30.4 C
India
Tuesday, May 7, 2024
More

    China President : వింతగా చైనా అధ్యక్షుడి ప్రవర్తన

    Date:

    PM modi China President
    PM modi China President
    China President : దక్షిణాఫ్రికాలో బ్రిక్స్ సదస్సు జరిగింది. దీనికి పలు దేశాధినేతలు హాజరయ్యారు. మన దేశం నుంచి మన ప్రధాని నరేంద్ర మోడీ పాల్గొన్నారు. అంతర్జాతీయ వేదికల మీద జరిగే సమావేశాలకు ఓ ప్రొటోకాల్ ఉంటుంది. అక్కడ మన దేశాధినేతలకు అనుచరులను రానివ్వరు. ఒక్కరే వెళ్లాలి. అది అక్కడ రూల్. దీంతో ఏ నేత అయినా సరే ఒక్కరే పాల్గొనడం ఆనవాయితీ.
    ఈ సమావేశానికి వెళ్లిన దేశాధినేతల్లో చైనా అధ్యక్షుడు జిన్ పింగ్ కూడా ఉన్నారు. వారు పాల్గొనే సమావేశానికి వెళ్లే సమయంలో కొంత దూరం అనుచరులు వచ్చినా సమావేశ హాల్లోకి మాత్రం ఎవరిని రానివ్వరు. హాల్లోకి అడుగుపెట్టగానే తలుపు వేసేస్తారు. దీంతో అక్కడకు ఇంకెవరిని కూడా అనుమతించరు. ఇది ప్రతి సమావేశంలోనూ జరిగేదే.
    అయితే ఇక్కడ చైనా అధ్యక్షుడు వెళ్లే సందర్భంలో హాల్లోకి అడుగు పెట్టగానే ఆయన వెంట ఉన్న అనుచరుడిని ఆపేసి తలుపు వేసేశారు. దీంతో జిన్ పింగ్ వెనకకు తిరిగి చూసుకుని ఉలిక్కిపడ్డారు. ఇది జిన్ పింగ్ కు కలిగిన భయమా? లేక అనుమానమా? అనే కోణంలో అక్కడున్న వారందరు చూశారు. ఒక దేశాధినేతకు ఇంత పిరికితనమా అనే వాదనలు కూడా వస్తున్నాయి.
    జిన్ పింగ్ అంతర్జాతీయ సమావేశాలకు ఇదివరకు వెళ్లిన వాడే. నిబంధనలు తెలిసినవాడే. కానీ అతడిలో భయం చూసి అందరు ఆశ్చర్యపోయారు. పెద్ద దేశానికి అధ్యక్షుడైనా కనీస మర్యాదలు పాటించపోవడంపై విమర్శలు వెల్లువెత్తుతున్నాయి. అంతర్జాతీయ సదస్సుల్లో దేశ అగ్రనేత ఇలా వ్యవహరించడం అనేక సందేహాలకు తావిచ్చింది.

    Share post:

    More like this
    Related

    DIG Ammireddy : అనంతపురం డీఐజీ అమ్మిరెడ్డి బదిలీ – తక్షణమే రిలీవ్ కావాలని ఈసీ ఆదేశం

    DIG Ammireddy : ఎన్నికల వేళ పలువురు పోలీసు అధికారులను ఎన్నికల...

    MLC Kavitha : ఎమ్మెల్సీ కవితకు మళ్లీ చుక్కెదురు – మద్యం కేసులో నో బెయిల్

    MLC Kavitha : మద్యం కేసులో బీఆర్ఎస్ ఎమ్మెల్సీ కవితకు మళ్లీ...

    Pawan Kalyan : దట్ ఈజ్ పవన్.. షారూఖ్ కన్నా ఎక్కువ డబ్బులిస్తామన్నా నో చెప్పాడట

    Pawan Kalyan : పవర్ స్టార్ పవన్ కల్యాణ్ గురించి.. ఆయనకున్న...

    POLLS

    [yop_poll id="2"]

    Latest News

    - Download the UBlood app here -

    Photos

    - Advertisement -

    Popular

    More like this
    Related

    South Africa : లోయలో పడిన బస్సు.. 45మంది మృతి

    South Africa : దక్షిణాఫ్రికాలో ఘోర రోడ్డు ప్రమాదం జరిగింది. బోట్స్...

    India Vs South Africa : 120 ఏళ్ల లో ఎప్పుడూ ఇలా జరగలేదు..

    India Vs South Africa : సౌత్ ఆఫ్రికా-భారత్ రెండో టెస్టు...

    PM Narendra Modi : వాహ్.. మోదీ.. దేశ ప్రజలను మెప్పించిన ఏకైక నాయకుడు

    PM Narendra Modi : ప్రధాని నరేంద్ర మోదీ.. తనదైన శైలిలో పాలననందిస్తూ...

    Vaccine War viral Video : ‘వాక్సిన్ వార్’పై ప్రధాని కామెంట్స్.. వీడియో వైరల్..

    Vaccine War viral Video : బాలీవుడ్ దర్శకుడు వివేక్ అగ్నిహోత్రి...