39.6 C
India
Monday, April 29, 2024
More

    Rahul Gandhi : రాహుల్ మరో ‘యాత్ర’.. ఈ సారి స్టాండ్ మార్చిన ఏఐసీసీ నేత!

    Date:

    Rahul Gandhi
    congress leader rahul gandhi

    Rahul Gandhi : పదేళ్లుగా కేంద్రంలో అధికారినికి కాంగ్రెస్ పార్టీ దూరం కావడంతో ఈ సారి ఎలాగైనా అధికారం దక్కించుకోవాలని రాహుల్ గాంధీ శతవిధాలా ప్రయత్నాలు చేస్తున్నారు. I.N.D.I.Aలో కీలక భూమిక పోషిస్తున్న కాంగ్రెస్ పార్టీ కేంద్రంలో ప్రభుత్వ మార్పును తమ భుజస్కందాలపై వేసుకుంటుంది. ఇందులో భాగంగా కాంగ్రెస్ పార్టీ జాతీయ నాయకుడు రాహుల్ గాంధీ పాదయాత్రలు నిర్వహిస్తున్నాడు.

    గతంలో ‘భారత్ జోడో’ యాత్ర నిర్వహించారు రాహుల్ గాంధీ. కన్యాకుమారి నుంచి కశ్మీర్ వరకు యాత్ర కొనసాగింది. వందలాది కిలో మీటర్లు, పదుల సంఖ్యలో రాష్ట్రాలను కలుపుకుంటూ యాత్ర సాగింది. ఆయా రాష్ట్రంలోకి ప్రవేశించడంతో అక్కడి కాంగ్రెస్ నాయకులు గుంపులు గుంపులుగా కదిలి వచ్చి యాత్రకు ఉత్సాహం నింపారు. కానీ ఇటీవల జరిగిన మినీ జమిలి (ఐదు రాష్ట్రాల ఎన్నికలు)లో కనిపించలేదు. ఐదు రాష్ట్రాలకు ఎన్నికలు జరిగితే ఒక్క (తెలంగాణ) రాష్ట్రంలో తప్ప ఎక్కడా కాంగ్రెస్ పార్టీ మ్యాజిక్ ఫిగర్ దరిదాపుల్లోకి కూడా రాలేదు.

    ఇదంతా పక్కన ఉంచితే ఇప్పుడు రాహుల్ గాంధీ మరో యాత్రకు శ్రీకారం చుడుతున్నారు. ‘భారత్ జోడో’కు కొనసాగింపుగానే ‘భారత్ న్యాయయాత్ర’ చేయాలని నిర్ణయించారు. దాదాపు జనవరి ఫస్ట్ వీక్ లో దీనికి సంబంధించి పార్టీ నుంచి అధికారిక ప్రకటన కూడా వెలువడనుంది. జనవరి 14వ తేదీ నుంచి మార్చి 20వ తేదీ వరకు యాత్ర సాగుతుంది. నాగాలాండ్, మేఘాలయ, బెంగాల్, బిహార్, ఝార్ఖండ్, ఛత్తీస్‌గఢ్, ఉత్తర ప్రదేశ్, మధ్య ప్రదేశ్, గుజరాత్ మీదుగా ఈ యాత్ర సాగునుంది. 6200 కి. మీ వరకు ఈ ప్రయాణం సాగుతుంది.

    పార్లమెంట్ ఎన్నికలు వస్తున్న తరుణంలో ఈ యాత్రపై కాంగ్రెస్ శ్రేణుల్లో నమ్మకం కలిగిస్తుందని కాంగ్రెస్ పార్టీ భావిస్తోంది. ఈ యాత్ర ఏ మేరకు సక్సెస్ అవుతుందో చూడాలని రాజకీయ విశ్లేషకులు అభిప్రాయం వ్యక్తం చేస్తున్నారు.

    Share post:

    More like this
    Related

    T20 World Cup 2024 : అమెరికా ఫ్లైట్ ఎవరెక్కబోతున్నారు

    T20 World Cup 2024 : అమెరికా వెస్టిండీస్ వేదికగా జూన్ 1...

    JP Nadda : అన్ని రంగాల్లోనూ బీఆర్ఎస్ అవినీతి: జేపీ నడ్డా

    JP Nadda : అన్ని రంగాల్లోనూ బీఆర్ఎస్ అవినీతికి పాల్పడిందని బీజేపీ...

    PM Modi : పండ్ల వ్యాపారిని కలిసిన మోదీ

    PM Modi : ఎన్నికల ప్రచారంలో  భాగంగా ప్రధానమంత్రి మోదీ తాజాగా...

    Congress-BJP : కాంగ్రెస్ అభ్యర్థి నామినేషన్ వెనక్కి.. బీజేపీలో చేరిక

    Congress-BJP : లోక్ సభ ఎన్నికల వేళ కాంగ్రెస్ పార్టీకి షాక్...

    POLLS

    [yop_poll id="2"]

    Latest News

    - Download the UBlood app here -

    Photos

    - Advertisement -

    Popular

    More like this
    Related

    CM Revanth : ఢిల్లీకి బయలుదేరిన సీఎం రేవంత్ రెడ్డి..

    CM Revanth :  సీఎం రేవంత్ రెడ్డి ఢిల్లీకి పైనమ య్యా...

    Telangana Congress : తెలంగాణలో కాంగ్రెస్ హవా.. బీజేపీ, బీఆర్ఎస్ హోరాహోరీ..!

    Telangana Congress : మొన్న జరిగిన అసెంబ్లీ ఎన్నికల్లో రాష్ట్రంలో కాంగ్రెస్ విజయం...

    Priyanka Gandhi : ప్రియాంక గాంధీకి అస్వస్థత, ఆస్పత్రికి తరలింపు..

    Priyanka Gandhi : కాంగ్రెస్ సీనియర్ నేత ప్రియాంక గాంధీ  అస్వ స్థతకు...

    Revanth-Sharmila : సీఎం రేవంత్ రెడ్డితో భేటీ అయిన వైఎస్ షర్మిల.. భేటీ వెనుక మాస్టర్ ప్లాన్..?

    Sharmila-Revanth : ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర కాంగ్రెస్ పార్టీ అధ్యక్షురాలిగా వైఎస్ షర్మిల...