YCP Rebel MLAs : అమరావతి: వైసీపీ రెబల్ ఎమ్మెల్యేలకు స్పీకర్ మరోసారి నోటీసులు పంపించారు.19న విచారణకు హాజరు కావాలని ఈ మేరకు నోటీసులు జారీ చేశారు. టీడీపీ, వైసీపీ రెబల్ ఎమ్మెల్యేలు నిన్న శుక్రవారం విచారణకు రావాలని స్పీకర్ ఆదేశించారు. కానీ ఇరు పక్షాల ఎమ్మెల్యేలు విచారణకు హాజరుకాలేదు. ముఖ్యంగా నెల్లూరు జిల్లాకు చెందిన వైసీపీ రెబల్ ఎమ్మెల్యే ఆనం రామనారాయణ రెడ్డి ఆదివారం సాయంత్రం 4 గంటలకు స్పీకర్ కార్యాలయంలో హాజరు కావాలని నోటీసు పంపారు. అయితే రేపు ఆయన హాజరవుతారా? లేదా? అన్నది తెలియాల్సి ఉంది. కాగా రాజ్యసభ ఎన్నికల నేపథ్యంలో ఈ నోటీసులు జారీ చేస్తున్నారు.