటీ కార్యక్రమంలో పాల్గొంటామని స్పష్టం చేశారు.