Ram Madhav Ji : భారత్ అమృత కాలం దిశగా పురోగమిస్తుంది. భారత్ ను వెంటాడుతున్న సమస్యలను ప్రధాని మోదీ నేతృత్వంలోని బీజేపీ ప్రభుత్వం చక్కదిద్దుకుంటూ వెళ్తోంది. 2047 నాటికి స్వాతంత్ర్య భారత్ వందేళ్లు పూర్తిచేసుకుంటుంది. ఈ క్రమంలో అభివృద్ధి చెందిన దేశంగా చూడాలనే కలను నిజం చేయడానికి మోదీ సర్కార్ ప్రయత్నాలు చేస్తోంది.
కోట్లాది హిందువుల ఆకాంక్ష అయిన అయోధ్య రామాలయ నిర్మాణాన్ని మోదీ అత్యంత సామరస్యపూర్వకంగా పూర్తి చేశారు. దీంతో రామరాజ్యం కల సాకారానికి అడుగులు పడ్డాయి. దేశం సుభిక్షంగా ఉండి ‘రామరాజ్యభారత్’ వైపు చేరుకోవడానికి మరెన్నో రోజులు లేదు. ఒకప్పుడు భారత్ అంటే ఆహారధాన్యాల నుంచి సాంకేతిక పరికరాల కోసం ఇతర దేశాల వైపు చూసేది. అయితే మోదీ హయాంలో అన్ని రంగాల్లో భారత్ పరుగులు తీస్తోంది. విశ్వగురుగా ఎన్నో దేశాలకు ఆహార పదార్థాలు, ఔషధాలు అందించడమే కాదు పలు దేశాల్లో మౌలిక సదుపాయాల కల్పననూ చేస్తోంది.
ఈక్రమంలో రామరాజ్య భారత్ కల సాకారానికి పాలకులే కాదు ప్రతీ భారతీయుడు ఆరాటపడుతున్నారు. దీనికి ఎన్ఆర్ఐలు తమ వంతు సాయం చేస్తున్నారు. ఇండియన్ అమెరికన్ కమ్యూనిటీ-ఎన్ వై/ఎన్ జే ఆధ్వర్యంలో అమెరికాలో ఎడిసన్ ఎన్ జే లో ‘‘రామమందిరం నుంచి రామరాజ్య భారత్’’ కవాతును ఫిబ్రవరి 25(ఆదివారం) మధ్యాహ్నం 2.30 గంటల నుంచి 4 గంటల వరకు నిర్వహించారు.
ఈ కవాతుకు బీజేపీ మాజీ జనరల్ సెక్రటరీ రామ్ మాధవ్ హాజరయ్యారు. ఆయనతో పాటు జయేశ్ పటేల్, కృష్ణా రెడ్డి, చరన్ సింగ్, గణేష్ రామకృష్ణన్, అమర్ గోస్వామి, అరవింద్ పటేల్, కల్పన శుక్లా, సంతోష్ రెడ్డి, దీప్ భట్, గుంజన్ మిశ్రా, నిమేశ్ దిక్షిత్, మోహన్ దేవరకొండ, సానిల్ నంబియార్, శ్రీకాంత్ తుమ్మల, విలాస్ జంబుల, హారీ సేతి, మధుకర్ రెడ్డి, ప్రతీప్ కట్ట, విజయ్ జోషి, మితేశ్ త్రివేది, వంశీ యంజాల తదితరులు పాల్గొన్నారు.
All Images Courtesy by Dr. Shiva Kumar Anand
More Images : Ram Madhav Ji about Ram Mandir