40.1 C
India
Tuesday, May 7, 2024
More

    Actress Sangeetha : ఆ సమయంలో బాధ భరించలేక మొగుడికి వదిలేద్దాం అనుకున్న.. సంగీత సంచలన కామెంట్స్

    Date:

    Actress Sangeetha : 

    తెలుగు, మలయళ, తమిళ భాషా చిత్రాలో నటించి మెప్పించిన వర్ధమాన కథానాయికల్లో నటి సంగీత గురించి పెద్దగా పరిచయం అవసరం లేదు. ఇప్పటి వరకు యంగ్ హీరోయన్ల పక్కన కూడా తన అందంగా ఆకట్టుకుంటుంది సంగీత. అప్పట్లో ఓ వెలుగు వెలిగిన ఈ తార వ్యక్తిగత కారణాల దృష్ట్యా కొద్ది రోజులు ఇండస్ట్రీకి దూరంగా ఉంది. కాస్త విరామం తర్వాత మళ్లీ ఎంట్రీ ఇచ్చింది. గతేడాది చిరంజీవి సినిమా ‘ఆచార్య’, ‘మసూద’ లో నటించింది. ఈ ఏడాది హీరో శ్రీకాంత్ భార్యగా ‘వారసుడు’ మూవీలో తన నటనతో మరోసారి మెప్పించింది సంగీత. ప్రస్తుతం టాలీవుడ్ తో పాటు కోలీవుడ్ లోనూ పలు చిత్రాల్లో నటిస్తూ బిజీగానే ఉంది.

    రీసెంట్ గా ఓ యూట్యూబ్‌(ప్రేమ) ఛానెల్‌ సంగీతను ఇంటర్వ్యూ చేయగా ఆమె తన మ్యారేజ్ లైఫ్‌కు  సంబంధించి విషయాలను బయటపెట్టింది. సంగీత తన పెళ్లి జీవితం గురించి చెబుతూ ‘ప్రారంభంలో మ్యారేజ్‌ లైఫ్‌ చాలా దారుణంగా ఉండేది. చాలా అసహ్యంగా అనిపించేది. వీలైనంత తొందరగా మ్యారేజ్‌ లైఫ్‌ని వదిలేయాలనుకున్నాను’ అని విస్మయానికి గురి చేసింది. తమిళ నటుడు, సింగర్‌ క్రిష్‌-సంగీత 2009లో  తిరువన్నమలై టెంపుల్‌లో వివాహం చేసుకున్నారు. ప్రస్తుతం వారికి పది సంవత్సరాల పాప ఉంది.

    సహజంగానే వీరి ప్రేమను ఇరు కుటుంబాలు అడ్డుకున్నాయి. పెళ్లికి ససేమీరా అన్నాయి. ఆ సమయంలో తన అత్తింటి నుంచి పుట్టింటి నుంచి ఎన్నో సమస్యలు వచ్చాయని చెప్పింది. ఈ తగాదాల వల్లే తమ కుటుంబాలకు దూరం అయినట్లు ఆమె చెప్పుకచ్చింది. ఈ తగాదాలు గుర్తుకొచ్చినప్పుడల్లా అనవసరంగా తొందరపడి పెళ్లి చేసుకున్న భావన కలుగుతుందని పేర్కొంది. ఆ తర్వాత గతం గురించి ఆలోచించకుండా ఫ్యూచర్ లో ఎలాంటి ఇబ్బందులకు గురి కాకుండా ఉండాలని నిర్ణయించుకున్నాం. చిన్న చిన్న సమస్యలు వచ్చినా ఇద్దరం కలిసి పరిష్కరించుకునే వాళ్లం అని వివరించింది సంగీత.

    Share post:

    More like this
    Related

    YS Jagan : చంద్రబాబుకు 2019 గుర్తు చేసిన జగన్..!

    YS Jagan : వైఎస్ జగన్మోహన్ రెడ్డి మొన్న జరిగిన మచిలీపట్నం...

    Heroine : ముంబైలో 9 మందితో ఒక్క రూమ్ లో నివసించి.. ఇప్పుడు సినిమాకు కోటి నజరానా.. ఆ హిరోయిన్ ఎవరో తెలుసా?

    Heroine : హిరోయిన్లు, హిరోలైన చాలా మంది అవకాశాల కోసం చిన్న...

    Fahadh Faasil : ‘పుష్ప’ నా కెరీర్ కు ఉపయోగపడలేదు: ఫహాద్ పాజిల్

    Fahadh Faasil : ‘పుష్ప’ సినిమాతో మలయాళ నటుడు ఫహాద్ ఫాజిల్...

    PM Modi : పోలింగ్ బూత్ వద్ద మోడీకి రాఖీ కట్టిన మహిళ..

    PM Modi : అహ్మదాబాద్ లోని రాణిప్ లోని నిషాన్ విద్యాలయంలో...

    POLLS

    [yop_poll id="2"]

    Latest News

    - Download the UBlood app here -

    Photos

    - Advertisement -

    Popular

    More like this
    Related

     హీరో విజయ్ భార్యకు విడాకులు ఇవ్వనున్నాడా ?

    ఇళయ దళపతి విజయ్ తన భార్యకు విడాకులు ఇవ్వనున్నాడు అనే వార్తలు...

    ఓటీటీలోకి వచ్చేస్తున్న మసూద

    నవంబర్ 18 న విడుదలైన మసూద అప్పుడే ఓటీటీలోకి వచ్చేస్తోంది. ప్రముఖ...

    ANIL RAVIPUDI- SANGEETHA- MAHESH BABU: మహేష్ సినిమాపై సంచలన వ్యాఖ్యలు చేసిన సంగీత

    మహేష్ బాబు హీరోగా నటించిన సరిలేరు నీకెవ్వరు చిత్రంపై సంచలన వ్యాఖ్యలు...