Women’s Reservation Bill :
అతివను అందలం ఎక్కించేలా మహిళాబిల్లు పెట్టాలని ఎన్నో ఏళ్లుగా డిమాండ్ వినిపిస్తున్నది. తాజాగా కేంద్రంలోని ఎన్డీఏ సర్కారు లోక్ సభలో 33 శాతం రిజర్వేషన్ కల్పించే దిశగా మహిళా బిల్లును ప్రవేశపెట్టింది. ప్రస్తుతం దేశవ్యాప్త రాజకీయాల్లో ఇది చర్చనీయాంశమైంది. అయితే నియోజకవర్గాల పునర్విభజన అనంతరమే ఈ బిల్లు అమల్లోకి వచ్చే అవకాశమున్నది. అంటే 2029 సార్వత్రిక ఎన్నికల నాటికి ఈ బిల్లుపై పూర్తిస్థాయి స్పష్టత వస్తుంది. అయితే ఏయే నియోజకవర్గాల్లో మహిళా ఓటర్ల సంఖ్య అధికంగా ఉందనే విషయమై ఇప్పటికే పార్టీల నేతలు ఆరా తీస్తున్నారు.
ఏపీలో మొత్తంగా 175 అసెంబ్లీ, 25 లోక్ సభ నియోజకవర్గాలు ఉన్నాయి. వీటి పరిధిలో చూసుకుంటే ఈ నెల జనవరి 5 వతేదీవరకు ఓటర్ జాబితా ప్రకారం మహిళా ఓటర్ల సంఖ్య అధికంగా ఉన్న నియోజకవర్గాలను పరిశీలిస్తే ఇవిధంగా ఉన్నాయి. అయితే తర్వాత నియోజకవర్గాల పునర్విభజన చేస్తే మరిన్ని నియోజకవర్గాలు కూడా రాష్ర్టంలో పెరిగే అవకాశం ఉంది. అయితే ప్రస్తుతం చూసుకుంటే 25 లోక్ సభ స్థానాలు రాష్ర్టంలో ఉన్నాయి. ఇందులో మహిళలకు 33 శాతం రిజర్వేషన్ కింద 8 స్థానాలు కేటాయించాల్సి ఉంటుంది. అయితే మహిళా ఓటర్లు అధికంగా ఉన్న నియోజకవర్గాలు పరిశీలిస్తే విశాఖపట్నం, గుంటూరు, నరసరావుపేట, నెల్లూరు, తిరుపతి(ఎస్సీ), అనంతపురం, నంద్యాల, విజయవాడ నియోజకవర్గాలు ఉన్నాయి. అయితే ఇందులో నగర ప్రాంతాలే అధికంగా కనిపిస్తున్నాయి.
ఇక రాష్ట్రంలో ప్రస్తుతం 175 అసెంబ్లీ స్థానాలు ఉన్నాయి. ఇందులో మహిళా బిల్లు ప్రకారం 58 స్థానాలు మహిళలకే కేటాయించాల్సి ఉంటుంది. ఇందులో ఇప్పటివరకు ఉన్న లెక్కల ప్రకారం.. మహిళా ఓటర్లు అధికంగా ఉన్న నియోజకవర్గాలు ఇవే. దీనిపై ఇప్పటికే ఆయాపార్టీల నేతలు లెక్కలు కూడా వేసుకుంటున్నారు. ఇందులో భీమిలి, పాణ్యం, గాజువాక, చంద్రగిరి, తిరుపతి, మంగళగిరి, పెనమలూరు, రంపచోడవరం (ఎస్టీ), పెందుర్తి, గురజాల, విశాఖపట్నం నార్త్, కోవూరు, కర్నూలు, విజయవాడ తూర్పు, విజయవాడ సెంట్రల్, గుంటూరు పశ్చిమ, గన్నవరం, మైలవరం, నెల్లూరు గ్రామీణం, తెనాలి, నంద్యాల, అనంతపురం అర్బన్, ఇచ్చాపురం, కడప, శ్రీకాకుళం, చింతలపూడి (ఎస్సీ), రాజమహేంద్రవరం నగరం, ప్రత్తిపాడు(ఎస్సీ), రాజమహేంద్రవరం రూరల్, గుంతకల్లు, కాకినాడ నగరం, పలమనేరు, విశాఖ తూర్పు, మాచర్ల, వినుకోండ, కాకినాడ రూరల్, భీమవరం, రాయదుర్గం, మదనపల్లె, పోలవరం (ఎస్టీ), కావలి, జమ్మలమడుగు, కొత్తపేట, పాయకరావుపేట (ఎస్సీ), శ్రీకాళహస్తీ, ప్రొద్దుటూరు, ఆదోని, విజయనగరం, రాయచోటి, కదిరి, రాప్తాడు, ఆలూరు, గుంటూరు తూర్పు, విజయవాడ వెస్ట్, గూడూరు (ఎస్సీ), ఒంగోలు, బనగానపల్లె, తాడిపత్రి నియోజకవర్గాలు ఉన్నాయి.