28.6 C
India
Wednesday, May 8, 2024
More

    Onion Prices : పెరగనున్న ఉల్లి ధరలు?

    Date:

    Onion Prices :
    దేశంలో ధరలు విపరీతంగా పెరుగుతున్నాయి. ఇన్నాళ్లు టమాట భయపెట్టింది. ఇప్పుడు ఉల్లి వంతయింది. ఉల్లి ధరలు కూడా పెరుగుతున్నాయి. దీంతో దేశవ్యాప్తంగా ఆందోళనలు నెలకొంటున్నాయి. సామన్యుడి జీవితం గందరగోళంగా మారనుంది. దాదాపు రెండు నుంచి మూడు నెలల పాటు టమాట ధర రూ. 200 దాటడంతో ప్రజల్లో భయం పట్టుకుంది. ఇప్పుడు ఉల్లి ధర కూడా అదే దారిలో నడవనుంది.
    ఉల్లి ధర పెరుగుతుందనే ఉద్దేశంతో ఉల్లి ఎగుమతులపై కేంద్రం 40 శాతం పన్ను విధించింది. దీంతో రైతుల్లో ఆగ్రహం పెరిగింది. కేంద్రం తీరును తప్పుపట్టారు. కానీ ఇప్పుడు ధరలు పెరుగుతుండటంతో కేంద్రం నిర్ణయం సరైనదే అనే విషయం అందరికి అర్థమవుతోంది. ఈ నేపథ్యంలో ఉల్లి ధర పెరిగితే ప్రజలు కొనుక్కోవడం కష్టంగా మారుతుంది. అందుకే కేంద్రం దిద్దుబాటు చర్యలు తీసుకోవాల్సి ఉంటుంది.
    కర్ణాటక, మహారాష్ట్ర లాంటి ప్రాంతాల్లో ఉల్లి సాగు తగ్గింది. దీంతో ధరలు పెరుగుతున్నాయి. ఉల్లి ధర తగ్గించేందుకు చర్యలు తీసుకోవాల్సిన అవసరం ఏర్పడుతోంది. ఉల్లిని ఎగుమతి చేసేందుకు కేంద్రం ఒప్పుకోవడం లేదు. పెరుగుతున్న ధరలు తగ్గిస్తేనే సామాన్యులకు అవకాశం ఉంటుంది. లేదంటే వారి ఆగ్రహానికి గురికావాల్సి ఉంటుంది. ఈ క్రమంలో ఉల్లి సరఫరా చేసే దేశాల్లో ఈజిప్టు, తుర్కియేల్లో కూడా నిల్వలు నిండుకోవడంతో ధరలు పెరిగే అవకాశం ఉంది.
    ఇరాన్, పాకిస్తాన్ వద్ద కూడా ఉల్లి నిల్వలు తగ్గాయి. ఎగుమతుల నియంత్రణకు భారత్ చర్యలు తీసుకోవడంతో దిగుమతి చేసుకునే దేశాలకు నష్టమే. బంగ్లాదేశ్, శ్రీలంక, మలేషియా లాంటి దేశాలు కూడా ఉల్లిని భారత్ నుంచే దిగుమతి చేసుకుంటున్నాయి. నెల సగటున 13 లక్షల టన్నుల ఉల్లి వినియోగిస్తున్నారు. దేశంలో ఎక్కువగా మహారాష్ట్ర, మధ్య ప్రదేశ్, కర్ణాటక, గుజరాత్, రాజస్తాన్ రాష్ట్రాల్లో ఉల్లి సాగుచేస్తున్నారు. ఉల్లి ఉత్పత్తిలో దిగుబడి తగ్గడంతో ధరలు పెరుగుతున్నాయి.

    Share post:

    More like this
    Related

    Postal Ballot : పోస్టల్ బ్యాలెట్ లో తప్పిదం.. అధికారులపై చర్యలు

    Postal Ballot : పల్నాడు జిల్లా నాదెండ్ల మండలం గణపవరంలో పోస్టల్...

    MLC Kavitha : ఎమ్మెల్సీ కవిత జ్యుడీషియల్ కస్టడీ పొడిగింపు

    MLC Kavitha : ఢిల్లీ మద్యం కుంభకోణం కేసులో బీఆర్ఎస్ ఎమ్మెల్సీ...

    Jharkhand : పనిమనిషి ఇంట్లో నోట్ల గుట్టలు

    Jharkhand : ఝార్ఖండ్ లో ఓ మంత్రి వ్యక్తిగత కార్యదర్శి (పీఎస్)...

    Divi Vadthya పిక్ టాక్: బ్రాలెట్ లో ‘దివి’స్ మెస్మరైజింగ్ పిక్స్..

    Divi Vadthya : తెలుగు అమ్మాయి దివి వడ్త్య గ్లామర్ క్వీన్...

    POLLS

    [yop_poll id="2"]

    Latest News

    - Download the UBlood app here -

    Photos

    - Advertisement -

    Popular

    More like this
    Related

    Onion : ఎగుమతుల కోత.. దేశంలో ఉల్లిని కట్టడి చేసే కేంద్రం ఎత్తుగడ

    Onion : ఉల్లి చేసిన మేలు తల్లి కూడా చేయదంటారు. ఉల్లి...

    Onion : ఉల్లిపాయతో షుగర్ కు చెక్ పెట్టొచ్చు

    Onion : దేశంలో డయాబెటిస్ వేగంగా విస్తరిస్తోంది. మనదేశం షుగర్ కు...