Nara Lokesh : వైసిపి పాలన లో 300 మంది బీసీలు ఆత్మహత్యకు గురయ్యారని టిడిపి జాతీయ ప్రధాన కార్యదర్శి నారా లోకేష్ అన్నారు. బీసీలకు చెందిన 30 సంక్షేమ కార్యక్రమాలను జగన్ నిలిపివేశారని లోకేష్ మండిపడ్డారు. సబ్ ప్లాన్ నిధులు దారి మళ్ళించారని ఆరోపించారు.
గత ఐదేళ్లుగా బీసీలకు ఏం చేశారో జగన్ చెప్పాల ని లోకేష్ డిమాండ్ చేశారు. మా ప్రభుత్వం వచ్చాక ఆదరణ పథకం కింద ఐదు వేల కోట్లు ఖర్చుపెట్టి పనిముట్లు అందిస్తామని నారా లోకేష్ తెలిపారు. బీసీ భవనాలను పూర్తి చేస్తామని బీసీల కోసం ప్రత్యేక రక్షణ చట్టాన్ని తీసుకొ స్తా మని నారా లోకేష్ ప్రకటించారు.
వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ పాలనలో బీసీలు అన్యాయ మైపోయారని లోకేష్ ఆరోపించారు. బీసీల కోసం తెలుగుదేశం పార్టీ గతంలో అనేక సంక్షేమ కార్యక్రమాలను అమలు చేసిందని లోకేష్ తెలిపా రు. నేడు వైసిపి ప్రభుత్వం వచ్చాక బీసీలకు రక్షణ లేకుండా పోయిందన్నారు.